వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.
రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.
ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?
రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టి
చేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment