
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఇండి యురో సింక్రనైజెషన్ స్కిల్ క్లస్టర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘ఫెస్టో ఎక్స్‌పోటైనర్’ వాహనాన్ని ప్రారంభించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో చల్లా మధుసూదన్ రెడ్డి, ఎస్‌డీ అండ్ టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారు సత్యనారాయణ, ఎండీ APSSDC, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసి రాజశేఖర్ పాల్గొన్నారు. ఫెస్టో ఎక్స్‌పోటైనర్ వాహనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారని పేర్కొన్నారు.
‘నూతన జాతీయ విద్యా విధానం వస్తుందంటున్నారు. కానీ దాని కన్నా ముందే ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టారు. చదువుపైన ఆసక్తి ఉన్న వారికి, చదువుకోవాలనే ఆశ ఉన్న వారికి ప్రభుత్వం అన్ని అవకాశాలు కల్పించింది. విద్యావ్యవస్థలో ఈ దేశంలోనే ఎవరు చేపట్టనన్ని సంస్కరణలు తీసుకువచ్చాము. ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలకు సంబంధించిన ఫలితాలు అందుతున్నాయి. నైపుణ్యం సాధించడానికి స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కరోనా వల్ల ఆ ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఫెస్టో ఎక్స్‌పోటైనర్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలి’ అని సూచించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఇదీ చదవండి: పాత ఫొటోలతో విష ప్రచారం.. చంద్రబాబుపై మండిపడ్డ సజ్జల
Comments
Please login to add a commentAdd a comment