![FDI may touch USD 100 bn in 2022-23 - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/15/FDIS123.jpg.webp?itok=ZR4Dh4Kn)
న్యూఢిల్లీ: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి బలోపేతానికి, వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు పది అంచెల విధానాన్ని సూచించింది. మౌలిక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం, పీఎల్‌ఐ కిందకు మరిన్ని రంగాలను తీసుకురావడం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం, అధిక కమోడిటీ ధరలను పరిష్కరించడం, ముడిసరుకులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment