
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ1లో అదరగొట్టింది. ఈ ఆర్ధిక సంవత్సర తొలి త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను అధిగమించింది. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత వెల్లడించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) తొలి త్రైమాసికం నికర లాభాలు 5.3 శాతం ఎగిసి రూ. 3802 కోట్లుగా ఉన్నాయి. ఎబిటా మార్జిన్లు గతంలో కంటే 20.5శాతం వృద్ధిని సాధించింది. ఈ జూన్ క్వార్టర్ నాటికి ఆదాయం కూడా 14 శాతం ఎగిసి రూ. 21,803 కోట్లను నమోదు చేసింది. ఎబిటా మార్జిన్ 20.5శాతం వృద్ధి చెందాయని ఇన్ఫోసిస్ ఫలితాల సందర్భంగా తెలిపింది. డాలరు ఆదాయం, లాభాలు కూడా మెరుగ్గా ఉన్నాయి. 546 మిలియన్ల డాలర్ల నికర లాభాలను, ఆదాయం 3131 మిలియన్ డాలర్లను సాధించింది.