
హైకోర్టు తీర్పు హర్షనీయం
కర్నూలు(ఓల్డ్‌సిటీ): చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన విషయంలో చివరకు న్యాయమే గెలిచిందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు ఎ.నారాయణమ్మ మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో మహిళా శాసన సభ్యురాలు రోజాను అన్యాయంగా సస్పెండ్ చేశారని పేర్కొన్నారు.
రోజాకు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడం హర్షనీయమన్నారు. చంద్రబాబు నాయుడు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి రాజకీయాలకు విలువలు లేకుండా చేశారన్నారు. ధైర్యం ఉంటే పార్టీ మారిన ఎమ్మెలతో రాజీనామా చేయించి గెలుపొందాలని సూచించారు. వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పి.జి.నరసింహులు యాదవ్, సలోమి తదితరులు పాల్గొన్నారు.