సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు)
గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్‌ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్‌టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది.
కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్‌పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment