country Developing
-
సంస్కరణలు కొనసాగుతాయ్
న్యూఢిల్లీ: బడ్జెట్ అంటే ఏదో ఖర్చుల పద్దుగా పరిమితం కాకుండా అందరికీ ప్రయోజనాలను సమానంగా అందించేందుకు ఉపయోగపడే బ్లూప్రింట్‌గా గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం మార్చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భారత్‌ను సంపన్న దేశంగా తీర్చిదిద్దే దిశగా సంస్కరణల అమలు ఇకపైనా వేగవంతంగా కొనసాగుతుందని ఆమె పేర్కొన్నారు. బడ్జెట్ విధానాల్లో మోదీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్ద పీట వేసిందని మంత్రి వివరించారు. ఇలాంటి పారదర్శక బడ్జెట్లు ఉండే దేశాల విషయంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్ మొదలైనవి సానుకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. తద్వారా దేశానికి అంతర్జాతీయంగా విశ్వసనీయత పెరుగుతుందని నిర్మలా సీతారామన్ మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో (గతంలో ట్విటర్) చెప్పారు. ట్యాక్స్‌పేయర్లు తమ కష్టార్జితం నుంచి కట్టే ప్రతి రూపాయిని సమర్ధవంతంగా ఉపయోగించేందుకు, ప్రజా ధనం విషయంలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. -
భారత్ పురోగతిపై యువత అభిప్రాయాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై యువత అభిప్రాయాలను ప్రభుత్వం సేకరిస్తుందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. భారతదేశం 2047 నాటికి దాదాపు 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఒక విజన్ డాక్యుమెంట్ తయారవుతోందని ఆయన పేర్కొన్నారు. దీనిని వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి ప్రధాన మంత్రి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. ‘‘భారతదేశం తన చరిత్రలో కీలక మలుపులో ఉంది’’ అని ఆయన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలను కలిగి ఉండాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ పేర్కొన్నారు. యథాతథ విధానాలు వ్యాపార రంగం పురోగతికి దోహదపడవని అన్నారు. యువతసహా ప్రతిఒక్కరూ తమ అభిప్రాయాలను పంపడానికి ఒక వెబ్ పేజీ ఒక నెలపాటు లైవ్‌లో ఉంటుందని సుబ్రహ్మణ్యం తెలిపారు. -
జాతీయ ఉద్యమాల్లో పాల్గొనాలి
సుల్తాన్‌బజార్ : ప్రాంతీయ పార్టీలు జాతీయ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనడం ద్వారా దేశ అభివృద్ధికి దోహద పడాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యర్శి పి. మురళీధర్‌రావు అన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం కింగ్‌కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ‘తెలుగు రాష్ట్రాల్లో జాతీయవాద రాజకీయాలు- ప్రాస్పెక్ట్స్ ఛాలెంజెస్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాశ్మీర్‌ను రక్షించుకునేందుకు తెలుగు సైనికులు తమ జీవితాలను అర్పిస్తున్నారన్నారు. సరైన నాయకత్వం లేని దేశం అవకాశాలను అందిపుచ్చుకోలేదని, ప్రపంచంలోని పోటీని తట్టుకోలేక అవకాశాలు, అర్హతలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీలకు దేశస్థాయి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడే దేశ స్థాయిలో గుర్తింపు వస్తుందన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ నాయకత్వం, ఉనికి కోసం మరో రాష్ర్టంపై అరోపణలు చేయడం దారుణమన్నారు. కొన్ని లోపాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిందన్నారు. ఉద్యమాలకు దూరమై, కేవలం ఎన్నికల గురించే మాట్లాడినందునే కాంగ్రెస్ నష్టపోయిందన్నారు. బీజేపీకి వర్గ, కుల రహితమైన భవిష్యత్తుతో కూడిన ఏజెండా ఉందన్నారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌పార్టీని పునర్మించలేరని ఆయన పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణంతో ప్రపంచమంత విచారంగా ఉంటే మతతత్వ రాజకీయ నాయకులు యాకుబ్ మెమనే కనిపించారని ఆయన ధ్వజమెత్తారు. హైదరాబాద్ మత రాజకీయాలకు కాకుండా దేశ రాజకీయాలకు దగ్గరగా ఉండాలన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజ్ఞ భారతీ అధ్యక్షులు డాక్టర్ ఎల్. రాజభాస్కర్‌రెడ్డి, ఏపీ, తెలంగాణ ఛైర్మన్ టి. హనుమాన్‌చౌదరితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు పాల్గొన్నారు.