బీజేపీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి! | Full exercise of the election committee of the BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి!

Published Sat, Oct 15 2016 2:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

Full exercise of the election committee of the BJP

అతి త్వరలో ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేలా కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న కసరత్తు దాదాపు పూర్తయింది. రాష్ట్ర బీజేపీ కొత్త కమిటీని అతి త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ నాయకుల విశ్వసనీయ సమాచారం. ముం దుగా రాష్ట్ర కమిటీని నియమించాకే కొత్త జిల్లాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలు, పార్టీకి పట్టున్న జిల్లా లు తదితర అంశాల ప్రాతిపదికన పాత, కొత్తల మేలు కలయికగా కొత్త కమిటీ ఎంపికకు తుది మెరుగులు దిద్దుతున్నట్లు పార్టీ ముఖ్యుల ద్వారా తెలిసింది.

ప్రస్తుతం రాష్ట్ర పదాధికారుల్లో పలువురిని మార్చనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు శని, ఆది, సోమవారాల్లో రాష్ర్టవ్యాప్తంగా అన్ని పాత జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలను నిర్వహించి కొత్త జిల్లాల కమిటీల నియామకంపై చర్చించనున్నారు. ఎన్నికలకు పార్టీపరంగా సిద్ధం కావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలు, వైఖరిని ఎండగట్టేం దుకు వీలుగా ఇకపై ప్రజా సమస్యలు, ప్రత్యేకించి రైతాంగ సమస్యలపై పోరాటాలతో ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ నెల 20-29 వరకు రైతాంగ సమస్యలపై అన్ని  మండలాల్లో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement