నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: సంస్కరణలంటే కార్మిక చట్టాలను రద్దు చేయడం కాదనీ, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. కోవిడ్–19, లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వాణిజ్య కార్యకలాపాలు తిరిగి వేగవంతం చేసే చర్యల్లో భాగంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్మిక చట్టాల సవరణకు యత్నించడంపై ఆయన స్పందించారు. ‘అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్‌వో)లో భారత్ సభ్యదేశం అయినందున కార్మిక చట్టాలను రద్దు చేయడం కుదరదని కేంద్రం తన వైఖరిని రాష్ట్రాలకు ఇప్పటికే స్పష్టం చేసింది. కార్మిక చట్టాల్లో సంస్కరణలు తేవడం అంటే పూర్తిగా ఆ చట్టాలను రద్దు చేయడం కాదు. ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment