సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.
సీఎం ఇంకా ఏమన్నారంటే..
►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం
► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం
► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి
► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం
► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య:
►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం
► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం
►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం
►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం
► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి
► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ
►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం
►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం
►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు
►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను
►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం
► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం
►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం
►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం
►16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం
►ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం
►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం
►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం
►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం..
► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం
►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు
►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు
►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం
►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి
►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం
►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు
►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి
►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది
►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం
చదవండి: గోదావరి గట్టెక్కింది
Comments
Please login to add a commentAdd a comment