ఈవోడీబీలో 265 సంస్కరణలు పూర్తి..
Published Wed, Jun 7 2017 2:13 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సులభ వ్యాపారం (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ ఈవోడీబీ) సంస్కరణలలో భాగంగా ఇప్పటివరకు 265 సంస్కరణలు పూర్తి చేసినట్లు వివిధ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల ప్రగతిపై ఆయనæ మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లా డుతూ, వివిధ శాఖల వద్ద ఇంకా 140 సంస్క రణలు పూర్తి కావాల్సి ఉందన్నారు. జూన్ 15లోగా మిగిలిన సంస్కరణల అమలును పూర్తి చేస్తామన్నారు.
Advertisement
Advertisement