meesala geetha
-
Cheepurupalli: తెరపైకి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తొలుత టీడీపీ... తర్వాత ప్రజారాజ్యం.. ఆ తర్వాత కాంగ్రెస్.. మళ్లీ టీడీపీ... స్థిరంగా ఒక నియోజకవర్గం లేదు. స్థిరంగా ఒక పార్టీలోనూ లేరు. ప్రజలను మభ్యపెట్టి గెలవాలి. తర్వాత ముఖం చాటేయాలి!. ఇదంతా చెబుతుంటే ఉత్తరాంధ్రలో ఠక్కున గుర్తుకొచ్చే ఏకై క వ్యక్తి... గంటా శ్రీనివాసరావు!. ఇప్పుడు ఆయనను విజయనగరం జిల్లాపై రుద్దేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పదేపదే ఒత్తిడి తెస్తున్నారు. ఎలాగోలా ‘గంటా’ బెడదను విదిల్చుకునేందుకు చూస్తున్నారు. అయితే, ఆయన చంద్రబాబు చెబితే వెళ్తానంటూనే.. ఓడిపోయే టిక్కెట్ వద్దంటూ మరోవైపు నిరాకరిస్తున్నారు. ఇన్నాళ్లూ టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ కోసం పనిచేసిన కిమిడి నాగార్జునకు వెన్నుపోటు తప్పలేదు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణను ఢీ కొట్టాలంటే పనికిరాడంటూ ఓ ముద్రవేసి పక్కనపెట్టేశారు. గంటా చీపురుపల్లి పోనంటే ప్రత్యామ్నాయంగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు తాడేపల్లిలో చంద్రబాబు నివాసం నుంచి పిలుపుతో కిమిడి నాగార్జున మంగళవారం హుటాహుటిన బయల్దేరివెళ్లారు. జిల్లాలో అత్యంత ప్రాధాన్యమైన చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి అత్యంత గందరగోళంగా మారింది. డోలాయమానంలో నాగార్జున.. నలభై సంవత్సరాలు పార్టీ చరిత్ర, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు, ఎర్ర బుక్‌లో అందరి పేర్లు రాస్తున్నా అని హెచ్చరించే లోకేశ్, వీరికి మద్దతుగా పవన్ కల్యాణ్... ఇంకేముంది 2024 ఎన్నికల్లో మేము హిట్ అనే భ్రమలో టీడీపీ క్యాడర్ ఇన్నాళ్లూ ఉంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అందుకు చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితే అందుకు అద్దం పడుతోంది. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కిమిడి నాగార్జున ఎక్కడున్నాడో తెలియదు. నాలుగు మండలాల్లో పార్టీ క్యాడర్ ఏమైందో, ఎక్కడుందో తెలియదు. పార్టీ కార్యక్రమాలు లేవు. ఈ నెల 21న ఈనాడు పత్రికలో ‘బొత్సకు పోటీగా గంటా’ అనే శీర్షికన వచ్చిన వార్తతో నాగార్జున హతాశులయ్యారు. పార్టీ పగ్గాలు పూర్తిగా వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అతనికి చంద్రబాబు నుంచి కబురు రావడంతో తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు. మీసాల గీత పేరు పరిశీలన... గంటాను పంపుతున్నారని తెలిసినప్పటి నుంచి చీపురుపల్లి టీడీపీ క్యాడర్ తీవ్ర అసహనంలో ఉంది. స్థానికంగా తమకు అందుబాటులో ఉండే నేత కావాలని, ఎన్నికల తరువాత ముఖం చాటేసే నాయకులు వద్దని కోరుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు తెరపైకి వచ్చింది. ఆమెకు టిక్కెట్ ఇస్తే ఎలా ఉంటుందని నెల రోజుల కిందటే ఐవీఆర్ఎస్ ద్వారా టీడీపీ శ్రేణుల అభిప్రాయాన్ని చంద్రబాబు సేకరించారు. అంతేకాకుండా ఇటీవల శంఖారావం సభ కోసం చీపురుపల్లి వచ్చిన నారా లోకేశ్‌ను మీసాల గీత కలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గంటా గెంటివేతకు యత్నాలు... నిరంతరం ప్రజలకు సేవలు అందిస్తూ, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ వైఎస్సార్సీపీ మరింత బలపడింది. తన ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుంది. దీనికితోడు ప్రజలతో నిత్యం మమేకమయ్యే మంత్రి బొత్స సత్యనారాయణను ఢీ కొట్టాలంటే నాగార్జున సహా జిల్లాలోని టీడీపీ నేతలెవరూ సరిపోరని ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తోంది. పొరుగు జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావును ఇక్కడకు పంపాలని, తద్వారా విశాఖ జిల్లా నుంచి గెంటివేయాలనే యోచనలో ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తనకు చీపురుపల్లి టిక్కెట్ వద్దని, నెల్లిమర్ల కానీ, భీమిలి కానీ ఇవ్వాలని గంటా కోరుతున్నారు. నెల్లిమర్ల టిక్కెట్ ఇప్పటికే జనసేన అభ్యర్థి లోకం మాధవికి పవన్ కల్యాణ్ ప్రకటించేయడంతో ఇక అక్కడ కుదిరే పరిస్థితి లేదు. భీమిలి కూడా ఇవ్వలేని పక్షంగా మళ్లీ తన పాత స్థానం చోడవరం టిక్కెట్ అయినా ఇవ్వాలని గంటా కోరుతున్నట్లు తెలిసింది. ఇన్నాళ్లూ బాధ్యతలు మోసినా... చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్స సత్యనారాయణకు చాలా పట్టు ఉంది. గ్రామగ్రామాన ఆయన అనుచరగణం ఉంది. ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ స్వగ్రామం చీపురుపల్లి కావడం, వైఎస్సార్సీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మెరకముడిదాం మండలం నుంచి ఏకగ్రీవ జెడ్పీటీసీ కావడం అదనపు బలాలు. ప్రతి ఊరి నాయకులు తామే అభ్యర్థి అన్న భావంతో విజయానికి శ్రమిస్తారు. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ చేతిలో భారీగా ఓట్ల తేడాతో కిమిడి నాగార్జున ఓటమి పాలయ్యారు. వేరే విధిలేని పరిస్థితుల్లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా, చీపురుపల్లి టీడీపీ ఇన్చార్జిగా ఆయనే ఇన్నాళ్లూ బాధ్యతలు చూస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల ప్రకటించిన తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పనికిరాడని ఆ పార్టీ అధిష్టానం తేల్చిచెప్పకనే చెప్పడంతో ఆయన పూర్తి నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. -
విజయనగరం కోటలో అలజడి: ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది?
ఆ కోటలో రాజుగారికి తిరుగు లేదు. ఆ వూరిలో రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. కాని కొద్ది రోజులుగా రాజు మీద తిరుగుబాటు మొదలైంది. పార్టీలో పోరు ప్రారంభమైంది. అధినాయకత్వం రాజు వెంట... కార్యకర్తలు బీసీ నేత వెంటా నడుస్తున్నారు. ఇంతకీ ఆ రాజు ఎవరో..ఆయన రాజ్యంలో ఏం జరుగుతోంది? విజయనగరం కోటలో అలజడి రేగింది. గత ఎన్నికల వరకు విజయనగరం జిల్లాలో పూసపాటి వారి మాటకు ఎదురు లేదు. వారు చెప్పిందే చట్టం. అయితే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జిల్లా నుంచి తుడిచిపెట్టుకుపోయింది. అయినప్పటికీ రాజుగారి మాటే తెలుగుదేశం పార్టీలో వేదంగా కొనసాగుతోంది. 2014లో విజయనగరం అసెంబ్లీ సీటుకు టీడీపీ తరపున పోటీ చేసిన మీసాల గీత విజయం సాధించారు. ఆమె ఇటీవల రాజుగారికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. 2014లో అశోక్‌గజపతి రాజు లోక్‌సభకు పోటీ చేయగా... మీసాల గీత అసెంబ్లీకి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో ఇద్దరూ గెలిచారు. గత ఎన్నికల్లో గీతకు సీటు ఇవ్వలేదు. లోక్‌సభకు అశోక్‌గజపతి, అసెంబ్లీకి ఆయన కుమార్తె పోటీ చేశారు. ఇద్దరు ఓడారు. వచ్చే ఎన్నికల్లో మీసాల గీత.. తనకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తన డిమాండ్‌ను, బీసీల జనాభా సంఖ్యను ఆధారాలతో పార్టీ అధినేత చంద్రబాబుకు ఆమె అందించారు. అలాగే చూద్దాం అంటూ ఆమెకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. తర్వాత అశోక్ చెప్పిన మాటే వింటున్నారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. అసలే జిల్లాలో పార్టీ వీక్‌గా ఉందంటే ఇదేం గొడవ అని తలలు పట్టుకుంటున్నారు. ఈ గొడవలన్నీ ఇలా ఉండగానే.. కోట బయట మీసాల గీత పార్టీ ఆఫీస్ పెట్టగా దాన్ని అశోక్ తొలగించారు. ఆపై తన దివాణంలోనే ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంలో కూడా గీత మాట చెల్లలేదు. చంద్రబాబు గోడ మీద కూర్చుని వినోదం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గంలో ఉన్న బీసీల జనాభాను కులాలవారీగా ఫ్లెక్సీల రూపంలో పట్టణంలో అనేక చోట్ల ఏర్పాటయ్యాయి. రాజుగారి కోట బయట కూడా ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవై వేల మంది ఉన్నారని.. రాజ్యాధికారం బీసీలకే ఇవ్వాలంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో వెలసిన ఫ్లెక్సీలు పట్టణంలో కలకలం రేపాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం ఎటాక్ ప్రారంభించింది. అయితే జిల్లాలో అశోక్‌గజపతి రాజు మాట కాదని చంద్రబాబు ఏమీ చేయలేరనే విషయం అందరికీ తెలుసు. 2014లో గెలిచినప్పటికీ తనకు 2019లో మెండి చేయి చూపిన టీడీపీ అధినాయకత్వం మీద మీసాల గీత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి సిద్ధమనే సంకేతాలు ఇస్తున్నారు. -
టీడీపీలో కలవరపెడుతున్న ఫ్లెక్సీలు
-
విజయనగరం టీడీపీలో ఫ్లెక్సీ వార్.. అశోక్ గజపతి రాజుపై ధిక్కార స్వరం
సాక్షి, విజయనగరం: విజయనగరం టీడీపీలో విభేదాలు మదిరిపాకాన పడ్డాయి. మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుపై బీసీ మహిళా, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత గత కొద్ది రోజుల క్రితం ధిక్కార స్వరం వినిపించారు. బీసీలు ఎక్కువగా ఉన్న విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీలకే టికెట్ ఇవ్వాలన్నది ఆమె డిమాండ్. ఈ నేపథ్యంలో అశోక్ గజపతి రాజు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఆమె డుమ్మా కొడుతున్నారు. నేరుగా చంద్రబాబుతోనే అమె టచ్‌లో ఉంటున్నారు. చదవండి: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం మరోపక్క నియోజకవర్గంలో అశోక్ గజపతి రాజును వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో బీసీలు లక్షా అరవైవేల మంది ఉన్నారంటూ, రాజ్యాధికారం బీసీలకే ఇవ్వండంటూ బీసీ ఐక్యవేదిక పేరుతో ఫ్లెక్సీలు విజయనగరం పట్టణంలో కీలక ప్రాంతాల్లో వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇది మీసాల గీత వర్గీయుల పనే అంటూ అశోక్ గజపతి వర్గం కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది. -
మొదటి కొచ్చిన విజయనగరం టీడీపీ లొల్లి
సాక్షి, విజయనగరం: జిల్లా తెలుగుదేశం ముఖ్య నేతలు మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీ ఎమ్మెల్యే మీసాల గీత మధ్య పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. టీడీజీ జిల్లా కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి అధిష్టానం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మీసాల గీత మరలా తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం అని బోర్డు తగిలించారు. కాగా, అశోక్ గజపతిరాజు, మీసాల గీత మధ్య టీడీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అశోక్ గజపతిరాజు బంగ్లా నుంచి పార్టీ కార్యాలయాన్ని ఎత్తేయాలని ఆమె కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో అశోక్ వర్గానికి వ్యతిరేకంగా వారం రోజుల క్రితం ఆమె పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో గీతపై అశోక్ వర్గం అమరావతిలో చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అశోక్ గజపతిరాజు బంగ్లాకు బదులు కొత్త కార్యాలయం ఏర్పాటు చేస్తామని, పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని హామినిచ్చారు. అధిష్టానం హామీ మేరకు ఆమె బోర్డు తొలగించి వారం గడుస్తున్నా.. నూతన కార్యాలయం ఏర్పాటు జరగలేదు. అధిష్టానం ఎటువంటి స్పష్టతా ఇవ్వలేదు. దీంతో ఆమె మరోమారు తన కార్యాలయానికి విజయనగరం టీడీపీ కార్యాలయం బోర్డును ఏర్పాటు చేశారు. ఇక చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కొనసాగుతోంది. (చదవండి: చంద్రబాబు వద్దకు జిల్లా టీడీపీ పంచాయితీ ) -
విజయనగరం టీడీపీలో ముదిరిన వర్గపోరు
సాక్షి, విజయనగరం: విజయనగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్గపోరు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లింది. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత, టీడీపీ కార్యకర్తలు బంగ్లా రాజకీయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై అశోక్ గజపతిరాజు, ఆయన వర్గీయులు అధిష్టానానికి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం నుంచి గాని, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నుంచిగానీ పార్టీ కార్యాలయం మూసివేయాలని ఆదేశాలు రాకపోవడంతో అశోక్ వర్గీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ విషయాన్ని వెలగపూడిలోనే అధినేత వద్దే తేల్చుకుందామని అశోక్ సూచనలతో నియోజకవర్గ నేతలు మంగళవారం విజయవాడకు బస్సు, కార్లలో బయలుదేరి వెళ్లారు. అధినేత అపాయింట్మెంట్ బుధవారం లభించడంతో వారు చంద్రబాబుతో భేటీ కానున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గీత కు అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నా యుడు లోపాయికారీగా మద్దతు అందిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకోవడం విశేషం. చదవండి: (అచ్చెన్నాయుడికి అక్కడ మాట్లాడే దమ్ముందా..?) టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడికి పరాభవం గుర్ల: తెలుగుదేశం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జునకు పరాభావం ఎదురయ్యింది. అక్రమణదారుల కు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ఆయనకు చేదు అనుభవం ఎ దురైంది. మండలంలోని చింతలపేటలో గ్రామకంఠం భూమి సర్వే నంబర్ 34, 36లో 22 సెంట్ల భూమిని టీడీపీ నేతలు అక్రమించుకున్నారు. ఆ స్థలంలో అధికారులు రైతు భరోసా కేంద్రం, పాలశీతలీకరణ కేంద్రం నిర్మించాలని నిర్ణయించారు. ఆ అభివృద్ధి పనులను టీడీపీ నేతలు అడ్డుకోవడంతో గ్రామంలో వివాదం నెలకొంది. నాగార్జున కారును అడ్డుకున్న చింతలపేట గ్రామస్తులు ఆ స్థలాన్ని అక్రమించిన అక్రమణదారులకు మద్దతు తెలిపేందుకు నాగార్జున మంగళవారం ఆ గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకు న్న గ్రామస్తులు ఆయన్ను అడ్డుకొని గ్రామంలో అభివృద్ది పనులను అడ్డుకుంటారా... పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే మీరెందుకు ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కాసే పు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకొని నాగార్జునను, మండల టీడీపీ నేతలను పంపించేశారు. చదవండి: (ఈ తీర్పు అమరావతికీ వర్తిస్తుందా?!) -
‘ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం’
విజయనగరం మున్సిపాలిటీ: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎమ్మెల్యే మీసాల గీత అన్నారు. 37వ వార్డు పరిధి బింగివీధి, డక్కిన వీధి ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన రెండు బోరుబావులను ఎమ్మెల్యే గీతతో పాటు మున్సిపల్ ఛైర్మన్ ప్రసాదుల రామకృష్ణ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డులో రెండు బోరుబావులు చొప్పున మొత్తం 80 బోరుబావులు ఏర్పాటు చేసేందుకు రూ.50లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కందిమురళీనాయుడు, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
టీడీపీలో బిగుసుకుంటున్న సీటు ముడి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : లోక్‌సభకు పోటీచేయాలని సిట్టింగ్ ఎమ్మెల్యే పూసపాటి అశోక్ గజపతిరాజును చంద్రబాబు ఆదేశించడంతో విజయనగరం అసెంబ్లీ టిక్కెట్‌పై ద్వితీ య శ్రేణి నాయకుల కన్ను పడింది. వేగుల ద్వారా పరిణామాలను ముందే తెలుసుకున్న మీసాల గీత వ్యూహాత్మకంగా రాయబారాన్ని పంపారు. అశోక్ గజపతిరాజుకు తెలియకుండా బాబుతో మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తానంటే టీడీపీలో చేరుతానని సంప్రదింపులు చేశారు. ఆ మేరకు కుదిరిన ఒప్పం దంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీడీపీ కండువా వేసుకున్నారు. దీంతో టీడీపీ నాయకులు కంగుతిన్నా రు. నిన్నటి వరకు అనేక ఇబ్బందులు పెట్టిన నాయకురాల్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని, ఆమెకు టిక్కెట్ ఇస్తే తాము పనిచేయమని కరాఖండీగా చెప్పేశారు. అసెంబ్లీకి ఇక్కడ నుంచి అశోక్ గజపతిరాజే పోటీ చేయాలని, ఒకవేళ కాదూకూడదంటే పార్టీలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు టిక్కెట్ రేసులోకి వచ్చారు. టికెట్ కోసం అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంతలో సిటీ కేబుల్ ఎండీ శ్రీనివాసరావు కూడా పార్టీలో చేరారు. తాను కూడా ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ పరోక్ష సంకేతాలు పంపించారు. అందరూ అడుగుతుంటే తానెందుకు మౌనంగా ఉండాలని మాజీ కౌన్సిలర్ డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ కూడా రేసులోకి వచ్చినట్టు తెలిసింది. గీత తీరుతో ఇరకాటం మీసాల గీత టీడీపీలోకి చేరిన దగ్గరి నుంచే తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో చేరినప్పుడు అశోక్ గజపతిరాజు ఫొటో లేకుండా వేసిన పలు ప్లెక్సీలు పట్టణంలో దర్శనమిచ్చాయి. గమనించి న టీడీపీ నేతలు వెంటనే జోక్యం చేసుకోవడంతో ఆయా ప్లెక్సీలపై అశోక్ బొమ్మ కన్పించేలా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ప్రచార సభలు, పార్టీ కార్యక్రమాల్లో కూడా తన వ్యక్తిగత డబ్బా కొట్టుకోవడా న్ని టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా తానున్న హయాంలోనే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, మిగతా వారీ హయాంలో అంతగా జరగలేదన్నట్టుగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ పాలకవర్గం హయాంలో ఏమీ జరగలేదనే సంకేతాలు బయటికొస్తుండడంతో అభద్రతాభావానికి లోనైన టీడీపీ నేత లు మీసాల గీతపై మరింత అక్కసుకు లోనయ్యారు. తమకు ఇష్టం లేకపోయినా పార్టీలోకి తీసుకొచ్చారని, ఇప్పుడామె ఏకుమేకై కూర్చొన్నారని క్యాడర్ భావిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే ఇంకెంత ముదిరిపోతారోనన్న భయం టీడీపీ నాయకులకు పట్టుకుంది. ఇదంతా పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి రావడంతో మేల్కొన్నట్టు తెలిసింది. మీసాల గీతపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, మిగతా ఆశావహుల్లో అంత సీన్ లేకపోవడంతో పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. అంతర్గత పోరు మధ్య ఒకరికి టిక్కెట్ ఇస్తే చేటేనని, అదే పొత్తు పార్టీ బీజేపీకి ఇచ్చేస్తే ఏ ఇబ్బందులుండవనే ఆలోచనకొచ్చినట్టు తెలిసింది. బీజేపీ కూడా పొత్తులో భాగంగా జిల్లా నుంచి ఒక టిక్కెట్ ఆశిస్తుండడం, అందులో విజయనగరమైతే మరింత బాగుంటుందనే అభిప్రాయంతో మనసులో మాట అధిష్టానానికి చెప్పినట్టు తెలిసింది. దీంతో విజయనగరం తమకు కేటాయించాలని బీజేపీ అదిష్టానం డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. -
గీతకు షాక్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రత్యామ్నాయం లేక పార్టీలోకి వచ్చేవారికి అంత రాచమర్యాదలు అవసరం లేదని టీడీపీ క్యాడర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మీసాల గీత టీడీపీలో చేరికను అట్టహాసం చేయడకూదని భావించినట్లు సమాచారం. అందుకే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా వేసుకునే అవకాశం ఆమెకు దక్కనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ చంద్రబాబు రాకకోసం వేచి చూసినా ఆ అవకాశం దక్కక పోవడంతో గత్యంతరం లేక సోమవారం ఆమె సాదాసీదాగా పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అంచనాలు తలకిందులు టీడీపీ అధినేత వచ్చినప్పుడు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులను పార్టీలోకి చేర్చుకుని, కండువాలు వేయాలని భావించారు. మీసాల గీతతో పాటు జిల్లాకు చెందిన ఒక దళిత నేత, ఉద్యమాలు నిత్యం చేసే నేతతో పాటు పలువుర్ని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. మరో ప్రత్యామ్నాయం లేని మీసాల గీత తప్ప మరెవరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపలేదు. మొత్తానికి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న గీతకు చంద్రబాబు పర్యటన వాయిదాల పర్వంతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికైతే గతనెల 30న చంద్రబాబు జిల్లాకొస్తున్నారని, ఆ రోజు పార్టీలో చేరవచ్చని భావించారు. కానీ ఆ పర్యటన ఫిబ్రవరి 10కి వాయిదా పడింది. పోనీలే అదే రోజున చేరుదామని చూసినా మళ్లీ వాయిదా పడడంతో ఆమెకు నిరుత్సాహం ఎదురైంది. చివరికి ఈనెల 26న చంద్రబాబు పర్యటన ఖరారైంది. అప్పుడే చేరవచ్చని ఉవ్విళ్లూరారు. కానీ, విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల వ్యతిరేకత నేపథ్యంలో ఆశలకు బ్రేక్ పడింది. ఆమెకు టికెట్ ఇస్తే ఒప్పుకోం ఎమ్మెల్యే టికెట్ ఆశతో మీసాల గీత పార్టీలోకి వస్తున్నారని, ఆమెను ఎమ్మెల్యేగా నిలబెడితే తాము ఒప్పుకోబోమని, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు కరాఖండిగా చెబుతున్నారు. ఆమెకి టికెట్ ఇస్తే తామంతా ఏమై పోవాలని, ఆమె వెంట పనిచేయలేమని తేల్చి చెబుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అశోక్ గజపతిరాజునే ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని, కాదూకూడదంటే ఆయన భార్య, కుమార్తెల్లో ఎవరో ఒకరిని బరిలోకి దించాలని నియోజకవర్గ నాయకులు పట్టుబడుతున్నారు. ఒకవేళ అశోక్ గజపతి రాజు ఎంపీగా పోటీ చేయడానికి మొగ్గు చూపిస్తే ఎన్నాళ్లుగానో పార్టీని అంటిపెట్టుకుని పనిచేస్తున్న నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదనలు పెట్టారు. ఈ క్రమంలో ప్రసాదుల రామకృష్ణ, కర్రోతు నర్సింగరావు తదితరులు టికెట్ రేసులో తామున్నామంటూ ముందుకొచ్చారు. ఇప్పటికే అశోక్ గజపతిరాజు వద్ద ప్రతిపాదనలు పెట్టారు. దీంతో మీసాల గీతకు పార్టీలోకి రాకముందే అసమ్మతి సెగ లు ఆహ్వానం పలుకుతున్నాయి. నెట్టుకు రాగలరా? మీసాల గీత టీడీపీలో చేరితే అభ్యంతరం లేదని, కానీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేంత సీన్ ఆమెకు లేదని, నియోజకవర్గ కేడర్ నిశ్చయించుకుంది. ఈ పరిస్థితులన్నీ పార్టీ దూతల ద్వారా తెలుసుకున్నారో, వ్యతిరేకతను గమనించారో తెలి యదుగాని చంద్రబాబు జిల్లా పర్యటనకొస్తున్న రెండు రోజుల ముందు(ఈనెల 24న) ఆదరాబాదరాగా మీసాల గీత పార్టీలో చేరిపోనున్నారు. మీసాల గీతకు ఆదిలోనే ఇటువంటి పరి ణామాలు ఎదురవుతుంటే భవి ష్యత్తులో ఆమె పార్టీ కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ నెగ్గు కు రాగలరా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.