సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో సన్ ఫార్మా నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 1242 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 7933 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 48 శాతం జంప్‌చేసి రూ. 2,153 కోట్లను తాకింది. మార్జిన్లు 21.8 శాతం నుంచి 27.8 శాతానికి బలపడ్డాయి.
అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ షాక్‌తో ఇటీవల భారీగా నష్టపోయిన సన్ ఫార్మా షేరు ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.2 శాతానికిపైగా లాభపడింది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థలు సన్‌ఫార్మా షేరుకు బై కాల్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment