కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్‌గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు.
ఇలాంటి పారదర్శక బడ్జెట్‌లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్) చెప్పారు. ట్యాక్స్‌పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment