
రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
తిరుపతి ఎంపీ డాక్టర్ వి.వరప్రసాద్
కలువాయి: ప్రజా సమస్యలపై గళం విన్పించే ఎమ్మెల్యే రోజాపై అసెంబ్లీలో ఏడాదిపాటు సస్పెన్షన్ విధించడం దారుణమని, కోర్టు ఉత్తర్వులను గౌరవించి ఆమెపై విధించిన సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తేయాలని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. మండలంలో సోమవారం పర్యటించిన ఆయ న మాట్లాడారు. ఒక ఎమ్మెల్యేను ఏడా ది పాటు సస్పెండ్ చేయడం చరిత్రలో లేదని, గౌరవ ముఖ్యమంత్రి, స్పీకర్‌లు ఈవిషయమై తక్షణమే స్పందించాలన్నారు.
కలలు కనండి...నిజం చేసుకునేందుకు కృషి చేయండి:
విద్యార్థులు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన విధంగా కలలు కనాలని, వాటిని సాధించుకునేందుకు కష్టపడి కృషిచేయాలని సూచించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. ఉన్నత ఆశయాలు ఏర్పరచుకుని వాటిని సాధించేందుకు కృషిచేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఇప్పుడు సాధిస్తున్న మార్కులు పదిశాతం ఎక్కువ సాధించాలని, అలా సాధించిన విద్యార్థులకు వచ్చే ఏడాది బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠశాలలో నీటి ట్యాంకు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానన్నారు.పాఠశాల ప్రహరీ ఎత్తు పెంచేందుకు జెడ్పీ నుంచి రూ.5 లక్షలు మం జూరు చేయించిన జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డికి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూకనపల్లి బీసీ కాలనీని ఎంపీ పరిశీలించారు.