సాక్షి, ముంబై : దేశీయ అతిపెద్ద ఐటీసేవల సంస్థ టీసీఎస్ క్యూ4 ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. నికర లాభాలు 18 శాతం జంప్ చేశాయి. దీంతో త్రైమాసికంలో రూ. 8126 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో రూ.6904 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. తద్వారా రూ.7981 కోట్లను సాధించనుందనే విశ్లషకుల అంచనాలను అధిగమించింది. ఆదాయం 38,010 కోట్లుగా ఉంది. అయితే ఆపరేటింగ్ మార్జిన్లు, ఎబిటా మార్జిన్లు(25.1 శాతం) స్వల్పంగా తగ్గాయి. గత 15ఏళ్లలో ఇదే బలమైన క్వార్టర్ అని టీసీఎఎస్ సీఎండీ రాజేష గోపీనాథన్ తెలిపారు. ఆదాయం 38,010 కోట్లుగా ఉంది.
డివిడెండ్
ఈక్విటీ షేరుకు 18 రూపాయల చొప్పున తుది డివిడెండ్ చెల్లించేందుకు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment