ఎయిడెడ్ టీచర్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎయిడెడ్ టీచర్ల పదవీ విరమణ వయస్సు పెంపు విషయంలో అవినీతి జరిగిందంటూ దీనిపై ఉన్నతాధికారులు ఓనివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేశారు.
అవినీతి కారణంగానే ఆరునెలల పాటు దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు. కానీ హామీ ఇచ్చాను కాబట్టే చేయాల్సి వస్తోందని ఆయన అన్నారు. గతంలో బదిలీల వ్యవహారంలో కూడా ఇలాగే అవినీతికి పాల్పడ్డారని ఆయన తెలిపారు. అయితే.. సీఎం వ్యాఖ్యలతో మంత్రులు అవాక్కయ్యారు. ఎయిడెడ్ టీచర్ల అవినీతి అంశంపై మాత్రం చంద్రబాబుతో పలువురు మంత్రులు ఏకీభవించారు.
ఎయిడెడ్ టీచర్ల వ్యవహారంలో అవినీతి!
Published Thu, Dec 18 2014 7:26 PM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement