అదానీ పోర్ట్స్‌ లాభం హైజంప్‌   | Adani Ports profit up 65 per cent at Rs 1738 crore | Sakshi
Sakshi News home page

Adani Ports అదానీ పోర్ట్స్‌ లాభం హైజంప్‌  

Published Wed, Nov 2 2022 10:07 AM | Last Updated on Wed, Nov 2 2022 10:19 AM

Adani Ports profit up 65 per cent at Rs 1738 crore - Sakshi

న్యూఢిల్లీ: నౌకాశ్రయాలు, టెర్మినళ్ల దిగ్గజం అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై-సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 65 శాతం జంప్‌చేసి రూ. 1,738 కోట్లకు చేరింది. గతేడాది(2021-22) ఇదే కాలంలో రూ. 1,050 కోట్లు మాత్రమే ఆర్జించింది.

మొత్తం ఆదాయం  రూ. 3,923 కోట్ల నుంచి రూ. 5,211 కోట్లకు ఎగసింది. ఈ ఏడాది తొలి అర్ధభాగం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) లో కార్గో పరిమాణం, ఆదాయం, నిర్వహణా లాభాల్లో సరికొత్త రికార్డు సాధించినట్లు కంపెనీ సీఈవో కరణ్‌ అదానీ పేర్కొన్నారు. ఈ బాటలో అక్టోబర్‌ను సైతం పరిగణిస్తే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 7 నెలల్లో 200 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల (ఎంఎంటీ) కార్గోను సాధించినట్లు తెలియజేశారు. వెరసి పూర్తి ఏడాదికి నిర్దేశించుకున్న 35-36 కోట్ల మెట్రిక్‌ టన్నుల కార్గో పరిమాణం, రూ. 12,200-12,600 కోట్ల నిర్వహణా లాభ లక్ష్యాన్ని అందుకునే బాటలో సాగుతున్నట్లు వెల్లడించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement