సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు క్యూ3లో నికర లాభం రెండు రెట్లుకు పైగా పెరిగింది. 2019 డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ. 4,146 కోట్ల లాభాలను నమోదు చేసి అదరహో అనిపించింది. ఏడాది క్రితం అక్టోబర్-డిసెంబర్ కాలంలో ఇది రూ.1,605 కోట్లుగా వుందని ఐసీఐసీఐ బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మొత్తం ఆదాయం 17.23 శాతం పెరిగి రూ .23,638 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .20,163.25 కోట్లు.
2019 డిసెంబరు చివరిలో ఎన్‌పీఏలు 5.95 శాతానికి దిగి రావడంతో బ్యాంక్ ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ఇది ఏడాది క్రితం 7.75 శాతంగా ఉంది. నికర వడ్డీ మార్జిన్లు క్యూ 3, 2020 ఆర్థిక సంవత్సరంలో లో 3.77 శాతంగా ఉందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది. 2019 డిసెంబర్ 31 నాటికి బ్యాడ్ లోన్లు స్వల్పంగా తగ్గుముఖం పట్టి రూ. 43 453.86 కోట్లుగా ఉన్నాయి, ఇది ఏడాది క్రితం రూ .51 511.47 కోట్లు. నికర ఎన్‌పిఎలు మొత్తం అడ్వాన్స్‌లో 1.49 శాతంగా ఉన్నాయి, 2018 డిసెంబర్ నాటికి ఇది 2.58 శాతంగా ఉంది. క్యూ 3 లో రైట్-ఆఫ్స్ మినహా రికవరీలు, అప్‌గ్రేడ్‌లు, ఇతర తొలగింపులు రూ .4,088 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment