విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 37వ వార్డు పరిధి బింగివీధి, డక్కిన వీధి ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు బోరుబావులను ఎమ్మెల్యే గీతతో పాటు మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో రెండు బోరుబావులు చొప్పున మొత్తం 80 బోరుబావులు ఏర్పాటు చేసేందుకు రూ.50లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కందిమురళీనాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం’
Published Fri, Nov 6 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM
Advertisement
Advertisement