lones
-
లోన్ యాప్స్ ఆగడాలపై పూర్తి స్థాయిలో నిఘా: ఏపీ డీజీపీ
సాక్షి, అనంతపురం: లోన్ యాప్స్ ఆగడాలపై లోతుగా విచారణ చేస్తున్నామని.. వీటిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టామని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ, ప్రజా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించిన నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. చదవండి: తిట్టుకున్న టీడీపీ మహిళా నేతలు.. గొడవ ఎందుకంటే? లోన్ యాప్ బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు. పోలీసులపై రాజకీయ నాయకులు విమర్శలు మానుకోవాలన్నారు. నిరాధారణమైన ఆరోపణలు చేసే రాజకీయ నేతలు విశ్వసనీయతను కోల్పోతారని డీజీపీ అన్నారు. -
రైతుల కోసం అగ్రిల్యాబ్స్:సీఎం జగన్
-
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక చర్యలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: నాబార్డ్ వార్షిక రుణ ప్రణాళికపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష చేపట్టారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు,పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నాబార్డ్ చైర్మన్ జీఆర్ చింతల, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వ్యవసాయ రంగం మద్దతుగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయన్నారు. కోవిడ్ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయన్నారు. రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నామని సీఎం అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ►ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం ► సాగుచేస్తున్న రైతులు నష్టపోతే ఆదుకుంటున్నాం ► రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా ఆర్బీకేలు చేదోడుగా నిలుస్తున్నాయి ► గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్ చేస్తున్నాం ► వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య: ►గ్రామీణనియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్ ఏర్పాటు చేశాం ► ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం ►గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలు.. ల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం ►పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం ► దీనికి నాబార్డు సహాయ సహకారాలు కావాలి ► రైతులు చేస్తున్న ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ ►సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం ►పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం ►ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు ►దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులకు ఇప్పటికే ఆదేశించాను ►ఫుడ్ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం ► ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం ►వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం ►వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం ►16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం ►ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధి చేస్తున్నాం ►స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం ►నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం ►ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టాం.. ► పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా.. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో పాఠ్య పుస్తకాలను ముద్రించాం ►భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ నరులుగా అభివృద్ధి చెందుతారు ►గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు ►అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం ►ఫ్లోరోసిస్ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ►వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం ►మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ►ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి ►రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ కోసం ప్రభుత్వం దృష్టిపెట్టింది ►ఎంపిక చేసిన ఈప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం చదవండి: గోదావరి గట్టెక్కింది -
ఆన్లైన్ లోన్ యాప్ కేసు: మరో ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: మొబైల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో లక్షల లోన్ పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. లోన్ తీసుకున్నాక 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అడగకపోయినా అకౌంట్లో డబ్బులు జమ చేసి.. ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పుణెలో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పుణేలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరశురామ్‌తోపాటు భార్య లియాంగ్ టియాన్, పరుశురామ్ అనుచరుడు షేక్ ఆకిబ్లను అదుపులోకి తీసుకున్నారు. వారు 50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: పుట్టింటికిపంపించలేదని.. క్షణికావేశంలో) పుణే కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 101 ల్యాప్‌టాప్‌లు, 106 సెల్ఫోన్లు, సీసీ టీవీలు, డీవీఆర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోన్ యాప్ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. దాదాపు 14 ఇతర నకిలీ లోన్ యాప్‌లను గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. బబల్ లోన్, రూపీ బజార్, ఓకే క్యాష్, రూపీ ఫాక్టరీ, పైసా లోన్, వన్ హోప్, క్యాష్ బీ, ఇన్ నీడ్, స్నాప్ లోన్, పిక్కి బ్యాంక్, క్రేజీ రూపీ, రియల్ రూపీ, రూపీ బియర్, రూపీ మోస్ట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 24 మంది అరెస్టయ్యారు. నిందితులు లోన్స్ తీసుకున్న వారికి కాల్ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.(చదవండి: రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..) -
‘ఇన్స్టంట్’ మోసగాళ్ల ఆటకట్టు
గచ్చిబౌలి: ఇన్స్టంట్ లోన్ యాప్స్‌తో ఘరానా మోసానికి పాల్పడిన అంతర్జాతీయ ముఠాను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో సీపీ వివరాలు వెల్లడించారు. చైనాకు చెందిన జియా జాంగ్, ఢిల్లీకి చెందిన ఉమాపతి అలియాస్ అజయ్‌లు 13 ఇన్స్టంట్ యాప్‌లను డెవలప్ చేశారు. 2019లో ఇద్దరు కలిసి ఢిల్లీలో స్కైలైన్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్ ఇండియా పైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. దానికి అనుబంధంగా గూర్గావ్లో టాప్ఫన్ టెక్నాలజీస్, ఫాస్మటే టెక్నాలజీస్, 9 నెలల క్రితం హైదరాబాద్‌లో కుబేవో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, బెస్ట్ షైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కంపెనీలను నెలకొల్పారు. షాంగైకి చెందిన ఇ బాయ్ అలియాస్ డిన్నీస్ చెందిన జికాయ్ హోల్డింగ్ పీటీఈలో సీఓఓగా పని చేస్తూ బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు. కొత్త ప్రాంతంలో కాల్సెంటర్లను ఏర్పాటు చేసే అతడికి రాజస్తాన్‌కు చెందిన సత్యపాల్ ఖైలియా సహకరించేవాడు. మహరాష్ట్రకు చెందిన అనిరుధ్ బెస్ట్ షైన్ టెక్నాలజీస్ కంపెనీ రిలేషన్స్ మేనేజర్‌గా పని చేస్తుండగా, మురతోటి రిచి హెమంత్ సేత్ స్కై లైన్ కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఇన్స్టంట్ లోన్ తీర్చినా బకాయి ఉందని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఓ వ్యక్తి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు డిల్లీ కేంద్రంగా స్కైలైన్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ జియా జాంగ్ నేతృత్వంలో రుణాలు ఇచ్చి 25 నుంచి 30 శాతం వడ్డీ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కుబేవా టెక్నాలజీస్ పై దాడులు నిర్వహించి రెండు ల్యాప్ టాప్‌లు, నాలుగు సెల్ ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.2 కోట్ల నగదును ఫ్రీజ్ చేశారు. చైనాకు చెందిన బాయ్ అలియాస్ డిన్నీస్, సత్యపాల్ ఖైలియా , అనిరుధ్, మురతోటి రిచి హెమంత్ సేత్ లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులు జియా జాంగ్, ఉమాపతి పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా జియా జాంగ్ సింగపూర్‌లో ఉన్నట్లుగా భావిస్తున్నారు. నిందితులపై సైబరాబాద్ పరిధిలో 8, హైదరాబాద్ పరిధిలో 13, రాచకొండ పరిధిలో రెండు కేసులు నమోదైనట్లు సీపీ వివరించారు. ఫిబ్రవరిలో దేశం దాటిన క్యూ యోన్ సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్ యాప్స్ వ్యవహారాల్లో చైనీయులే కీలకమని స్పష్టం కావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. మరోపక్క ఈ లోన్ యాప్స్ వేధింపుల ఇప్పటి వరకు సిటీలో నమోదైన కేసుల సంఖ్య 27కు చేరింది. గురువారం రాత్రి బెంగళూరులోని కాల్ సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. ♦ఈ యాప్స్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన చైనాకు చెందిన క్యూ యోన్ అనే మహిళ దాదాపు ఏడాదిన్నర పాటు భారత్‌లో ఉండి యాప్‌లతో పాటు కాల్‌సెంటర్ల ఏర్పాటు వ్యవహారాలను పర్యవేక్షించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమె చైనా తిరిగి వెళ్లినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయాలని భావిస్తున్నారు. ♦చైనీయులు కేవలం నిబంధనల నేపథ్యంలోనే తమ సంస్థల్లో భారతీయుల్ని డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా క్యూ యోన్ ఢిల్లీలో నియమించిన వ్యక్తే ల్యాంబో. ఇటీవల లోన్ బాధితుల ఆత్మహత్యలు, కేసు లు నమోదు తదితర పరిణామాల నేపథ్యంలో ల్యాంబో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతడి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ♦హైదరాబాద్ కాల్ సెంటర్లకు కీలకంగా వ్యవహరించి మధుబాబు స్నేహితుడు నాగరాజ్‌తో బెంగళూరులో రెండు కాల్ సెంటర్లు ఏర్పాటు చేయించాడు. ఎన్యూ ప్రైవేట్ లిమిటెడ్, ట్రూత్ ఐ పేర్లతో ఉన్న వీటికి తన సమీప బంధువైన ఈశ్వర్‌ను హెడ్‌గా నియమించాడు. సైబర్ క్రైమ్ పోలీసులు వీటిపై దాడి చేసి ఈశ్వర్‌తో పాటు మధుసూదన్, సతీష్‌కుమార్‌లను అరెస్టు చేసి సిటీకి తీసుకువస్తున్నారు. యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇన్స్టంట్ యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. అలాంటి యాప్‌లను డౌన్ లోడ్ చేయవద్దని, ఆర్బీఐ గుర్తించిన సంస్థల నుంచే రుణాలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అనుమతి ఇచి్చన ఫైనాన్స్ సంస్థల నుంచి లేదా తెలిసిన వారి వద్ద రుణాలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు. ఇన్స్టంట్ లోన్ పేరిట ఎవరైనా వేధి స్తే సమీపంలోని పీఎస్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశ ంలో సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ బాలకృష్ణా రెడ్డి, సీఐలు సంజయ్ కుమార్, శ్రీనివాస్, ఎస్ఐలు విజయవర్ధన్,రాజేందర్, మురళి పాల్గొన్నారు. 116 యాప్స్ తొలగించాలని లేఖ గూగుల్ అప్లోడ్ చేసిన యాప్స్‌తో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారని ఈ క్రమంలో 116 యాప్స్‌ను తొలగించాలని గుగూల్‌కు లేక రాసినట్లు సీపీ తెలిపారు. ఇద్దరు చైనీయుల వీసాలపై దర్యాప్తు చేస్తున్నామని, వారి నేర చరిత్రను తెలుసుకునేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకుంటామన్నా రు. యాప్స్ ద్వారా లోన్ ఇచ్చే నగదు ఎక్కడి నుంచి వస్తుందనే అంశంపై దర్యాప్తు చేస్తామన్నారు. కాల్ సెంటర్లలో పని చేసే వారిని విచారిస్తున్నామని, తెలిసి మోసాలకు పాల్పడిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. యాప్స్ ద్వారా 7 రోజులు, 15 రోజులకు లోన్లు ఇస్తున్నారని, బకెట్ లిస్ట్ ఎం2, ఎం3 కేటగిరీపై ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో తెలియాల్సి ఉందన్నారు. 40 ఏళ్ల లోపు వారిని టార్గెట్ చేసి రుణాలు ఇచ్చి 25 నుంచి 30 శా తం వడ్డీ వసూలు చేస్తున్నారని తెలిపారు. సమాయానికి లోన్ కట్టని వారిని అసభ్య పదజాలంతో తిడుతూ, లీగల్ నోటీసులు ఇస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ఇప్పటికే లోన్ యాప్స్ మోసాలపై ఆర్బీఐ అధికారులకు తెలిపామని, కేంద్ర ఏజెన్సీలకు లేక రాస్తామన్నారు. -
ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ..
సాక్షి, విజయవాడ : అవసరం కోసం అప్పుచేసి మైక్రో ఫైనాన్స్ ఉచ్చులో చిక్కుకొన్న బాధితులు ఒకరొకరుగా బయటకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన భరోసాతో ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు పిర్యాదు చేస్తున్నారు. యాభై వేలు లోన్ తీసుకొని 2 లక్షల 80 వేలు కట్టినా వేధింపులు ఆపలేదంటూ నాగరాజు అనే బాధితుడు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆన్లైన్ లోన్ యాప్‌ల ఉచ్చులో చిక్కుకొన్న తనను కాపాడి రుణ విముక్తి కలిగించాలని వేడుకున్నాడు. అనంతరం నాగరాజు సాక్షి టీవీతో మాట్లాడాడు. ఫేస్బుక్లో ప్రకటన చూసి తొలుత నాలుగు యాప్‌లలో 20వేల రూపాయల లోన్ తీసుకున్నానని తెలిపాడు. కమిషన్ తీసుకొని తన అకౌంట్లో పదకొండు వేలు వేసినట్లు తెలిపాడు. చదవండి: వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్ ‘వారం లోపే లోన్ తిరిగి చెల్లించాలి. రొటేషన్ కోసం చాలా యాప్‌లలో లోన్ తీసుకొని డ్యూలు కట్టాను. 50 వేలకి 2 లక్షల ఎనభై వేలు చెల్లించినా అప్పు తీరలేదని వేధిస్తున్నారు. ఫోన్లో అసభ్య పదజాలంతో దూషిస్తూ క్షోభ పెడుతున్నారు. ఫోన్ కాంటాక్ట్ నంబర్లకు మెసెజ్‌లు పెట్టి పరువు తీస్తామని బెదిరిస్తున్నారు. నలభై శాతం వడ్డీ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. అవసరానికి అప్పుచేసి వాళ్ళ ఉచ్చులో ఇరుక్కున్నాను. ప్రభుత్వ భరోసాతో పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశాను. నాలాగు చాలామంది మైక్రో ఫైనాన్స్ తీసుకొని మానసిక క్షోభ అనుభవిస్తున్నారు’. అని నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. -
వారిని ఉపేక్షించేది లేదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ కాల్ మనీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కాల్ మనీ వ్యవహారాలను ఉపేక్షించేది లేదని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. (చదవండి: ‘పల్లెల్లోకి వైద్యులు.. సరికొత్త వ్యవస్థ’) ఏపీవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు:డీజీపీ మొబైల్ లోన్ యాప్‌లపై ఏపీ వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు చేపడుతున్నట్లు డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మైక్రో ఫైనాన్స్‌పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయని వెల్లడించారు. మొబైల్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.(చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) -
ఆ యాప్‌ల ద్వారా రుణాలొద్దు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: చట్టబద్దత లేని యాప్‌ల ద్వారా రుణాలు స్వీకరించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌ల పై ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు. (చదవండి: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-1ఏ ప్రకారం ఏదైన నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు తగిన రిజిస్ట్రేషన్ అనంతరమే నిబంధనల మేరకు పనిచేయడానికి అనుమతి ఉందని తెలిపారు. ఆర్బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్లైన్ యాప్‌లలో అధికశాతం ఆర్బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు. (చదవండి: జీహెచ్ఎంసీలో ఐఫోన్ల ‘బహుమతులు’!) ఈ యాప్‌లలో అధికంగా చైనీస్‌వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్‌ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు. యాప్‌ల ద్వారా తీసుకున్న రుణాలను చెల్లించని బాధితులను వేధించేందుకు ఈ సమాచారాన్ని రుణాలు అందించే యాప్‌ల నిర్వాహకులు దుర్వినియోగం చేస్తారు. ఈ నేపథ్యంలో రుణాలు స్వీకరించే సమయంలో ఏవిధమైన షరతులకు అంగీకరించవద్దని సూచించారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, ఆధార్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లో అందజేయవద్దని తెలిపారు. ఇంటర్ నెట్ లో లభించే అనేక రుణాలు అందించే యాప్‌లు మోసపూరితమైనవని, ఆర్బీఐ గుర్తింపులేని ఈ యాప్‌ల ద్వారా రుణ ఆధారిత దరఖాస్తులను డౌన్ లోడ్ చేయకూడదని తెలిపారు. ఈ యాప్‌ల ద్వారా అందించే రుణాల వడ్డీ రేట్లు రోజుకు ఒక శాతం వరకు ఉంటాయి. ఇది సాధారణంగా బ్యాంకులు లేదా ఎన్‌బిఎఫ్‌సీ రిజిస్టర్ అయిన సంస్థలు అందించే రుణ వడ్డీలకన్నా అత్యధికం. రుణ బాధితులు సకాలంలో చెల్లించని పరిస్థితిలో ఈ వడ్డీ మొత్తం రెట్టింపు లేదా మూడొంతులు అయి రుణ వలయంలో చిక్కుకుంటారు. దీంతో రుణాలు చెల్లించని రుణ గ్రహీతలను తిరిగి చెల్లించమని బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు ఆన్లైన్ వేధింపులకు ఈ యాప్‌లు పాల్పడతాయి. రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్‌ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. -
రుణ ప్రణాళిక ఖరారు
సాక్షి, మెదక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకర్ల వార్షిక రుణ ప్రణాళిక విడుదలైంది. గత ఆర్థిక సంవత్సరం రూ.1,876 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఈ సారి రూ.2,262 కోట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.386 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగానికి రూ.1,850 కోట్లు.. ఇతరత్రా రూ.412 కోట్ల రుణాలను అందజేయనున్నారు. వ్యవసాయానికి రూ.450 కోట్లు అదనం 2018–19 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి రూ.1,400 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో 65 శాతం లక్ష్యాన్ని చేరినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడించారు. అదేవిధంగా.. ఇతర రుణాల పంపిణీకి సంబంధించి రూ.476 కోట్లు కేటాయించారు. ఇందులో 50 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణాలకు సంబంధించి పంపిణీ లక్ష్యం రూ.1,850 కోట్లు.. ఇతర రుణాలు రూ.412 కోట్లుగా నిర్ధారించారు. వ్యవసాయ రంగానికి రూ.450 కోట్లు పెంచగా.. ఇతర రుణాలకు 64 కోట్లు కోత విధించారు. రుణ పంపిణీ లక్ష్యాన్ని చేరుకోవాలి : కలెక్టర్ జిల్లాలోని ప్రతి బ్యాంకు తప్పనిసరిగా తమకు నిర్దేశించిన మేరకు రుణాల పంపిణీ లక్ష్యాన్ని చేరుకుని జిల్లాను ప్రగతిపథంలో నడిపించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం ఆయన బ్యాంకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ ప్రణాళికను విడుదల చేశారు. మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీకి సంబంధించిన వాల్‌పోస్టర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల 2019–20 వార్షిక ప్రణాళికను సైతం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బ్యాంకుల వారీగా వ్యవసాయ పంట రుణాల లక్ష్యాలు, సాధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని బ్యాంకులు మినహా ఆశించిన స్థాయిలో రుణాలు మంజూరు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో అయినా లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. అంతా బ్యాంకర్ల చేతిలోనే.. వ్యవసాయ, ఇతర రుణాల పంపిణీకి సంబంధించి ప్రతి ఏటా రుణ ప్రణాళిక ఖరారు చేస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా వందశాతం లక్ష్యాన్ని చేరుకున్న దాఖలాలు లేవు. ఇందుకు బ్యాంకర్లే కారణమనే ఆరోపణలు ఉన్నాయి. పలు కొర్రీలతో రైతులు, ఇతర వర్గాలకు రుణాలు అందజేయడం లేదనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభుత్వ యంత్రాంగం పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి హెచ్చరించినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి స్థాయిలో రుణ లక్ష్యాన్ని చేరుకుంటారా.. లేదా.. అనేది వేచి చూడాల్సిందే. ప్రతి అధికారి కృషి చేయాలి.. ప్రతి బ్యాంకుకు తమ శాఖ పరిధిలో కొంత రుణ లక్ష్యాన్ని నిర్ధేశించామని.. దీన్ని చేరుకునేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి బ్యాంకు తప్పనిసరిగా వ్యవసాయ రుణాలను రైతులకు అందజేయాలన్నారు. వ్యవసాయ రుణాల పంపిణీలో కొన్ని బ్యాంకులు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని.. ఇది తగదన్నారు. ప్రతి సమావేశంలో బ్యాంకులు పంపిణీ చేయాల్సిన రుణ లక్ష్యాన్ని వివరిస్తున్నామని.. కొందరు బ్యాంకర్లు దానికనుగుణంగా వ్యవహరించడం లేదన్నారు. ఇదే కొనసాగితే సదరు బ్యాంకులపై చర్యలకు సిఫారసు చేయనున్నట్లు హెచ్చరించారు. ముద్ర రుణాల పంపిణీలో నిర్లక్ష్యంపై సీరియస్.. ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి వ్యాపారుల కోసం ముద్ర, స్టాండ్ అప్, పీఎంఈజీపీ పథకాల కింద రుణాలను అందజేస్తోందని కలెక్టర్ వివరించారు. వ్యాపారులు వీటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశమన్నారు. కానీ.. బ్యాంకులు ఈ రుణాల మంజూరులో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. ముద్ర రుణాల మంజూరు కోసం తమను ఎవరు సంప్రదించడం లేదని ఒక బ్యాంకు మేనేజర్ చెప్పగా.. కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా రూ.50 వేలు ఇచ్చే పథకానికి.. మీ దగ్గరకు ఎవరూ రావడం లేదా.. అని ప్రశ్నించారు. వచ్చే వారికి అనేక రకాలుగా షరతులు విధించడం లేదా.. అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమ పరిధిలో లేదు అనే సమాధానాల వల్ల చిరు వ్యాపారులు బ్యాంకుల వద్దకు రావడం మానేశారని కలెక్టర్ అన్నారు. బ్యానర్ ప్రదర్శించండి.. ముందుగా ప్రతి బ్యాంకు తప్పనిసరిగా మా బ్యాంకులో ముద్ర రుణాలు ఇవ్వబడును అనే బ్యానర్ ప్రదర్శించాలని ఆదేశించారు. అవసరమున్న వారు బ్యాంకులో సంప్రదించగా.. తిరస్కరించినట్లు తెలిస్తే సంబంధిత బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న స్టాండప్, పీఎంఈజీíపీ రుణాలను త్వరగా అందజేయాలని సూచించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం కింద జిల్లాలో పంటవేసే ప్రతిరైతు బీమా చేయించుకునేలా చూడాలని, బ్యాంకు అధికారులు ఈ ప్రక్రియపై దృష్టి సారించాలని çకలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని విషయాలు రైతులకు తెలియజేసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సీతారామారావు, లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ నాగరాజు, నాబార్డు ఏపీఎం సీసిల్ తిమోతి, లీడ్ జిల్లా అధికారి వెంకటేశ్, డీఏఓ పరశురాం నాయక్, ఈడీ ఎస్సీ కార్పొరేషన్ దేవయ్య, డీడబ్ల్యూ జ్యోతిపద్మ, డీటీడబ్ల్యూఓ వసంతరావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, పరిశ్రమల శాఖ జీఏం తిరుపతయ్య, బీసీడబ్ల్యూ సుధాకర్‌తోపాటు బ్యాంకు మేనేజర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రుణ ప్రణాళిక ఎప్పుడో?
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో ఖరీఫ్ సాగుకు రైతాంగం సిద్ధమైంది. ఇటీవల కొన్ని వర్షాలు పడడంతో కొందరు రైతులు విత్తనాలను విత్తుకోగా.. కొంతమంది భూములను చదును చేస్తూ విత్తనాలను వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు పొలాల బాట పట్టారు. అయితే ఖరీఫ్ రుణ ప్రణాళిక మాత్రం జిల్లాలో ఇప్పటి వరకు ఖరారు కాకపోవడం రైతులకు శాపంగా మారింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పంటల పెట్టుబడులు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాల కొనుగోళ్లకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ఖరీఫ్ రుణ ప్రణాళిక ఆలస్యం చేయడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చడం లేదు. ప్రతి ఏటా బ్యాంకర్లు సకాలంలో రుణాలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు. గతేడాది కూడా రుణ లక్ష్యంలో 67 శాతం మాత్రమే పూర్తి చేశారు. రుణాలు ఆలస్యంగా ఇవ్వడం వల్ల ఖరీఫ్, రబీకి బ్యాంకు రుణాలపై ఆధారపడుతున్న రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. 2.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు.. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ లక్ష్యం 2,35,213 హెక్టార్లు కాగా వీటిలో వరి, మొక్కజొన్న, జొన్న, కందులు, ఇతర అన్ని కలిపి 1,04,248 హెక్టార్లు సాగు చేయనున్నట్లు అంచనా వేశారు. 1,30,965 హెక్టార్లలో పత్తి పంట సాగుకానుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే విత్తనాలు వేశారు. వర్షాలు కురిస్తే మరింత జోరందుకోనుంది. ప్రస్తుత ఖరీఫ్ పంటలకు, దాని అనుబంధ రంగాలకు రుణాలు అందించేందుకు గతనెల 30వ తేదీన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎస్ఎల్బీసీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక, వ్యవసాయ శాఖల ముఖ్య కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 2019–20 ఆర్థిక సంవత్సరానికి అన్ని జిల్లాల వార్షిక ప్రణాళికను ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల రుణాలను కలిపి రూ.1.46లక్షల కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జిల్లాకు సైతం గతేడాది లక్ష్యం కంటే 6 నుంచి 10 శాతం పెంచి ఆ నిధులను కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు, బ్యాంకుల వారీగా కేటాయించాల్సి ఉంటుంది. ఆ పనిలోనే అధికారులు నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఈ నెల 26న విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గతేడాది రూ.1874.13కోట్లు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించుకోగా వాటిలో రూ.1,255.66కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు. అంటే 67శాతం మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాదైనా లక్ష్యం పూర్తవుతుందా వేచి చూడాలి. రుణం కోసం ఎదురుచూపులు ఖరీఫ్ సాగు జిల్లాలో ఇప్పుడిప్పుడే జోరందుకుంది. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా రూ.5 వేలు ఇవ్వడం పెట్టుబడికి రైతులకు కొంత ఉపశమనం ఉన్నప్పటికీ అవి సరిపోవడం లేదు. ఈ ఏడాది రైతుబంధు డబ్బులు ఇంకా ఖాతాల్లో జమ కాలేదు. దానికి తోడు పత్తి, మొక్కజొన్న, తదితర విత్తనాలతో పాటు ఎరువులు, పురుగు మందు, కూలీల ధరలు విపరీతంగా పెరగడం వల్ల రైతులకు సాగు మరింత భారంగా మారింది. బ్యాంక్ అధికారులు స్పందించి వెంటనే రుణ ప్రణాళికను ఖరారు చేయాలని కోరుతున్నారు. గతేడాది లాగే ఈ ఏడాది కూడా జిల్లాలో పత్తిసాగు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. వర్షాలు కరిస్తే మరింత సాగు పెరిగే అవకాశం ఉంది. పంట రుణాలకు రాయితీలు రైతన్నలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నూతన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఏడాదికి ఎకరాకు రూ.10వేలు ఇస్తున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి ఎకరాకు రూ.5వేల చెప్పున రైతుబంధు చెక్కుల పంపిణీని ప్రారంభించారు. అదే విధంగా రుణాల విషయంలోనూ రైతాంగానికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు అందించే పంట రుణాలకు వడ్డీ రాయితీలను వర్తింపజేస్తున్నాయి. స్వల్పకాలిక రుణాలు తీసుకొని, సకాలంలో తిరిగి చెల్లించే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు పంట రుణాలకు 9శాతం వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఇందులో రెండు శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకర్లకు చెప్పింది. అందుకు అన్ని బ్యాంకుల యాజమాన్యాలు సమ్మతించాయి. దీంతో 7 శాతానికికే రుణాలు అందిస్తున్నారు. రూ.1లక్ష లోపు రుణం తీసుకొని ఏడాది లోపు పూర్తి బకాయి చెల్లిస్తే వడ్డీ ఉండదు. 7 శాతం వడ్డీలో కేంద్రం 3శాతం భరిస్తుండగా, మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. అదే విధంగా రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు రుణం తీసుకొని దానిని సకాలంలో చెల్లిస్తే వడ్డీలో 4 శాతం రాయితీ రైతులకు అందుతుంది. అందులో 3శాతం కేంద్రం, ఒక్కశాతం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు చెల్లిస్తుంది. చాలా మంది రైతులకు రుణ వడ్డీ రాయితీపై అవగాహన లేని పరిస్థితి ఉంది. ఈ ఏడాదైనా వ్యవసాయ అధికారులు గానీ బ్యాంకు అధికారులు గానీ రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
సాగుకు చేయూత..
సాక్షి, వరంగల్ రూరల్ : రైతులు పంటలు సాగు చేసేందుకు బ్యాంకులు చేయూతనిస్తున్నాయి. వ్యవసాయం కోసం పంట రుణాల పరిమితిని పెంచుతూ నాబార్డు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్న తరుణంలో రైతులకు ఇది శుభవార్తే. వేసవిలో దుక్కులు సిద్ధం చేసుకొని, తొలకరి చినుకులు పడగానే వెంటనే ఎరువులు విత్తనాలు కొనుగోలు చేస్తారు. వీటిని కొనుగోలు చేయడగానికి రుణాలు ఎంతో అవసరం. ప్రతి ఏడు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక అధిక వడ్డీలకు అప్పు తెచ్చుకుంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో పంట రుణ పరిమితిని పెంచిన నేపథ్యంలో సకాలంలో బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తే వ్యవసాయం సజావుగా సాగుతుంది. జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో వ్యవసాయంతోనే జీవనం సాగిస్తున్నారు. గత ఏడు ఖరీఫ్‌లో జిల్లాలో 1,42,704 హెక్టార్ల సాగు కాగా ఈ ఏడు ఖరీఫ్‌లో 146910 హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు బంధు, ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ తదితర పథకాలు అమలు చేసిన ఏటా ఎరువులు, విత్తనాలు, కూలీల ధరలు పెరుగుతుండడంతో పెట్టుబడి ఖర్చులు పెరిగి, సరైన సమయంలో ఖరీఫ్ యాసంగి రుణాలు మంజూరు చేయకపోవడంతో పెట్టుకోసం వడ్డీ వ్యాపారులు, మార్కెట్లోని దళారులను ఆశ్రయించి పంట దిగుబడి వచ్చిన తరువాత ధాన్యాన్ని వారికే విక్రయించి అప్పులు తీరుస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు సిండికేట్‌గా మారగా తక్కువ ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా రైతులు అప్పులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో పంట రుణాల పరిమితి పెంచడంతో రైతులకు కొంత ఊరట లభించినట్లయింది. ఆదేశాలు జారీ చేశాం పంట రుణ పరిమితిని ఈ ఏడు ఖరీఫ్‌కు పెంచుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీçసుకున్నాం. ఈ ఆదేశాలను ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశాం. బ్యాంకు అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా రైతులకు రుణాలు సకాలం అందించి రైతు అభివృద్ధికి కృషి చేయాలి. –హరిప్రసాద్, లీడ్ బ్యాంకు మేనేజర్ -
గిరిజనులకు రుణాలు
ఏటూరునాగారం(వరంగల్): చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందే గిరిజనులకు సబ్సిడీ రుణాలు అందకుండా తాత్సారం చేస్తూ బ్యాంకు అధికారులు ట్రైకార్ లక్ష్యాన్ని నీరు గారుస్తూ వస్తున్నారు. దీనిని గుర్తించిన గిరిజన సంక్షేమశాఖ ట్రైకార్ నుంచి నేరుగా రూ.50 వేల రుణాన్ని వంద శాతం సబ్సిడీ ద్వారా ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్క రూపాయి కూడా గిరిజనులు వాటా ధనం, రుణం కిస్తీలు చెల్లించడం ఉండదు. ఈ మేరకు సెప్టెంబర్ 16న ఐటీడీఏకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. 2018–19 ట్రైకార్ వార్షిక యాక్షన్ ప్లాన్‌ను ఐటీడీఏ అధికారులు సిద్ధం చేసి కమిషనర్‌కు అందించనున్నారు. గతంలో యాక్షన్ ప్లాన్ రూ.1 లక్ష, రూ.50 వేల సబ్సిడీతో కూడిన రుణాల వివరాలు, పలు రకాల యూనిట్లతో తయారు చేసిన నివేదికను అందజేశారు. నూతనంగా రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా వారి ఖాతాల్లో జమ వేసేందుకు ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మళ్లీ యాక్షన్ ప్లాన్‌లో మార్పులు చేర్పులు చేసి పంపించారు. నిరుపేదల్లో వెలుగులు రూ.50 వేలు.. వంద శాతం సబ్సిడీ రుణం నిరుపేదల్లో వెలుగు నింపనుంది. గిరిజనుడి బ్యాంకు ఖాతాలో రూ.50 వేలు జమ అయిన వెంటనే వాటిని డ్రా చేసుకుని దుకాణాలను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే అవకాశం ఉంది. గతంలో బ్యాంకు వాటా ధనం 20 శాతం, లబ్ధిదారుడి వాటా ధనం 10 శాతం జమ చేసుకుని బ్యాంకు చుట్టూ తిరిగే వారు. కాళ్ల చెప్పులు అరిగిపోయినా కూడా రుణం వచ్చేది కాదు. లక్ష నుంచి ఐదు లక్షల వరకు యూనిట్ల వారీగా సబ్సిడీలను అందజేసింది. రూ.50 వేల వరకు వందశాతం సబ్సిడీని అమలు చేస్తూ మిగతా వాటి రుణాలను యథావిధిగా అమలు చేయనున్నారు. నేరుగా లబ్ధిదారుడు ఎంపీడీఓ కార్యాలయంలో రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి నేరుగా ఐటీడీఏ లాగిన్లోకి వచ్చి కలెక్టర్ అప్రూవల్తో కమిషనర్ నుంచి ట్రైకార్ ద్వారా నగదు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వంద శాతం సబ్సిడీతో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకునే గిరిజనులకు ఎంతగానో ఆసరాగా నిల్వనుంది. మొత్తం 1325 యూనిట్లకు రూ. 22,64,00,759 మంజూరయ్యాయి. లబ్ధిదారులు ఇందులో ఉన్న సెక్టార్ల వారీగా రూ.50 వేలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుడి ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని, గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం వారికి రుణాలు మంజూరవుతాయి. అసెంబ్లీ రద్దుతో ఆలస్యం అసెంబ్లీ రద్దు కావడం వల్ల ఎస్టీ కార్పొరేషన్ రుణాలను పొందే లబ్ధిదారులు అక్టోబర్‌లో లేదా ఎన్నికల పర్వం పూర్తి అయిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 2018లో దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఖాతాల్లో మాత్రమే రుణాలు జమ అయ్యాయి. వాటిని పూర్తిగా లబ్ధిదారులకు అందజేసిన తర్వాతనే 2018–19 రుణాల దరఖాస్తులు స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన రుణాలకు యుటిలైజ్ సర్టిఫికెట్ (యూసీ)లు కూడా ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ అధికారులను ఆదేశించింది. వీటి ఆధారంగా ఎంత మంది రుణాలు సద్వినియోగం చేసుకున్నారని కమిషనర్ నిర్ధారించనున్నారు. 100 శాతం సబ్సిడీతో లాభం 100 శాతం సబ్సిడీపై రూ.50 వేల రుణాలు ఇవ్వడం వల్ల గిరిజన కుటుంబాలు బాగుపడుతాయి. ఇంటి ఆవరణలోనే షాపులను ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఆస్కారం ఉంటుంది. రుణాలను ఈ విధంగా ఇస్తే గిరిజనుల జీవితాలు బాగుపడుతాయి. బ్యాంకులతో లింక్ పెడితే ఒక్క రూపాయి కూడా లబ్ధిదారుడికి చేరకుండానే దళారులు మింగుతున్నారు. వంద శాతం సబ్సిడీ గిరిజనులకు ఉపయోగపడనుంది. ఆలం ప్రభాకర్, రాజన్నపేట, కన్నాయిగూడెం మండలం సద్వినియోగం చేసుకోవాలి.. కొత్తగా ప్రవేశపెట్టిన 100 శాతం రూ.50 వేల రుణం గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. దాంతో కుటుంబాలు బాగుపడుతాయి. బ్యాంకు వాటాతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి సబ్సిడీతో ఈ రుణం ఇవ్వనున్నాం. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాలు అందిస్తాం. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. చక్రధర్‌రావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఏటూరునాగారం -
భారీ మోసం : లోన్లు ఇస్తామని చెప్పి..
సాక్షి, ఖమ్మం : కోఆపరేటివ్ సొసైటీ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి దాదాపు 5000మంది ఖాతాదారులను నిండా ముంచిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. హాపీ ప్యూచర్ మల్టీ పర్పస్ కో ఆపరేటివ్ సొసైటీ సంస్థ ప్రజల వద్ద నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ. 80,000 చొప్పున సేకరించింది. మూడున్నర లక్షల వరకు లోన్లు ఇస్తామని ఖాతాదారులకు నమ్మబలికింది. తీరా లోన్లు ఇవ్వాల్సిన టైం వచ్చేసరికి చేతులెత్తేశారు. దీంతో బాధితులు ఖమ్మం టూ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హ్యాపీ ఫ్యూచర్ కో ఆపరేటివ్ సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్ తో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 45 బ్రాంచీలు తెరిచిన సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5 కోట్ల మేర వసూలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 600 మంది ఉద్యోగులు, సుమారు 5000 మంది ఖాతాదారులు మోసపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఎస్సీ పొదుపు గ్రూపులకు నేరుగా రుణాలు
– బ్యాంకుల ప్రమేయం లేకుండా ఒక్కో గ్రూపునకు రూ.5 లక్షలు – పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణం – భూమి కొనుగోలుకు అధిక ప్రాధాన్యత – ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ కర్నూలు (అర్బన్): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ఎస్సీ వర్గాలకు చెందిన మహిళా పొదుపు గ్రూపులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో గ్రూపుకు రూ.5 లక్షల వరకు నేరుగా రుణాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక వీజేఆర్ కన్వెన్షన్ హాల్లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ' స్త్రీ శక్తి స్ఫూర్తి సమ్మేళనం ' కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేషన్ ఈడీ ఎస్ సత్యం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విజయకుమార్ మాట్లాడుతూ మహిళా గ్రూపులకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా కార్పొరేషన్ ద్వారానే రుణాలు అందిచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఎస్సీ వర్గాలకు చెందిన యువతను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూడా కార్పొరేషన్ అన్ని విధాల ఆర్థిక సహకారాన్ని అందిస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు రూ.1 కోటి వరకు రుణాలు అందిస్తామన్నారు. ఇందులో రూ.35 లక్షల వరకు సబ్సిడీ ఉంటుందన్నారు. జిల్లాలో రూ.400 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అర్హులైన ఎస్సీ వర్గాలకు భూములు కొని ఇప్పించేందుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామన్నారు. ప్రతి ఎస్సీ లబ్ధిదారునికి మూడు ఎకరాలు మెట్ట లేక ఒక తడి పండే భూమి అయితే రెండు ఎకరాలు, రెండు తడులు పండే భూమి అయితే ఒక ఎకరా ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమానికి ముందు హాజరైన పొదుపు సంఘాలకు చెందిన మహిళల ఆర్థికాభివృద్ధికి సంబంధించి పలు అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. అనంతరం జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓ, తహసీల్దార్లు, బ్యాంకు మేనేజర్లకు ఓబీఎంఎంఎస్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారి కార్యాలయం ఈఓలు పులిచేరి సారయ్య, రవి, స్థానిక కార్యాలయం ఈఓ సుశేశ్వరరావు, ఏఈఓ సుంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.