Bankers Committee meeting
-
రుణాల పంపిణీపై బ్యాంకర్లతో సమీక్ష
వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ..వంటి విభిన్న విభాగాలకు అందించే రుణాల పంపిణీ పురోగతిని కేంద్రం సమీక్షించింది. కేంద్ర ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి నాగరాజు ఈమేరకు అధికారులతో చర్చించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డ్, రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన బ్యాంకర్ల కమిటీతో సమావేశం నిర్వహించారు.రుణాలతో ఉపాధి అవకాశాలు పెంపుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నాగరాజు బ్యాంకర్లకు సూచించారు. ఈ రంగాలకు అందించే రుణ పంపిణీని మెరుగుపరచడంలో బ్యాంకులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. వ్యవసాయ వృద్ధి కోసం దాని అనుబంధ రంగాలను ప్రోత్సహించాలన్నారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. కాబట్టి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో రుణ పంపిణీ పెంచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రెడిట్ పంపిణీని నిర్ధారించడానికి ప్రాంతీయ స్థాయి సమావేశాలు నిర్వహించాలని బ్యాంకులను ఆదేశించారు.ఇదీ చదవండి: ట్రంప్-బైడెన్.. ఎవరి హయాంలో భారత్ వృద్ధి ఎంత?రుణ పంపిణీపై ప్రభుత్వం దృష్టిచేపల పెంపకందారులను గుర్తించి వారికి కిసాన్ క్రెడిట్ కార్డు(కేసీసీ) పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు సహకరించాలని చెప్పారు. అందుకోసం రాష్ట్ర విభాగాలు, ఇతర సంఘాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు సులువుగా రుణాలు అందించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని నొక్కి చెప్పారు. -
ఆశించిన స్థాయిలో రుణాలిచ్చాం
సాక్షి, అమరావతి: 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేశామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ, సీఈవో ఏ మణిమేఖలై స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో 228వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. పలువురు బ్యాంకర్లు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్న ఈ సమావేశంలో మణిమేఖలై మాట్లాడుతూ.. 2024–25 వార్షిక రుణ ప్రణాళిక కింద ప్రాధాన్యతా రంగాలకు రూ.3.75 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా, తొలి త్రైమాసికంలో జూన్ 30 నాటికి రూ.1.36లక్షల కోట్లు (36శాతం) రుణాలు అందించామన్నారు. అలాగే వ్యవసాయరంగానికి రూ.2.64లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.89,438 కోట్లు (34శాతం) ఇచ్చామని తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగానికి 87వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.44వేల కోట్లు (51 శాతం) అందించామన్నారు. ప్రాధాన్యేతర రంగాలకు రూ.1.65లక్షల కోట్లు అందించాల్సి ఉండగా, 87,731 కోట్లు (53 శాతం) అందించినట్లు వివరించారు. నాబార్డు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ రావత్ మాట్లాడుతూ..ఏపీలో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఆర్బీఐ ఏపీ రీజీయన్ రీజనల్ డైరెక్టర్ ఏవో బషీర్ మాట్లాడుతూ డిజిటల్ టాన్స్ఫర్మేషన్లో క్యూఆర్ కోడ్‌ను వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీకి సంబంధించి కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పైలెట్‌ప్రాజెక్టుగా ఆర్బీఐ ప్రారంభించిందని తెలిపారు. వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కౌలు రైతులకు రుణాలు అందించడంలో బ్యాంకులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఐదేళ్లలో 50లక్షల ఎకరాలను ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించిందన్నారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాంకులు ముందుకు రావాలన్నారు.తొలుత ఫైనాన్షియల్ లిటరసీపై రిజర్వు బ్యాంక్ ప్రచురించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. కేంద్ర ఫైనాన్షియల్ సర్విసెస్ శాఖ కార్యదర్శి నాగరాజు మద్దిరాల, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, ఎస్ఎల్బీసీ కన్వినర్ సీవీఎన్ భాస్కరరావు, సిడ్బీ సీఎండీ మనోజ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు. -
కౌలు రైతులకు మరింత చేయూతనివ్వండి
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు బ్యాంకులు మరింత చేయూతను అందించాలని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. అలాగే కోళ్ల పెంపకం, ఆక్వా, మత్స్య రంగాల్లో రైతులకు కూడా తగిన రుణాలందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక అమలులో 108 శాతం లక్ష్యాన్ని సాధించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం మంత్రి బుగ్గన అధ్యక్షతన 226వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఇందులో గత సమావేశం సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, 2023–24 వార్షిక రుణ ప్రణాళికలో సాధించిన ప్రగతి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలు, డిజిటల్ జిల్లాలు, కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ కౌలు రైతులకు పెద్దఎత్తున రుణాలు అందించి వారిని ఆదుకోవాలనేది ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశమని తెలిపారు. ఈ నేపథ్యంలో కౌలు రైతులకు రుణాలందించడంలో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాడిపరిశ్రమాభివృద్ధికి కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ రంగంలో కూడా తగిన రుణాలు అందించాలని కోరారు. ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల్లో డెయిరీ రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. ఏపీ టిడ్కో కింద జగనన్న నగరాల నిర్మాణంలో లబ్ధిదారులకు మరింత చేయూతనిచ్చి వేగంగా ఇళ్లు నిర్మించుకునేందుకు తగిన సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ పథకాల అమలులో వివిధ ప్రైవేటు బ్యాంకులు తమ వంతు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గుడ్ గవర్నెన్స్‌లో ఉత్తమ రాష్ట్రంగా ఏపీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ రాష్ట్రంలో మెరుగైన ఈ–క్రాపింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. గుడ్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ 2023–24 వార్షిక రుణ ప్రణాళిక కింద రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.4.43 లక్షల కోట్ల రుణాలు అందించడం లక్ష్యం కాగా డిసెంబర్ నాటికే రూ.4,77,234 కోట్లు రుణాలు అందించి 108 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. దీనిలో ప్రాధాన్యత రంగం కింద రూ.3.23 లక్షల కోట్లు అందించాల్సి ఉండగా రూ.2.88 లక్షల కోట్లు అందజేశామని తెలిపారు. అలాగే రూ.2.31 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు లక్ష్యం కాగా రూ.2.08 లక్షల కోట్లు అందించామన్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో రూ.69 వేల కోట్లకు గాను రూ.71,113 కోట్లు అందజేశామని వెల్లడించారు. అలాగే ప్రాధాన్యేతర రంగంలో రూ.1.20 లక్షల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.1,88,557 కోట్లు ఇచ్చామన్నారు. అలాగే బ్యాంకు లింకేజ్ కింద 35 వేల స్వయం సహాయక సంఘాలకు రుణాలు అందించాల్సి ఉండగా ఇప్పటికే 31,699 సంఘాలకు సాయం అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్టాండ్ అప్ ఇండియా కింద 13,078 ఖాతాదారులకు సహాయం అందించాల్సి ఉండగా డిసెంబరు నెలాఖరు నాటికి 12,768 మందికి సాయమందించామని తెలిపారు. పీఎం ముద్రా యోజన కింద రూ.13 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.14,860 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతేడాది డిసెంబర్ వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జీఎం రవీంద్రబాబు వివరించారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాల్లో మంచి ప్రగతి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రంగాల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని తెలిపారు. బ్యాంకులు ఆయా రంగాల్లో మరింత తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుదారులకు రుణాలు అందించడంలో మంచి ప్రగతిని సాధించారన్నారు. ఈ సమావేశంలో ఆర్బీఐ ఏపీ ఇన్చార్జి రాజేష్ కె.మహానా, యూబీఏ జీఎం గుణనాధ్ గమి, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీ సత్యనారాయణ, చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత, వ్యవసాయ శాఖ ఇన్చార్జి కమిషనర్ శేఖర్ బాబు, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, మెప్మా ఎండీ విజయలక్ష్మి, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
శ్రీనగర్: బ్యాంకులు వివిధ రుణ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ కోరారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల వారికి ప్రయోజనాలు అందేలా అవగాహన కల్పించాలని మంగళవారం విజ్ఞప్తి చేశారు. కేంద్రపాలిత ప్రాంత స్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రత్యేక సమీక్షా సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ, ఆర్థిక అభివృద్ధిలో సాధారణంగా విద్య ఎంత కీలకమో ఆర్థిక అక్షరాస్యత కూడా అంతే ముఖ్యమన్నారు. ‘‘బ్యాంకులు వివిధ రుణ పథకాల గురించి ప్రజలలో అవగాహన పెంచాలి. దీనివల్ల ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం ఉద్దేశించిన ప్రయోజనాలు వారికి అందుతాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► పీఎం సేవానిధి స్కీమ్‌లో రుణగ్రహీతల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఈ పథకం లబ్ధిదారులను మార్గనిర్దేశం చేసి, పీఎం ముద్రా యోజన కింద అధిక రుణాలు పొందే అర్హతను వారు పొందేందుకు కృషి జరగాలి. ► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వివిధ చొరవలతో జమ్మూ, కశ్మీర్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఇక్కడ బ్యాంకింగ్ పోషిస్తున్న పాత్ర పట్ల సంతృప్తి ఉంది. జమ్మూ, కశ్మీర్లో బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల సేవల విస్తరణకు కేంద్రం తగిన సహాయ సహకారాలను అందిస్తుంది. ► గత రెండేళ్లలో దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రశంసనీయమైన పనితీరును కనబరిచాయి. ఇది అభినందనీయం. -
బడుగులకు రుణాలివ్వని బాబు సర్కారు
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సబ్సిడీపై పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చినట్లు టీడీపీ నేతలు చెబుతున్న మాటలు అబద్ధాలేనని తేలింది. ఆ ఐదేళ్లలో బడుగులకు అందాల్సిన సబ్సిడీ వారికి చేరలేదని వెల్లడైంది. ఆ సబ్సిడీ సొమ్మంతా బ్యాంకుల్లోనే మగ్గుతోంది. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2014–15 నుంచి 2018–19 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ కార్పొరేషన్లకు చెందిన సబ్సిడీ నిధులు రూ.515 కోట్లు ఎటువంటి వినియోగం లేకుండా ఆయా సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఆయా వర్గాలకు రుణాలు మంజూరు చేయకపోవడంతో సబ్సిడీ నిధులు ఖాతాల్లోనే ఉండిపోయాయి. సబ్సిడీ రుణాల మంజూరు రికార్డులను తనిఖీ చేసి, పెండింగ్‌లో ఉన్న వినియోగ పత్రాలను ఇవ్వాలని సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌లను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కోరింది. పెండింగ్‌లో ఉన్న రుణాల సబ్సిడీ వివరాలను సంబంధిత శాఖలు కూడా బ్యాంకులకు సమర్పించాలని సూచించింది. మిగిలిపోయిన సబ్సిడీ రుణాల సొమ్మును బ్రాంచీలు ఆయా సంస్థలకు తిరిగి జమ చేయాలని ఆదేశించింది. సబ్సిడీ ద్వారా ఆ వర్గాలకు రుణాలివ్వడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైనట్లు ఈ నివేదికను బట్టి తేలింది. -
ఇళ్ల లబ్ధిదారులకు రూ.35 వేల రుణం
ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు.. ఇలా పంటల సాగుకు కావాల్సిన వాటిని కొనుగోలు చేయడానికి రైతులకు అందుబాటులో ఆర్బీకేల్లో కియోస్క్‌లను పెట్టాం. అందులో రైతులు ఆర్డర్ చేస్తే నిర్దేశిత సమయంలోగా వారి గ్రామాల్లోనే వారి ఇంటి వద్దకే వారికి కావాల్సినవి అందుతాయి. ఈ వ్యవస్థ అంతా బ్యాంకింగ్ రంగంతో అనుసంధానం కావాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులకు 35 వేల రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లను కోరారు. ఇళ్ల లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లోని మహిళలేనని, వీరికి బ్యాంకులు పావలా వడ్డీకి (3 శాతం) రుణాలు ఇస్తే, మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు, వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్ చేసి, వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగించామని తెలిపారు. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా నాలుగైదు లక్షల రూపాయల ఆస్తిని సమకూరుస్తున్నామన్నారు. సిమెంట్, స్టీలు తదితర వస్తువుల వినియోగం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, పనులు కూడా విరివిగా లభిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇళ్ల లబ్ధిదారులకు రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకు వేయాలని, చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ కౌలు రైతులకు రుణాలు అందాలి ► కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్స్ (సీసీఆర్‌సీలను) ఇచ్చాం. వీరు ఎక్కడ భూమిని కౌలుకు తీసుకున్నారు? వారి సర్వే నంబరు ఏంటి? తదితర వివరాలన్నింటినీ ఆర్బీకేల ద్వారా ఇ–క్రాపింగ్‌కు అనుసంధానం చేశాం. ► ఈ కౌలు రైతులంతా నిజంగా పంటను సాగు చేస్తున్న రైతులు. సీసీఆర్సీ కార్డుల ద్వారా వీరు కౌలు రైతులుగా ఒక డాక్యుమెంట్ ద్వారా నిర్ధారిస్తున్నాం. వీరు ఎక్కడ పంటను సాగుచేస్తున్నారో ఇ–క్రాపింగ్ ద్వారా ధృవీకరిస్తున్నాం. అందువల్ల బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి. ► వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యే ప్రతి ఒక్కరికీ పంట రుణాలు కచ్చితంగా రుణాలు అందాలి. విత్తనం నుంచి విక్రయం వరకు.. ► రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. దాదాపు ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం ఉంది. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్ చేసి మరీ ఇ– క్రాపింగ్ చేస్తున్నాం. ► పంటను సాగు చేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం. ఇలాంటి రైతు భరోసా కేంద్రాలు, వ్యవస్థలను గ్రామాల్లో ఉంచాం. వీటిని వినియోగించుకోగలిగితే సమాజానికి బాగా మేలు జరుగుతుంది. ► ఇ– క్రాపింగ్ అనేది సీసీఆర్సీ కార్డులకే కాదు, వడ్డీ లేని పంట రుణాలకు, ఇన్పుట్ సబ్సిడీకి, ఇన్సూరెన్స్‌కు.. ఇలా అన్నింటికీ అనుసంధానం అవుతుంది. దీనివల్ల బ్యాంకర్లు ఇచ్చే రుణాలకు భద్రత కూడా ఉంటుంది. అన్ని ఆర్బీకేల్లోనూ బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ► రాష్ట్రంలో 10,778 ఆర్బీకేలకు గాను బ్యాంకర్లు ఇప్పటికే 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడం ముదావహం. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను నియమించడం ప్రశంసనీయం. మిగిలిన 4240 చోట్ల కూడా వీలైనంత త్వరగా వారిని నియమించాలని కోరుతున్నాను. ► ప్రతి ఆర్బీకేలో ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉండాలి. ఇతని సేవలను ఆర్బీకే వినియోగించుకోవాలి. ఇ– క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి. ఇది అంతిమంగా డిజిటలైజేషన్ మార్గంలో పెద్ద అడుగు అవుతుంది. ► బ్యాంకింగ్ విషయంలో వైఎస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేశామని చెబుతున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే.. ఖాతాదారులందరికీ ఏటీఎం సదుపాయం కల్పించడం, క్రెడిట్ కార్డులు ఇవ్వడం, ఇంటర్నెట్/ఆన్లైన్ సదుపాయం కల్పించడం అని చెప్పారు. ఇది మంచిదే. కానీ సేవల పరంగా ఇంకా ముందుకెళ్లాలి. ► అంతిమంగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి వ్యక్తికీ రుణాలు అందాలి. ఆర్బీకేలు, అందులో కియోస్క్‌లు లాంటి వ్యవస్థలు ఇతర రాష్ట్రాల్లో లేవు. ఇప్పుడు ఇలాంటి వ్యవస్థలు మన రాష్ట్రంలో మనకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో ఆదర్శ రాష్ట్రంగా ఏపీని చూపించగలగాలి. ఆర్బీకేలను తమవిగా బ్యాంకర్లు భావించాలి. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలి ► జగనన్న తోడు కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం. 9.05 లక్షల మంది చిరు వ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. ప్రతి ఒక్కరికీ రూ.10 వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. ► దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టి సారించాలి. ► ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తోంది. వీరికి తగిన తోడ్పాటు అందించాలని కోరుతున్నాను. ► ఈ సమావేశంలో సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పలువురు ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్చువల్‌గా ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ కె నిఖిల, యూబీఐ ఈడీ దినేష్ కుమార్ గార్గ్‌లు పాల్గొన్నారు. మహిళా సాధికారతకు సహకరించాలి ► వైఎస్సార్ చేయూత ద్వారా మహిళలు గణనీయంగా లబ్ధి పొందుతున్నారు. లబ్ధిదారైన మహిళ సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. క్రమం తప్పకుండా నాలుగేళ్ల పాటు ఏడాదికి రూ.18,750 చొప్పున మొత్తంగా రూ.75 వేలు అందుతాయి. ► వివక్షకు తావులేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారికి ఈ మొత్తం అందుతుంది. తద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారిని రిలయన్స్, ఐటీసీ, ప్రోక్టర్ అండ్ గాంబిల్, హిందుస్థాన్ యూనిలీవర్, అమూల్ లాంటి కంపెనీలతో టై అప్ చేశాం. ► ఈ మహిళలకు సరైన మార్గనిర్దేశం చేస్తే.. ఈ డబ్బును పెట్టుబడిగా పెట్టుకుని క్రమం తప్పకుండా ఉపాధి పొందుతారు. చేయూత కింద ఇప్పటికే రెండుసార్లు నగదు అందించాం. మరో రెండుసార్లు అందిస్తాం. బ్యాంకర్లు ఈ కార్యక్రమంపై ప్రత్యే శ్రద్ధ పెట్టాలని కోరుతున్నాను. ► మహిళ చేతిలో పెట్టే డబ్బు, బ్యాంకర్ల సహకారంతో ఆస్తులుగా మారి, వారికి ఉపాధి అందాలని కోరుతున్నాను. ఇప్పటికే 1.17 లక్షల పాలిచ్చే పశువులను పంపిణీ చేశాం. 72,179 మేకలు, గొర్రెల యూనిట్లను కూడా అందించాం. ఫేజ్ –2లో భాగంగా కిరాణా దుకాణాల కోసం 22 వేల మంది, మరో 35,898 మంది పాలిచ్చే పశువులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. మహిళా సాధికారిత సాధన విషయంలో బ్యాంకర్ల సహకారం కోరుతున్నాం. కష్టకాలంలో మీ సేవలు భేష్ ► కోవిడ్ విపత్తు కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించింది. పంపిణీ వ్యవస్థ దెబ్బతింది. ఉపాధి మార్గాలు దెబ్బ తిన్నాయి. కోవిడ్ కారణంగా పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ విపత్కర పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా ఇదే రకంగా దెబ్బతింది. ► గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38 శాతం తగ్గింది. దీని తదనంతర సంవత్సరం అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది. ► దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25 శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో 24.43 శాతం మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. ► 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో క్షీణత 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను. ► గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ.3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయి. వ్యవసాయ రంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం. ఏపీ కార్యక్రమాల పట్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఆసక్తి ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమిస్తున్నాం. రాష్ట్రంలో చేయూత మహిళలకు స్వయం ఉపాధి కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన సమావేశాల్లో పలు ఉత్తరాది రాష్ట్రాలు ఏపీ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని బ్యాంకర్లను కోరారు. పెద్ద సంస్థలతో కలిసి రిటైల్ దుకాణాలను మహిళలు నడుపుతున్న తీరు పట్ల బిహార్, యూపీ ఎంపీలు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏపీ తరహాలోనూ తమ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. జగనన్న తోడులో భాగంగా చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల్లో దేశంలోనే ఏపీ నంబర్‌వన్‌గా నిలిచింది. – వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్ఎల్బీసీ కన్వీనర్ డిజిటలైజేషన్‌తో సులువుగా సేవలు వైఎస్సార్ జిల్లాలో పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. తదుపరి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సంపూర్ణ డిజటలైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సులువుగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. – సుధీర్‌కుమార్ జన్నావర్, చీఫ్ జనరల్ మేనేజర్, నాబార్డ్ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఆంధ్రప్రదేశ్‌లో చేపడుతున్న కార్యక్రమాలు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నిలబడ్డానికి దోహదపడ్డాయి. ఆర్బీకేలు కూడా వినూత్న వ్యవస్థ. వీటివల్ల రైతులకు చాలా ప్రయోజనం ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల అమ్మకం, కియోస్క్‌ల ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ఇప్పటి డిజిటల్ ఏజ్‌లో ముందడుగుగా భావిస్తున్నాం. – దినేష్‌కుమార్ గార్గ్, యూబీఐ ఈడీ, ముంబయి -
బ్యాంకులు మరింత తోడ్పడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాల్సిందిగా రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో సోమవారం మంత్రి నేతృత్వంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వంటి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక పథకాలను నిరంతరాయంగా అమలుచేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, అందరికీ ఇళ్లు, టిడ్కో గృహాలు వంటి పథకాలకు బ్యాంకులు మరింతగా సహకరించాలి. ► రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సీఎం వైఎస్ జగన్ అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టారు. వాటితోపాటు కౌలు రైతులందరికీ అవసరమైన మేర రుణాలు అందించాలి. ► రాష్ట్రంలో 130 శాతం క్రెడిట్ డిపాజిట్ నిష్పత్తిని నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వం తరఫున బ్యాంకర్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు. ► వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద సుమారు 50 లక్షల మందికి బీమాను కలి్పంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనికీ బ్యాంకులు సహకరించాలి. ► పెండింగ్‌లో ఉన్న ‘జగనన్న తోడు’ దరఖాస్తుదారులందరికీ త్వరితగతిన సాయం చేయాలి. ► ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకిచ్చే రుణాల వాటాలో మెరుగైన ప్రగతి కనబర్చాలి. ► స్వయం సహాయక సంఘాలకిచ్చే రుణాలపై వడ్డీ విషయంలో అన్ని బ్యాంకులు ఒకే విధమైన విధానాన్ని పాటించాలి. కౌలు రైతులకు మరిన్ని రుణాలివ్వండి.. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలు మంజూరులో మెరుగైన ఫలితాలు సాధించకపోవడంపై గత డిసెంబర్లో సీఎం అసంతృప్తి వ్యక్తంచేసిన విషయాన్ని గుర్తుచేశారు. వచ్చే ఆరి్థక సంవత్సరంలోనైనా వీరికి మెరుగైన రీతిలో రుణాలివ్వాలని కోరారు. వ్యవసాయానుబంధ రంగాల రైతులకూ సాయం చేయాలన్నారు. రైతుభరోసా కేంద్రాలను బలోపేతం చేసేందుకు బ్యాంకులు అన్నివిధాలా తోడ్పడాలని మంత్రి కన్నబాబు కోరారు. ఏపీలోనే అత్యధిక కౌలు రైతులకు రుణాలు నాబార్డు సీజీఎం సుదీర్ జన్నావర్ మాట్లాడుతూ.. దేశంలో అత్యధిక కౌలు రైతులకు రుణాలందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశేనన్నారు. అన్ని బ్యాంకులు మెరుగైన లక్ష్యాలు సాధించడాన్ని ఆయన కొనియాడారు. ఆర్బీఐ జీఎం సుందరం శంకర్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో క్రెడిట్ రేట్ 6.2 శాతంగా ఉండగా ఏపీలో 15.92 శాతంగా ఉండడం అభినందనీయమన్నారు. చివరి త్రైమాసికంలో కూడా బ్యాంకులు తమ లక్ష్యాలను అధిగమించాలని ఆకాంక్షించారు. ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం కింద ఆక్వా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున అవకాశాలున్నాయని అందుకు బ్యాంకులు సహకారం అందించేందుకు ముందుకు రావాలని యుబీఐ సీజీఎం లాల్‌సింగ్ కోరారు. అంతకుముందు.. ఎస్ఎల్బీసీ కనీ్వనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎం బ్రహ్మానందరెడ్డి సమావేశానికి స్వాగతం పలికి అజెండాను వివరించారు. -
కౌలు రైతులకు మరిన్ని రుణాలు
సాక్షి, అమరావతి: కౌలు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ముందుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. ప్రస్తుతం కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని పేర్కొన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యూనిట్లకు (ఎంఎస్ఎంఈ), ఎస్సీ, ఎస్టీ మహిళలకు, ప్రధాన మంత్రి ముద్ర యోజన రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆయా రంగాల వారికి రుణాల మంజూరు పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. మే 15వ తేదీన వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో 210వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం సూచనలు ఇలా.. – వైఎస్సార్ జిల్లా మాదిరిగా బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలి. – గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిష్ మీడియంలో బోధన, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సహకరించాలి. – ఆర్బీకే (రైతు భరోసా కేంద్రం)లో ఉన్న ఇంటర్నెట్ కియోస్క్ ద్వారా ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్ధారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయి. పంటల వివరాలను నమోదు చేయించేందుకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్లకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఆ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తాం. తద్వారా సాగు చేస్తున్న పంటలకు తగిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. – మైక్రో ఎంటర్ప్రైజెస్ కోసం జూన్‌లో కొత్త పథకం తీసుకొస్తున్నాం. ఇందులో భాగంగా చిరు వ్యాపారులు, తోపుడు బండ్లమీద చిన్న పాటి వ్యాపారం చేసుకునే వారికి గుర్తింపు కార్డులతో రూ.10 వేల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నది ఆలోచన. ఇందుకు మీ (బ్యాంకుల) సహకారం చాలా అవసరం. – కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు నీరివ్వడం.. ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటర్‌గ్రిడ్ ద్వారా మంచి నీటి సరఫరా, తదితర కార్యక్రమాలన్నింటికీ బ్యాంకుల సహకారం కావాలి. రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం 1,000పైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 వేల జనాభాకు పైబడిన 567 చోట్ల కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సీబీఎస్) సర్వీసులు ప్రారంభించాం. 5 కి.మీ పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య 1.1 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చాం. ఏడాదిలోగా వైఎస్సార్ జిల్లాలో వంద శాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం అమల్లోకి వస్తుంది. ప్రాథమిక రంగానికి రూ.1,18,464 కోట్లు (70.01 శాతం), వ్యవసాయ రంగానికి రూ.83,444 కోట్లు (72.56 శాతం), రుణ ప్రణాళిక మేరకు రూ. 1,73,625 కోట్లు (75.75 శాతం), ఎంఎస్ఎంఈలకు రూ.29,442 కోట్లు (81.78 శాతం) రుణాలు (ఇవన్నీ డిసెంబర్ నాటికి) ఇచ్చాం. స్టాండప్ ఇండియా కింద 4,857 మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు సహాయం చేశాం. – ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి సమావేశంలో పాల్గొన్న వారు.. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, వ్యసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ కే.వి.నాంచారయ్య, ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్. -
ప్రభుత్వ పథకాల డబ్బు లబ్ధిదారులకే
సాక్షి, అమరావతి: ప్రభుత్వం పలు పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలను ఆదుకునేందుకు ఇస్తున్న డబ్బులు నేరుగా లబ్ధిదారులకు చేరాల్సిందేనని, బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించు కోకూడదని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బ్యాంకర్లకు స్పష్టం చేశారు. ఇలా మినహాయించు కోలేని రీతిలో అన్ ఇన్ కంబర్డ్ (నిర్దేశిత) బ్యాంకు ఖాతాలు తెరవాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో జరిగిన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, వాటి లక్ష్యాలను బ్యాంకర్లకు వివరించారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే విశ్వసనీయత నిలబడుతుందని అన్నారు. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని, ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్థిక శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉండాలని సూచించారు. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తామని, అందుకు సంబంధించిన రశీదును గ్రామ వలంటీర్లు ప్రతి ఇంటికీ అందిస్తారని చెప్పారు. సున్నా వడ్డీ కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు ఎంత చెల్లించాలో జాబితా ఇస్తే, ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. గతంలో (గత ప్రభుత్వంలో) కొన్ని చెప్పి వాటిని అమలు చేయకపోవడం వల్ల సమస్యలు వచ్చాయని, ఇప్పుడు అలా కాదని.. తాము చెప్పిన దానికి కట్టుబడి ఉంటామని సీఎం స్పష్టం చేశారు. ముద్ర రుణాల పంపిణీపై దృష్టి సారించాలి ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సీఎం సూచించారు. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసే వారికి గుర్తింపు కార్డులు ఇస్తామని, చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ఒక పథకాన్ని అమలు చేస్తుందని, దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరమని కోరారు. ఎక్కడ సమస్య ఉన్నా ప్రభుత్వం ముందుకు వస్తుందని, దానిని సానుకూలంగా పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువగా (85 శాతం) ఉందని బ్యాంకు అధికారులు చెప్పడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు వర్షాలు బాగా పడినందున రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉన్నాయని, రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. సచివాలయంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి 50 కుటుంబాలకు ఒక గ్రామ వలంటీర్‌ను ఏర్పాటు చేశామని, ప్రతి రెండు వేల జనాభాకో గ్రామ సచివాలయం త్వరలో ప్రారంభం అవుతుందని, వారి సేవలను బ్యాంకర్లు వినియోగించుకోవచ్చని సీఎం సూచించారు. రైతులు, కౌలు రైతులకు రుణాల పంపిణీలో వీరి సేవలను వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల షాపు ఉంటుందని, అక్కడే రైతులకు వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని సీఎం తెలిపారు. వర్క్‌షాపు ద్వారా వ్యవసాయంలో అత్యుత్తమ విధానాలను రైతులకు తెలియజేస్తామని, ప్రకృతి వ్యవసాయంపై కూడా వారికి శిక్షణ ఇస్తామని చెప్పారు. కరువు, సాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో చిరుధాన్యాలను బాగా ప్రోత్సహిస్తామని తెలిపారు. వీరికి రుణాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని బ్యాంకర్లకు సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లకు తగిన రుణ సహాయం చేస్తే, ఔత్సాహిక యువకులు ముందుకు వచ్చి పరిశ్రమలు పెట్టే అవకాశం ఉందని సీఎం సూచించారు. ఔత్సాహికులకు చేయూత ఇవ్వండి.. ఆర్థిక రంగం మందగమనం సూచనలు దేశ వ్యాప్తంగా కనిపిస్తున్నాయని, ఈ నేపథ్యంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలపై దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఔత్సాహికులు ఎంతో మంది కంపెనీలు పెడుతున్నారని, వారికి బ్యాంకర్లు చేయూత నివ్వాలని కోరారు. బ్యాంకర్లు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సమన్వయం ఎక్కువగా ఉండాలని ఆయన సూచించారు. వైఎస్సార్ నవోదయం ద్వారా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని, బ్యాంకర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించాలన్నారు. చిన్న మొత్తాలకు ఇంకా భారీ వడ్డీలను వసూలు చేస్తున్నారని, ఐదు వేలు, పది వేలకు కూడా పెద్ద ఎత్తున వడ్డీలు వసూలు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి చిన్న రుణాల విషయంలో సామాన్యులను ఆదుకోవడంపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలని బుగ్గన సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ పొగాకు రైతుల రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు. సీఎం ఆరుతడి పంటలను, చిరుధాన్యాలను ప్రోత్సహిస్తున్నందున ఆ రైతులకు రుణాలు అందించాలని కోరారు. 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సదుపాయం ప్రతి 2 వేల జనాభాకు బ్యాంకింగ్ సుదుపాయం ఉండాల్సిందేనని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ అన్నారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని, వర్షాలు బాగా కురుస్తున్నందున వ్యవసాయ రంగం ఊపందుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రాధాన్యత రంగాలకు ఆశించిన రీతిలో రుణాలు అందుతున్నాయన్నారు. కౌలు రైతుల కోసం ముఖ్యమంత్రి తీసుకున్న చర్యలు చాలా బాగున్నాయని నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సెల్వరాజ్ ప్రశంసించారు. దీని వల్ల వ్యవస్థీకృత ఆర్థిక సంస్థల నుంచి వారికి రుణాలు అందుతాయని అన్నారు. కేవలం పంట రుణాలే కాకుండా ఇతరత్రా రుణాలు కూడా కౌలు రైతులకు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పాలనలో సమూల మార్పులు ప్రభుత్వ పరిపాలన దృక్పథంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ అన్నారు. పరిపాలనలో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులను తీసుకువస్తోందని.. వలంటీర్లు, గ్రామ సచివాలయాల వల్ల క్షేత్ర స్థాయిలో చివరి వరకూ అనుసంధానం ఉంటుందని చెప్పారు. దీన్ని బ్యాంకులు బలంగా వినియోగించుకోవాలన్నారు. సీఎం అనేక వర్గాల వారికి మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నారని, వివిధ పథకాల లబ్ధిదారులు, వారి బ్యాంకు ఖాతాలను ఎస్ఎల్బీసీకి అందిస్తామని, నేరుగా లబ్ధిదారులకే నగదు అందేలా చూడాలని కోరారు. -
వడ్డీలకే సరిపోని బాబు కేటాయింపులు
బాబు లెక్కలన్నీ మాయాజాలమే వడ్డీలకే రూ.13,937 కోట్లు కావాలి చంద్రబాబు రెండు దశల్లోనూ ఇచ్చేది రూ.6,840 కోట్లు ఏటికేడాది అపరాధ వడ్డీల భారంతో రైతులు మరింత అప్పుల ఊబిలోకి నాలుగేళ్లలో అసలు తీరకపోగా వడ్డీల భారం పెరుగుతుంది హైదరాబాద్: రైతుల రుణాల మాఫీ సంగతి దేవుడెరుగు.. చంద్రబాబునాయుడు నిర్వాకం కారణంగా రైతులు మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తొలి దశ, రెండో దశ మాఫీ పేరుతో చంద్రబాబునాయుడు మాయాజాలం చేశారు. రుణమాఫీకి ఆయన చెల్లిస్తున్న డబ్బుతో రైతులపై ఇప్పటికే పడిన వడ్డీలో సగం కూడా మాఫీ కావడంలేదు. తొలిదశ, రెండోదశ రుణమాఫీపై సోమవారం అసెంబ్లీలో చంద్రబాబు చేసిన ప్రకటనే ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రెండుదశల్లో రుణమాఫీకి కేటాయించినట్లు చంద్రబాబు చెప్పిన రూ.6,840 కోట్లు.. రైతుల రుణాలపై పడిన వడ్డీ భారంలో సగం కూడా లేకపోవడం విడ్డూ రం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆయన అధ్యక్షతన జరిగిన 184వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలోనే 31 మార్చి 2014 నాటికి వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లని తేలింది. చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా అసలుకు తోడు.. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ, పంటల బీమా వంటి సౌకర్యాలు పోయి రైతులపై 14 శాతం మేర అపరాధ వడ్డీ పడింది. రూ.87,612 కోట్ల మీద అపరాధ వడ్డీ కింద రూ.12,265 కోట్ల భారం పడింది. అయినా సరే గత ఏడాది సెప్టెంబర్ నాటికి కూడా చంద్రబాబు రుణమాఫీ చేయని కారణంగా ఆ వడ్డీల భారం రైతులపై మరింత పెరిగింది. వడ్డీలతో కలిపి రుణాల మొత్తం రూ.99,555 కోట్లు గత ఏడాది డిసెంబర్ నెలాఖరున జరిగిన 188వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రైతుల వ్యవసాయ రుణాలు ఏకంగా రూ.99,555 కోట్లకు పెరిగినట్లు బ్యాంకర్లు చంద్రబాబుకు స్పష్టంగా చెప్పారు. అంటే 99,555 కోట్ల రూపాయలు కొత్తగా రుణాలు ఇవ్వడం వల్ల కాకుండా వడ్డీల భారంతో మొత్తం పెరిగింది. రూ.99,555 కోట్ల మీద 14 శాతం వడ్డీ లెక్కకడితే రూ.13,937 కోట్లను వడ్డీల కిందే రైతుల చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే మాఫీ పేరుతో చంద్రబాబు స్వయంగా అసెంబ్లీ వేదికగా చెప్పిన లెక్కల ప్రకారం రెండు విడుతల్లో చెల్లిస్తున్నది కేవలం రూ.6,840 కోట్లు మాత్రమే. అంటే వడ్డీలో సగం కూడా నిధులు కేటాయించకుండా చంద్రబాబు రైతులను రుణ విముక్తులను చేస్తామంటూ గంభీరంగా ప్రసంగం చేశారు. ఇలా ఏడాదికోసారి అరకొర నిధులను వడ్డీలకే సరిపోకుండా ఇస్తూ నాలుగేళ్ల పాటు రుణమాఫీని సాగతీయడం వల్ల రైతులు వచ్చే నాలుగేళ్ల పాటు వడ్డీ లేని రుణాలను, పావలా వడ్డీని, పంటల బీమాను కోల్పోనున్నారు. ఇప్పటికే గత ఖరీఫ్, రబీలో వడ్డీ లేని రుణాలను, పావలా వడ్డీ రుణాలను కోల్పోయి ఏకంగా అపరాధ వడ్డీతో 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. చంద్రబాబు సర్కారు వడ్డీలకు సరిపడ మాఫీ కూడా చేయకపోవడంతో వడ్డీల భారం ఏటా పెరుగుతూ రైతుల్ని మరింత అప్పులు ఊబిలోకి నెట్టేసే పరిస్థితి నెలకొంది. రైతుల రుణాలను ప్రభుత్వం పూర్తిగా తీరిస్తే లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణం, మూడు లక్షల రూపాయల వరకు పావలా వడ్డీకి రుణం పుట్టేది. అయితే చంద్రబాబు నిర్వాకం కారణంగా గడిచిన ఖరీఫ్, రబీయే కాదు.. వచ్చే నాలుగేళ్ల పాటు బ్యాంకుల నుంచి రుణం పుట్టే అవకాశం లేదు. ప్రస్తుతం రైతులను వడ్డీ వ్యాపారుల బారిన పడేసిన బాబు వచ్చే నాలుగేళ్ల పాటు కూడా వారు ఆ వ్యాపారుల కబంధహస్తాల్లో నలిగిపోయే పరిస్థితి కల్పించారు. ఖాతాల ఏరివేతే లక్ష్యంగా.. తొలిదశలోను, రెండో దశలోను ఆంక్షల పేరుతో వీలైనన్ని రైతుల రుణ ఖాతాలను ఏరివేయడమే లక్ష్యంగా సర్కారు పనిచేసింది. బ్యాంకర్లు రైతుల రుణాలకు సంబంధించి మొత్తం 82.66 లక్షల ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేయగా తొలిదశ, రెండోదశలో కలిపి వడపోత తరువాత కేవలం 51.45 లక్షల ఖాతాలనే పరిగణనలోకి తీసుకున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మిగిలిన 31.21 లక్షల రైతుల ఖాతాలను రుణమాఫీకి అనర్హమైనవని తిరస్కరించారు. అంతేకాకుండా రెండోదశలో బాబు సర్కారు చేసిన మాయ అంతా ఇంతా కాదు. రెండో దశలో మొత్తం 42.23 లక్షల ఖాతాలను వడపోసి కేవలం 11.02 లక్షల ఖాతాలనే పరిగణనలోకి తీసుకున్నారు. అంటే 31.21 లక్షల ఖాతాలను తిరస్కరించారు. 11.02 లక్షల ఖాతాలకు చెందిన రైతులను కుటుంబాల యూనిట్‌గా చేసి 6.42 లక్షల కుటుంబాలే అర్హమైనవిగా తేల్చారు. తొలిదశలో 26.77 లక్షల కుటుంబాలకు, రెండోదశలో 6.42 లక్షల కుటుంబాలు కలిపి 33.19 లక్షల కుటుంబాల ఖాతాలకే అరకొర రుణమాఫీని పరిమితం చేశారు. తద్వారా రైతులు తీసుకున్న రుణాల్లో రుణమాఫీని ఒక వంతుకన్నా తక్కువకే చంద్రబాబు సర్కారు పరిమితం చేసినట్లయింది. రెండోదశలో రుణమాఫీ కింద 20 శాతం కోసం కేవలం 2,176 కోట్ల రూపాయలు సరిపోతాయని లెక్కగట్టారు. రుణమాఫీ ఖాతాల సంఖ్య ఏ విధంగా తగ్గించారో ఒకసారి పరిశీలిస్తే బాబు మాయాజాలం అర్థం అవుతుంది. రుణమాఫీలో చంద్రబాబు మాయాజాలం తొలిదశలో మాఫీ పేరుతో మాయచేసిన చంద్రబాబు ఇప్పుడు రెండోదశ పేరుతో మొత్తం రుణమాఫీలో తిమ్మినిబమ్మిని చేస్తూ లెక్కల మాయాజాలం చేశారు. ఫలితంగా రైతులు అప్పులు, అపరాధ వడ్డీల భారంతో కుంగిపోవడం తప్ప చేసేదేమీ లేదని అసెంబ్లీలో చేసిన ప్రకటన ద్వారా సీఎం పరోక్షంగా స్పష్టం చేశారు. వచ్చే నాలుగేళ్లలో వడ్డీలతో కలిపి రైతుల రుణాల కింద రూ.18,480 కోట్లు చెల్లించనున్నట్లు ఆయన చెప్పారు. రూ.99,555 కోట్లలో వచ్చే నాలుగేళ్లలో చంద్రబాబు వడ్డీలతో కలిపి చెల్లిస్తానన్న రూ.18,480 కోట్లు పోగా ఇంకా రైతుల పేరుమీద ఇప్పటి వరకు చూస్తే రూ.81,075 కోట్ల రుణాలుంటాయి. రూ.81,075 కోట్లను ఇకనుంచి పడే అపరాధ వడ్డీలతో సహా ఆయా రైతులే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చడంతో రైతులు రుణ విముక్తికి బదులు రుణాల ఉచ్చులో కూరుకుపోయారు. ► బ్యాంకులు నమోదు చేసిన రైతుల ఖాతాల సంఖ్య 82.66 లక్షలు ► తొలిదశలో రుణమాఫీకి అర్హత పొందిన ఖాతాలు 40.43 లక్షలు ► తొలిదశలో కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 26.77 లక్షలు ► రెండోదశలో ప్రాసెస్ చేసిన ఖాతాల సంఖ్య 42.23 లక్షలు ► {పాసెస్ అనంతరం అర్హత పొందిన ఖాతాల సంఖ్య 11.02 లక్షలు ► రెండోదశలో కుటుంబం యూనిట్‌గా రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 6.42 లక్షలు ► రెండు దశల్లో రైతుల రుణమాఫీకి ఆమోదించిన ఖాతాల సంఖ్య 51.45 లక్షలు ► రెండు దశల్లో రుణమాఫీ వర్తించిన రైతుల సంఖ్య 33.19 లక్షలు ► గత ఏడాది సెప్టెంబర్ నాటికి రైతుల పేరు మీద ఉన్న వ్యవసాయ రుణాలు రూ.99,555 కోట్లు ► రెండు దశల్లో కలిపి నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే సొమ్ము రూ.18,480 కోట్లే ► మిగతా రూ.81,075 కోట్లు రైతుల పేరుమీదే అప్పుగా కొనసాగుతాయి -
స్వయం ఉపాధి.. జాప్యంతో సమాధి
* నిరుద్యోగ యువతకు రుణాలు ఎండమావే * స్వయం ఉపాధి పథకాలకు నిధులు కేటాయించని సర్కారు ఏలూరు : బాబు వస్తే జాబు.. ఉద్యోగం దొరకని వారికి రూ.2,500 చొప్పున నిరుద్యోగ భృతి వస్తుందని ఎన్నికల సమయంలో వెలువడిన ప్రకటనలు చూసి నిరుద్యోగులంతా సంబరపడ్డారు. ఏదో ఒక రూపంలో తమకు ఆసరా దొరుకుతుందనుకున్నారు. జాబు, నిరుద్యోగ భృతి మాట దేవుడెరుగు.. కనీసం స్వయం ఉపాధి పథకాల కింద రుణాలు సైతం మంజూరుకాక వారంతా ఆవేదన చెందుతున్నారు. కనీసం తమ కాళ్లపై తాము నిలబడదామనుకుంటున్న యువతకు చేయూత అందటం లేదు. స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్ ఎండమావిగా కనిపిస్తోంది. రుణాల కోసం 10 వేల మంది ఎదురుచూపు ఏటా బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్లతోపాటు సెట్వెల్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద నిరుద్యోగులకు రుణాలు ఇస్తున్నారు. అరుుతే, రెండేళ్లుగా జిల్లాలోని ఒక్క నిరుద్యోగికైనా స్వయం ఉపాధి యూనిట్ మంజూరు కాలేదు. గత ఏడాది అప్పటి సర్కారు నిర్లక్ష్యం వల్ల రుణాల మం జూరులో జాప్యం జరిగింది. తీరా రుణాలిచ్చే సమయూనికి పంచాయతీ ఎన్నికలు రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. దాదాపుగా 10వేల మందికి రుణం ఇచ్చేందుకు నిర్ణయించిన ఆయూ విభాగాల అధికారులు ప్రభుత్వానికి తిరిగి ప్రతిపాదనలు పంపించారు. అయితే, నిధుల మంజూరు విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణ యం తీసుకోలేదు. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి పథకాల కింద వివిధ యూనిట్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు ముందడుగు వేయలేకపోతున్నారు. పాత వారికే రుణాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొత్తగా దరఖాస్తులు స్వీకరించడం వల్ల ప్రయోజనం ఉండదనే భావనతో అధికారులు ఉన్నారు. ఈ కారణంగానే ప్రతిపాద నలు రూపొందించడం లేదు. ఎస్సీ కార్పొరేషన్‌కు నిధులిచ్చినా... జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం నిధులు కేటారుుంచింది. 5,073 యూనిట్లు స్థాపించాలనే లక్ష్యంతో రూ.42.26 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డారుు. ఇందుకు సంబంధించి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రుణ ప్రణాళికను ఆమోదించాల్సి ఉంటుంది. బీసీ, మైనార్టీ, సెట్వెల్ ద్వారా కేటాయింపులు లేకపోవడంతో ఇప్పట్లో బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగే అవకాశం లేదని సమాచారం. ఈ కారణంగా నిధులు కేటారుుంచినా ఎస్సీ నిరుద్యోగులకు ఇప్పట్లో రుణాలు అందే పరిస్థితి కనిపించడం లేదు.