ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌‌ కేసు: మరో ముగ్గురి అరెస్ట్‌ | Three Arrested In Online Loan App Case | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌‌ కేసు: మరో ముగ్గురి అరెస్ట్‌

Published Sun, Dec 27 2020 5:31 PM | Last Updated on Sun, Dec 27 2020 6:17 PM

Three Arrested In Online Loan App Case - Sakshi

సాక్షి, హైదరాబాద్: మొబైల్ నుంచి కేవలం ఐదు నిమిషాల్లో లక్షల లోన్ పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. లోన్ తీసుకున్నాక 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అడగకపోయినా అకౌంట్లో డబ్బులు జమ చేసి.. ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పుణెలో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పుణేలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పరశురామ్‌తోపాటు భార్య లియాంగ్ టియాన్, పరుశురామ్‌ అనుచరుడు షేక్ ఆకిబ్​లను అదుపులోకి తీసుకున్నారు. వారు 50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. 
(చదవండి: పుట్టింటికిపంపించలేదని.. క్షణికావేశంలో)

పుణే కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 101 ల్యాప్‌టాప్‌లు, 106 సెల్‌ఫోన్లు, సీసీ టీవీలు, డీవీఆర్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోన్ యాప్‌ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. దాదాపు 14 ఇతర నకిలీ లోన్ యాప్​లను గుర్తించినట్లు సీపీ వెల్లడించారు. బబల్​ లోన్​, రూపీ బజార్​, ఓకే క్యాష్​, రూపీ ఫాక్టరీ, పైసా లోన్​, వన్​ హోప్​, క్యాష్​ బీ, ఇన్​ నీడ్​, స్నాప్​ లోన్​, పిక్కి బ్యాంక్​, క్రేజీ రూపీ, రియల్​ రూపీ, రూపీ బియర్​, రూపీ మోస్ట్​లను గుర్తించినట్లు పేర్కొన్నారు. లోన్ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 24 మంది అరెస్టయ్యారు. నిందితులు లోన్స్ తీసుకున్న వారికి కాల్‌ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.(చదవండి: రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement