
సాక్షి, తాడేపల్లి: అగ్రి ఫండ్ ప్రాజెక్టులు, మల్టీపర్పస్ ఫెసిలిటీ కేంద్రాల(ఎంపీఎఫ్‌సీ)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూధన్‌రెడ్డి, మార్కెటింగ్ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్ అహ్మద్‌బాబు, వ్యవసాయ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు, ఉద్యానవన కమిషనర్ ఎఫ్‌ఎస్ శ్రీధర్‌తో పాటు, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చదవండి: ఆనందయ్య మందుల తయారీ ఇలా
Comments
Please login to add a commentAdd a comment