సాక్షి, హైదరాబాద్: తెలుగు, హిందీ పండిట్‌ల పరీక్షల షెడ్యూల్‌ను గురువారం ఏపీ ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ ఎం.ఆర్. ప్రసన్నకుమార్ ప్రకటించారు. ఈ నెల 30 నుంచి డిసెంబర్ 4 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. 2014-15 బ్యాచ్‌కి సంబంధించి 30న పేపర్1- అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య, డిసెంబర్ 1న పేపర్ 2- విద్యాపరమైన మనస్తత్వ శాస్త్రం, 2న ఉ.10 గం. నుంచి 11.30 గం. వరకు పేపర్3 (పార్ట్ ఏ) స్కూల్ నిర్వాహణ, మధ్యాహ్నాం 2 నుంచి 3.30 గం. వరకు పార్ట్-బిలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీ, 3న పేపర్-4లో తెలుగు,హిందీ బోధనలో విధానాలు, 4న ఉ.10 నుంచి 11.30 గం. వరకు పేపర్-5లో పార్ట్-ఏలో భౌతిక ఆరోగ్య విద్య, కళలు,పని విద్య, మధ్యాహ్నం 2 నుంచి 3.30 గం. వరకు పార్ట్-బీలో తెలుగు కోసం భాషాభివృద్ధి హిందీ కోసం తులనాత్మక వ్యాకరణలు అంశాలు ఉంటాయని డెరైక్టర్ వెల్లడించారు.
ఎయిడెడ్ టీచర్ల వేతనాలు మంజూరు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎయిడెడ్ టీచర్ల వేతనాలు విడుదల చేస్తూ విద్యా డెరైక్టర్ కిషన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎస్‌టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి భుజంగరావు గురువారం ప్రకటనలో పేర్కొన్నారు.
తెలుగు, హిందీ పండిట్‌ల పరీక్షల షెడ్యూల్ విడుదల
Published Fri, Nov 6 2015 3:34 AM | Last Updated on Fri, Aug 17 2018 6:08 PM
Advertisement
Advertisement