EODB
-
‘సులభతర వాణిజ్యం’ అమలులో ఏపీ టాప్
సాక్షి, న్యూఢిల్లీ/ అమరావతి: సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈఓడీబీ)లో సంస్కరణలను సంపూర్ణంగా అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచినట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు వీలుగా అనుమతి ఇచ్చినట్టు తాజాగా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థకు సంబంధించి వన్ నేషన్.. వన్ రేషన్ కార్డు సంస్కరణ అమలు చేసి ఆ మేరకు రుణ సేకరణ పరిమితి పెంచుకున్న ఏపీ తాజాగా సులభతర వాణిజ్య సంస్కరణలు అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలిచి మరింత రుణ సేకరణకు అర్హత పొందింది. (లక్షకు చేరువలో మరణాలు) ఈ మేరకు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 0.25% అదనపు రుణం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించినట్లయింది. దీంతో బహిరంగ మార్కెట్ ద్వారా రూ.2,525 కోట్ల మేర అదనంగా రుణం తెచ్చుకునేందుకు అర్హత పొందింది. జిల్లా స్థాయిలో అనుమతులు మంజూరు చేసే 40 సంస్కరణలతోపాటు ఆన్లైన్ ద్వారా కేంద్రీకృత ఇన్స్పెక్షన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లుగా పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నిర్ధారించడంతో కేంద్రం ఈ సదుపాయాన్ని కల్పించింది. -
‘ఈవోడీబీ’లో తెలంగాణ టాప్!
సాక్షి, అమరావతి: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)’ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో నిలవగా.. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)’ఈవోడీబీ ర్యాంకులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికి గాను ర్యాంకుల కోసం తగిన సమాచారం ఇవ్వడానికి రాష్ట్రాలకు అక్టోబర్ 31 వరకు గడువిచ్చారు. తాజాగా ఆ గడువును నవంబర్ 7 వరకు పొడిగించారు. ఈ ఏడాది సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్, ఆన్లైన్ ద్వారా భూముల కేటాయింపులు, సింగిల్ విండో పాలసీ, నిర్మాణ అనుమతులు, రాష్ట్రాల మధ్య వలస కూలీల ఒప్పందాలు వంటి 105 సంస్కరణల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించనున్నారు. ఇందులో ఇప్పటివరకు రాష్ట్రాలు అందజేసిన సమాచారం ప్రకారం.. తెలంగాణ 59.95 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నవంబర్ 7 నాటికి అందే పూర్తి సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ‘ఈవోడీబీ’తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. -
ఈవోడీబీలో 265 సంస్కరణలు పూర్తి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సులభ వ్యాపారం (ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్/ ఈవోడీబీ) సంస్కరణలలో భాగంగా ఇప్పటివరకు 265 సంస్కరణలు పూర్తి చేసినట్లు వివిధ శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్‌కు తెలిపారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల ప్రగతిపై ఆయనæ మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లా డుతూ, వివిధ శాఖల వద్ద ఇంకా 140 సంస్క రణలు పూర్తి కావాల్సి ఉందన్నారు. జూన్ 15లోగా మిగిలిన సంస్కరణల అమలును పూర్తి చేస్తామన్నారు. -
సులువుగా సొసైటీ రిజిస్ట్రేషన్
⇒ ఆన్లైన్లోనే సొసైటీలు.. ఫర్మ్ రిజిస్ట్రేషన్లు ⇒ ఈవోడీబీలో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే ఈ–స్టాంప్స్, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్, సర్టిఫైడ్ కాపీలు, పబ్లిక్ డేటా ఎంట్రీ, స్లాట్ బుకింగ్, పెండింగ్ డాక్యుమెంట్ స్టేటస్.. తదితర సేవలను ఆన్లైన్ ద్వారానే వినియోగదారులు పొందేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ వీలు కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా సొసైటీలు, ఫర్మ్‌ల రిజిస్ట్రేషన్ ప్రక్రియలను కూడా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రోగ్రామ్ (ఈవోడీబీ)లో భాగంగా.. ఆన్లైన్ సేవలను అందించడంలో రిజిస్ట్రేషన్ల శాఖను అగ్రగామిగా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రిజిస్ట్రేషన్ల ఆన్లైన్ ప్రక్రియలపై కసరత్తు కొలిక్కి రావడంతో వచ్చే నెల (మార్చి) మొదటి వారంలో ఈ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త ఆన్లైన్ ప్రక్రియల ద్వారా వినియోగదారులు తమ ఇల్లు లేదా కార్యాలయం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్లు ఇలా.. సాధారణంగా వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించాల నుకునే వ్యక్తులు ముందుగా ఒక సొసైటీని ఏర్పాటు చేసుకుం టారు. తెలంగాణ రాష్ట్ర సొసైటీల రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఆయా సొసైటీలను రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఇందుకు సొసైటీలో సభ్యులు కనీసం ఏడుగురు, గరిష్టంగా ఎంతమందైనా ఉండవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ప్రస్తుతం మీసేవా కేంద్రాలకు వెళ్లి దరఖాస్తును సమర్పించాలి. అదే ఆన్లైన్ ప్రక్రియ అమల్లోకి వస్తే , వినియోగదారులు ఇల్లు లేదా ఆఫీసు నుంచే రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో దరఖాస్తును సమర్పించవచ్చు. సొసైటీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200లను నెట్‌బ్యాంకింగ్ లేదా క్రెడిట్/డెబిట్ కార్డులతో ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఫర్మ్ రిజిస్ట్రేషన్లు ఇలా... ఏదైనా వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు (పార్ట్నర్స్) తమ పేరిట ముందుగా ఒక ఫర్మ్‌ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ బిజినెస్‌లో భాగస్వాములు కనీసం ఇద్దరు, గరిష్టంగా 20కి మించకుండా ఉంటేనే ఫర్మ్ రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉంటుంది. 20 మందికి పైగా భాగస్వాములు ఉన్నట్లయితే.. సదరు సంస్థలు కంపెనీల యాక్ట్ కిందకు వస్తాయి. ఫర్మ్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచే దరఖాస్తు సమర్పించి, ఫీజు రూ.100ను ఆన్లైన్ ద్వారానే చెల్లించవచ్చు. సంబంధిత పత్రాలు రిజిస్ట్రార్‌కు పంపాలి.. ఆయా రిజిస్ట్రేషన్ల నిమిత్తం చేసిన ఆన్లైన్ దరఖాస్తులలోని వివరాలకు సంబంధించిన పత్రాలను మాత్రం కొరియర్ లేదా పోస్ట్ ద్వారా సంబంధిత జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. దరఖాస్తు పరిశీలన అనంతరం జిల్లా రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్లను అప్రూవ్ చేస్తారు. ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందుకున్న వినియోగదారులు, రిజిస్ట్రేషన్ సర్టిపికెట్లను అప్లికేషన్ నంబర్‌ను ఎంటర్ చేసి వెబ్సైట్ నుంచే పొందవచ్చు. -
ఏపీ, తెలంగాణల మధ్య మరో రగడ
హైదరాబాద్: కొద్ది నెలల కిందట 'పెట్టుబడులకు అనుకూలతకు మెరుగైన చర్యలు చేపడుతోన్న రాష్ట్రాలు' పేరుతో జాతీయ స్థాయి ర్యాకులు విడుదలయ్యాయి. అందులో ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ కు మొదటి ర్యాంకు దక్కగా, చంద్రబాబు నాయుడి ఏలుబడిలో ఉన్న ఏపీకి రెండో ర్యాంక్ లభించింది. హైదరాబాద్ రాజధానిగా గల తెలంగాణ మాత్రం ఎక్కడో 13 ర్యాంకులో నిలిచింది. ర్యాంకుల వ్యవహారంపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తర్వాత ఆ అంశం కాస్త సర్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాకుల ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ కీలక తరుణంలో ర్యాకుల వ్యవహారానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ)కు సంబంధించిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేస్తోందని తెలంగాణ ఆరోపించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ చట్టం కింద చంద్రబాబు సర్కారుపై కేసు కూడా నమోదు చేసింది. ఇదే విషయమై తెలంగాణ పరిశ్రమలు, ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు చేశారు. ర్యాంకుల కోసం ఏపీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) విధానంలో ప్రతి మంత్రిత్వ శాఖ తామిచ్చే అనుమతులకు ఆన్లైన్ దరఖాస్తు సౌకర్యం కల్పిస్తోంది. అలా వ్యాపార, వాణిజ్య అనుమతులను సులభతరం చేసిన రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాకుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ర్యాకులు మరి కొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. ఈవోడీబీ కోసం 340 కాలమ్‌ల సమాచారాన్ని జులై 7 లోగా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న సమాచారం ఆధారంగా కేంద్రం ఈవోడీబీ స్థానాలను మదింపు చేస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అప్ లోడ్ చేసిన ఆన్ లైన్ అప్లికేషన్లను ఏపీ ప్రభుత్వం కాపీ చేస్తోందని పరిశ్రమల శాఖకు చెందిన ముఖ్య అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సిఉంది.