జనం కోసం పోరుబాట | For people porubata | Sakshi
Sakshi News home page

జనం కోసం పోరుబాట

Published Mon, Jan 5 2015 2:43 AM | Last Updated on Wed, Oct 3 2018 7:38 PM

జనం కోసం పోరుబాట - Sakshi

జనం కోసం పోరుబాట

కదిలిస్తే...ప్రతీ మదీ ఆవేదనల నదే... పింఛన్లు తీసేశారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు...రేషన్ కార్డులదీ అదే పరిస్థితి. నగరంలో ఏ సందు వెతికినా..తాండవిస్తోన్న అపరిశుభ్రత..చివరకు తాగేందుకు కూడా గుక్కెడు నీళ్లు రాని పరిస్థితి...ఇలా ఒకటి కాదు...రెండు కాదు.. సమస్యల చట్రంలో చిక్కుకుని ‘అనంత’వాసులు అల్లాడిపోతున్నారు.

ఎన్నిసార్లు విన్నవించినా పట్టనట్లున్న అధికారులు, ప్రజాప్రతినిధుల వైఖరిపై జనం మండిపడుతున్నారు. ఈ క్రమంలో నగర వాసుల సమస్యలు తెలుసుకునేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ‘రిపోర్టర్’గా మారారు. పాతూరులో ‘సాక్షి వీఐపీ’ రిపోర్ట్‌ర్‌గా ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
 
 మొదటగా పాతూరు మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట దిగిన గురునాథ్‌రెడ్డి అక్కడ తోపుడు బండ్ల వ్యాపారితో..
 గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి? వ్యాపారం ఎలా ఉంది?
 తోపుబండ్ల వ్యాపారి: సార్ నా పేరు వెంకటేష్. వ్యాపారం బాగా తగ్గింది.
 గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా?
 వెంకటేష్ : ట్రాఫిక్ వాళ్ల నుంచి ఇబ్బంది. బండి అక్కడపెట్టు..ఇక్కడ పెట్టు అంటూ ఇబ్బంది పెడుతున్నారు.
 గురునాథ్‌రెడ్డి: ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిందా?
 వెంకటేష్ : ఇప్పటి వరకు
 ఎలాంటి సాయమూ లేదు.
 గురునాథ్‌రెడ్డి: అన్నా..వ్యాపారాలు ఎలా ఉన్నాయి?
 రామూర్తి ప్రసాద్  : వ్యాపారం తక్కువ. బాడుగలు ఎక్కువగా ఉన్నాయన్నా...!.
 గురునాథ్‌రెడ్డి: బాడుగ ఎంత కడుతున్నారు?
 రామూర్తి ప్రసాద్ : 13 వేల చిల్లర కడుతున్నాము. దీనికి తోడు సేవా పన్ను కట్టాలంటున్నారు. వ్యాపారాలు లేని పరిస్థితుల్లో బాడుగలు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: ఏం నాగభూషణం బాగున్నావా? ఇక్కడ సమస్యలు ఏంటి?
 నాగభూషణం: సార్.. పాతూరులో వ్యాపారం చేసుకునే మహిళలకు, సరుకులు, కూరగాయలు కొనేందుకు వచ్చే మహిళలకు టాయ్‌లెట్ సమస్య అధికంగా ఉంది.
 గురునాథ్‌రెడ్డి: దగ్గరలో సులబ్ కాంప్లెక్స్ ఉంది కదా!
 నాగభూషణం: ఉంది సార్.. అది చాలా అధ్వానంగా ఉంటుంది. అక్కడికి పోతే రోగాలొస్తాయి. శుభ్రం చేయండని చెబితే...  చేస్తాం... చూస్తామంటున్నారు.
 గురునాథ్‌రెడ్డి: సరే నేను అధికారులతో మాట్లాడి టాయ్‌లెట్లు ఏర్పాటు జరిగేలా చూస్తాను.
 గురునాథ్‌రెడ్డి: బాబూ నీ పేరేమిటి. ఆటో జీవితం ఎలా ఉంది.
 ఆటోవాలా: సార్ నా పేరు ఓబుళపతి. బాడుగలు వర్కవుట్ కావడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: సమస్యలు ఏమైనా ఉన్నాయా?
 ఓబుళపతి : ట్రాఫిక్ వాళ్లతో ఇబ్బంది. ఆటోలు పెట్టుకుంటే తీసేమంటారు. ఫైన్ రూ.150 నుంచి రూ.200 వరకు వేస్తారు. అసలే బాడుగలు అంతంత మాత్రం. ఫైన్‌లు వేసిన రోజున  ఉత్తి చేతులతో ఇంటి పోవాల్సి వస్తోంది.
 గురునాథ్‌రెడ్డి: ట్రాఫిక్ వాళ్లతో మాట్లాడి మీ ఆటోవాళ్ల సమస్యను పరిష్కరిస్తాను.
 తాడిపత్రి రోడ్డు నుంచి రాజమ్మకాలనీకి వెళ్లిన గురునాథరెడ్డి అక్కడి పేదల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
 గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ బాగున్నావా..? పింఛను వస్తోందా..?
 నూరి: అయ్యా పింఛను వస్తోంది. అయితే మూడు నెలల పింఛన్ రూ.3 వేలు ఇవ్వకుండా రూ.2 వేలు మాత్రమే ఇచ్చారు.
 గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వలేదో అడగలేదా..?
 నూరి : అడిగితే మళ్లీ ఇస్తామంటూ పంపించేశారు.
 గురునాథ్‌రెడ్డి: అమ్మా పింఛను    ఇస్తున్నారా..?
 ఉసేన్‌బీ: లేదయ్యా..?  పింఛను కోసం ఎన్ని సార్లు అర్జీ ఇచ్చినా ఎవరూ ఇయ్యలేదు.
 గురునాథ్‌రెడ్డి: మీ వాళ్లు ఎవరూ లేరా..?
 ఉసేన్‌బీ : మా ఇంటాయన చనిపోయాడు. ఉన్న ఒక్క కొడుకూ చనిపోయాడు. నా కూతురు దోసెలు వేస్తుంది. ఆమె దగ్గరే ఉంటున్నారు. పింఛను వచ్చేలా చూడయ్యా.
 గురునాథ్‌రెడ్డి:  అధికారులతో మాట్లాడి పింఛను వచ్చేలా చూస్తానమ్మ.
 గురునాథ్‌రెడ్డి: ఏమ్మా.. మీ కాలనీలో సమస్యలు ఏమైనా ఉన్నాయా..?
 రసూలా : సార్ చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కాలువలు తీసేవాళ్లు రారు. నీళ్లు సరిగ్గారావు.
 గురునాథ్‌రెడ్డి: రేషన్ బాగా ఇస్తున్నారా..?
 రసూనా : ఎక్కడిస్తున్నారు సార్. మా నాన్న కార్డులో నా పేరు ఉండేది. నాకు పెళ్లయ్యిందని ఆ కార్డులో పేరు తీసేసి రేషన్ ఇవ్వడం లేదు. మా ఆయన కార్డులో నా పేరు చేర్చాలని ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పని జరగలేదు.
 గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దమ్మ నీరసంగా ఉన్నావు?
 ఖాజాబీ : అయ్యా ఆరోగ్యం సరిగ్గా లేదు. గుండె జబ్బుతో ఇబ్బంది పడుతున్నాను.
 గురునాథ్‌రెడ్డి: ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయించుకోలేదా..?
 ఖాజాబీ: లేదయ్యా చేయించుకోలేదు.
 గురునాథ్‌రెడ్డి: నీకు పింఛను ఇస్తున్నారా..?
 ఖాజాబీ: పింఛను రావడం లేదు. అర్జీలు ఇచ్చి తిరుగుతున్నాను. అదిగో ఇదిగో అంటూ తిప్పుతున్నారు. తిరిగితిరిగి ఆయసం వస్తోంది తప్పా పింఛను రాలేదు.
 గురునాథ్‌రెడ్డి: ఏం తల్లి బాగున్నావా..? నీ పేరేమిటి..?
 ముసలమ్మ: అయ్యా నాపేరు నారమ్మ. నాకు ఆరు మంది పిల్లలు. అందరూ వేరుపోయారు. నా భర్త చనిపోయాడు. నేను ఒక్కదాన్నే ఉంటున్నాను.
 గురునాథ్‌రెడ్డి: పింఛను, రేషన్ వస్తోందా..?
 నారమ్మ : మూడు నెలల నుంచి పింఛను ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడలేదంటూ పంపించేశారు. రేషన్‌కూడా తక్కువ ఇస్తున్నారు.
 గురునాథ్‌రెడ్డి: అమ్మా నీ పేరేమి..? ప్రభుత్వం సాయం అందుతోందా..?
 మహిళ : సార్ నా పేరు హుసేన్‌బీ. నా భర్త చనిపోయాడు. పింఛన్ రూ.200 ఇచ్చేప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఇవ్వడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: ఎందుకు ఇవ్వడం లేదు..?
 హుసేన్‌బీ: అదేమి చెప్పడం లేదు. రూ.200 ఇచ్చినప్పుడే బాగుండేది. చానా ఇబ్బంది పడుతున్నాము.
 గురునాథ్‌రెడ్డి:అమ్మా నీ పేరు ఏమిటి..?
 మహిళ : కైరున్‌బీ సార్.
 గురునాథ్‌రెడ్డి: కుటుంబం బాగా జరుగుతోందా..?
 కైరున్‌బీ : ఏమి జరుగుతుందిలే సారు. చెప్పుకుంటే అన్ని కష్టాలే. వైఎస్‌ఆర్ ఉన్నప్పుడే బాగుండేది.
 గురునాథ్‌రెడ్డి: ఇప్పుడేం సమస్యలున్నాయి..?
 కైరున్‌బీ: కరెంటు బిల్లు ఎక్కువ. రేషన్ తక్కువ ఇస్తారు. 16 కేజీలు బియ్యానికి 12 కేజీలే ఇస్తారు. సంసారం ఎలా చేసుకోవాలో అర్థం కావడం లేదు.
 గురునాథ్‌రెడ్డి : అక్కా బాగున్నావా? నీ పేరేమిటి?
 మహిళ: అయ్యా నాపేరు పెద్దక్క. ఏం బాగులే సారు. అన్ని సమస్యలే.
 గురునాథ్‌రెడ్డి: ఏమ్మా ఏమి ఇబ్బందులున్నాయి..?
 పెద్దక్క: అయ్యా నా మొగుడు పోయి చాన్నాళ్లయ్యింది. వితంతు పింఛను ఇయ్యండని తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు.
 గురునాథ్‌రెడ్డి: అధికారులతో మాట్లాడి వచ్చేలా చూస్తాను.
 రాజమ్మ కాలనీ నుంచి రాణీనగర్‌కు చేరుకున్న గురునాథ్‌రెడ్డి వద్దకు అక్కడి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఎకరవు పెట్టారు.
 గురునాథ్‌రెడ్డి: ఏమ్మా మీ కాలనీలో సమస్యలన్నాయా? పింఛను అందరికి వస్తోందా..?
 స్థానికులు : కాలువలు సరిగ్గా తీయడం లేదు.స్టోరు మూడు రోజులే ఇస్తారు. పింఛను ఇవ్వడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: ఏం పెద్దాయనా..దిగాలుగా ఉన్నావ్?
 వృద్ధుడు :  కదల్లేని ముసలాడినయ్యా.. (వీరప్ప) అయినా నాకు పింఛను ఇవ్వడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: ఏమన్నా బాగున్నావా..? నీ  పేరేమిటి..? ఏంచేస్తుంటావు.
 కాలనీ వాసి : సార్ నా పేరు సంజీవయ్య. నాకు పొలం కూడా ఉంది. వ్యవసాయం చేసుకుంటాను
 గురునాథ్‌రెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం చేసిన రుణమాఫీ వల్ల న్యాయం జరిగిందా...?
 సంజీవయ్య : ఎక్కడి రుణమాఫీ సార్. ఆయన చెప్పిన దానికి.. చేసిన దానికి పొంతనే లేదు. రుణమాఫీ అంతా కాగితాలు, కంప్యూటర్లకే  పరిమితమైంది. బ్యాంకుకు వెళితే స్పందన లేదు.
 గురునాథ్‌రెడ్డి: రుణమాఫీ చేస్తానని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చాడు కదా..?
 సంజీవయ్య: చంద్రబాబు చెప్పిందేదీ చేయడు. ఇంతకు ముందు చూసాము. ఆయన పాలనలో వానలు రావు. కరువుతో అల్లాడాల్సిందే. ఇప్పుడే అదే కనిపిస్తోంది. ఎనిమిది నెలలైనా రుణ మాఫీ చేయలేదు. ఉత్త పేపర్లు ఇస్తూ ఇబ్బందులు పెడుతున్నాడు.
 గురునాథ్‌రెడ్డి: అన్నా నీ పేరేమిటి. నువ్వూ వ్యవసాయం చేస్తావా..?
 కాలనీ వాసి: సార్ నా పేరు శివమూర్తి. మంగళషాపు నడుపుకుంటున్నా. పొలం ఉంది. వ్యవసాయం చేసుకుంటాను.
 గురునాథ్‌రెడ్డి: రుణం ఎంత తీసుకున్నావు. మాఫీ అయ్యిందా..?
 శివమూర్తి : రుణం రూ.40 వేలు తీసుకున్నాను. మాఫీ చేశామంటున్నారు. చేతికిచ్చింది లేదు. బ్యాంక్‌కు వెళితే మాకు ఏమీ రాలేదని చెప్పి పంపుతున్నారు. అయితుందో కాదో తెలియదు.
 ఆ తర్వాత రాణీనగర్ నుంచి వచ్చిన గురునాథ్‌రెడ్డి.. పాతూరు కూరగాయల మార్కెట్     వద్ద ఉన్న హామాలీలను పలకరించారు
 గురునాథ్‌రెడ్డి: ఏమన్నా హమాలీల పరిస్థితి ఎలా ఉంది..?
 వెంకటేశ్: సార్ బతుకు భారమయ్యింది. మా గురించి పట్టించుకునేవారులేరు. ఇల్లు లేదు. మాకు గుర్తింపులేదు. ఏ ప్రభుత్వం సాయం చేయలేదు. పిల్లల్ని చదించుకోవడం కష్టంగా ఉంది.
 గురునాథ్‌రెడ్డి: పిల్లలు ఏమి చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వస్తుంది కదా..?
 వెంకటేశ్: మా అబ్బాయి ఎంబీఏ చేస్తున్నాడు.  వైఎస్‌ఆర్ ఉన్నప్పుడు ఒక సారి తీసుకున్నాను. ఇప్పుడు రావడం లేదు.
 గురునాథ్‌రెడ్డి: హమాలీలకు గుర్తింపు కార్డులు ఇచ్చేలా అధికారులతో మాట్లాడతాను. పిల్లల్ని బాగా చదివించుకోండి. వైఎస్‌ఆర్ ఆశయం కూడా అదే. పేదలకు మంచి చదువులు అందించాలనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాడు.
 గురునాథ్‌రెడ్డి: బాబు నీపేరేమిటి. ఏం చేస్తున్నావు?
 వ్యాపారి : సార్ నా పేరు గౌస్‌మోహిద్ధీన్. నేను కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నాను.
 గురునాథ్‌రెడ్డి: ఎలా ఉంది వ్యాపారం. సమస్యలు ఏమైనా ఉన్నాయా..?
 గౌస్‌మోహిద్దీన్: ఏం వ్యాపారంలే సార్. చదువుకున్న వారు రోడ్ల మీదపడ్డారు. చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. రుణమాఫీ అంటూ రైతులకు చేయలేదు. పింఛను వెయ్యి ఇస్తానంటూ సగం మందికి లేకుండా చేశాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement