ముంబై: చివరి గంటలో ఒక్కసారిగా ఊపందుకున్న అమ్మకాలు దేశీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు పతనమై 71,731 వద్ద ముగిసింది. నిఫ్టీ 82 పాయింట్లు కోల్పోయి 21,772 వద్ద నిలిచింది. అయితే తొలుత హుషారుగా ప్రారంభమైన మార్కెట్లు పరిమిత శ్రేణిలో స్వల్ప లాభాల మధ్య కదిలాయి. చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టడంతో కుదేలయ్యాయి.
వెరసి ఒక దశలో 72,386 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకిన సెన్సెక్స్ చివర్లో 71,602 వరకూ నీరసించింది. నిఫ్టీ సైతం 21,964– 21,727 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సెంటిమెంటును దెబ్బతీసినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. బ్లూచిప్స్ రిలయన్స్, ఎయిర్‌టెల్, మారుతీ సైతం ఇండెక్సులను బలహీనపరచినట్లు పేర్కొన్నారు.
కారణాలివీ...
జనవరి నెలకు యూఎస్ ఉద్యోగ గణాంకాలు బలపడటంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపునకు మొగ్గు చూపకపోవచ్చన్న అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల యూఎస్ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ 4 శాతం ఎగువకు చేరడం, దేశీయంగా తాత్కాలిక బడ్జెట్‌కు ముందు మార్కెట్ల ర్యాలీ వంటి అంశాలు ఇన్వెస్టర్లను లాభాల స్వీకరణకు ఉసిగొలి్పనట్లు విశ్షించారు.
దిగ్గజాల తీరిలా
నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్ 6 శాతం ఎగసింది. కోల్ ఇండియా, బీపీసీఎల్, సన్ ఫార్మా, సిప్లా, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ 5–2% మధ్య జంప్‌చేశాయి. అయితే యూపీఎల్ 11 శాతం పతనంకాగా.. బజాజ్ ఫైనాన్స్, ఫిన్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, గ్రాసిమ్, మారుతీ, అ్రల్టాటెక్, హెచ్‌సీఎల్ టెక్, టైటన్, అపోలో హాస్పిటల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌యూఎల్, ఆర్‌ఐఎల్ 3.2–1.2 శాతం మధ్య క్షీణించాయి. క్యూ3 ఫలితాల నిరాశతో యూపీఎల్ 11 శాతం పతనమైంది.
షేర్ల స్పీడ్...
టాటా మోటార్స్: క్యూ3 (అక్టోబర్–డిసెంబర్)లో నికర లాభం రెట్టింపై రూ. 7,100 కోట్లను తాకడంతో 6 శాతం జంప్‌చేసి రూ. 950 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 8 శాతం దూసుకెళ్లి రూ. 950 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది! కంపెనీ మార్కెట్ విలువ రూ. 15,950 కోట్లు బలపడి రూ. 3.07 లక్షల కోట్లను దాటింది.
ఎల్‌ఐసీ: లిస్టయిన తదుపరి తొలిసారి రూ. 1,000 మార్క్‌ను అందుకుంది. 6 శాతం లాభపడింది. తద్వారా రూ. 6 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించింది. ఒక్క రోజులో రూ. 35,230 కోట్లను జమ చేసుకుంది. విలువరీత్యా గత నెలలో ఎస్‌బీఐను దాటేసింది.
Comments
Please login to add a commentAdd a comment