వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting With Collectors Updates | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు: సీఎం జగన్‌

Published Thu, Dec 28 2023 8:03 AM | Last Updated on Thu, Dec 28 2023 6:13 PM

CM YS Jagan Review Meeting With Collectors Updates - Sakshi

గుంటూరు, సాక్షి: జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశమయ్యారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సీఎం సమీక్ష జరిపారు. అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

జనవరిలో 3, ఫిబ్రవరిలో 1, మొత్తంగా నాలుగు ప్రధానమైన కార్యక్రమాలు చేస్తున్నామని, ఎక్కడాకూడా పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి కార్యక్రమానికి ప్రీలాంచ్‌, లాంచ్‌, పోస్ట్‌ లాంచ్‌ కార్యక్రమాలు ఉంటాయి. అవి సక్రమంగా నడిచేలా కలెక్టర్లు షెడ్యూల్‌ చేసుకోవాలి. జనవరి నుంచి వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక రూ.3 వేలకు పెంచుతాం. రూ.3 వేలకు పెన్షన్‌ పెంచుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని పూర్తిగా నెరవేరుస్తున్నాం. విశ్వసనీయతకు ఈ ప్రభుత్వం మారు పేరు అని రుజువు చేస్తున్నామని సీఎం చెప్పారు.

సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే..
జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకూ పెన్షన్ల పెంపు కార్యక్రమం జరుగుతుంది
2019లో మన ప్రభుత్వం రాకముందు ఎన్నికలకు 2 నెలల ముందు వరకూ పెన్షన్‌ కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చేవారు
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.2,250 లు చేశాం
ఆ తర్వాత ఇప్పుడు రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం
గత ప్రభుత్వంలో నెలకు రూ.400 కోట్ల మాత్రమే సగటున పెన్షన్లకోసం ఖర్చు చేసేవారు
ఇవాళ మన ప్రభుత్వ హయాంలో నెలకు సుమారు రూ.1950 కోట్ల ఖర్చు చేస్తున్నాం
మన రాకముందు ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు పెన్షన్ల సంఖ్య 39 లక్షలు అయితే ఇవాళ పెన్షన్ల సంఖ్య దాదాపు 66 లక్షలు
ప్రతి అడుగులోనూ కూడా ఏ లబ్ధిదారు మిగిలిపోకూడదు, ప్రతి ఒక్కరికీ కూడా మంచి జరగాలి, ఎవ్వరూ కూడా ఇబ్బందులు పడకూడదని.. ఎప్పుడూ లేని విధంగా వాలంటీర్‌ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకు వచ్చాం 
ఒకటో తారీఖు అది ఆదివారమైనా, పండుగైనా సరే .. పొద్దునే వాలంటీర్‌ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్‌ను ఇంటివద్దే ఇచ్చే పరిస్థితిని, మార్పును తీసుకురాగలిగాం
ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఈ మార్పును తీసుకురాగలిగాం:
ఈ మార్పును ఎలా తీసుకు రాగలిగాం? ఇంత మంచి ఎలా చేయగలిగాం? అన్నది  ప్రతి గడపకూ తెలియజేయాల్సిన అవసరం ఉంది

రెండో కార్యక్రమం జనవరి 19న అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం
మూడో కార్యక్రమం వైఎస్సార్‌ ఆసరాలో భాగంగా జనవరి 23 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది
నాలుగోది వైయస్సార్‌ చేయూత కార్యక్రమం.. ఇది ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ కొనసాగుతుంది
ఈ నాలుగు కార్యక్రమాలను ప్రభుత్వం చాలా ప్రతిష్ట్మాత్మకంగా నిర్వహిస్తుంది

అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోయిన సందర్భాల్లో .. మరలా రీవెరిఫికేషన్‌ చేసి, వారికి పథకాలు వర్తింపు చేసే బై యాన్యువల్‌ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది:
ఈ కార్యక్రమం జరిగే లోపే వెరిఫికేషన్‌ పూర్తి చేసిన దాదాపు 1.17 లక్షల పెన్షన్లు ఒకటో తారీఖు నుంచే ఇస్తారు
66,34,742మందికి  సుమారు రూ.1968 కోట్లకుపైగా పెన్షన్ల రూపంలో అందుతాయి

మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది
క్రెడిబులిటీకి అర్ధం చెబుతూ ఈ ప్రభుత్వం పనిచేస్తోంది 
ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి
పెన్షన్ల పెంపు కార్యక్రమం జనవరి 1వ తేదీనే ప్రారంభమవుతుంది
ఇందులో భాగంగా నేను కూడా 3వ తారీఖున కాకినాడలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను
అవ్వాతాతలు వేచిచూసే పరిస్థితి లేకుండా 1వ తారీఖునే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది
ప్రజా ప్రతినిధులు అందరూ కూడా పెన్షన్‌ కానుక కార్యక్రమంలో భాగస్వాములు కావాలి 
ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి
8 రోజులపాటు పెంచిన పెన్షన్లతో పెన్షన్‌ కానుక కార్యక్రమం జరుగుతుంది
ఏయే మండలాల్లో ఏయే రోజుల్లో జరుగుతుందన్న దానిపై షెడ్యూలు చేసుకోవాలి
పెన్షన్‌తోపాటు నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి
అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి

ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, ఉత్సాహవంతులు, లైక్‌ మైండ్స్‌.. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలి
ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలి
రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా అవ్వాతాతలను ఈ విధంగా పట్టించుకున్న ప్రభుత్వం లేదు
వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ అందిస్తున్నాం 
వాళ్ల కోసం పట్టించుకునే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలాంటి ఏర్పాటు గతంలో ఎప్పుడూ లేదు
దేశంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్‌ డబ్బు ఎక్కడా ఇవ్వలేదు
మనం చెప్పిన మాటను నెరవేర్చాలా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో అడుగులు వేసింది
ఇచ్చిన హామీని మనసా వాచా అమలు చేయడానికి ఎంతగా కష్టపడ్డామో, ఎంత గొప్పగా చేయగలుగుతున్నామో అందరికీ తెలిసిందే
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలను ప్రతి లబ్ధిదారులకు తెలియాలి
ఈ పెన్షన్‌  కార్యక్రమం కోసం ఏడాదికి దాదాపు రూ.23 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అంకిత భావంతో అవ్వాతాతలకు అండగా నిలబడేందుకు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నాం 

వైఎస్సార్‌ ఆసరా...
2019లో మన ప్రభుత్వం రాకముందు పొదుపు సంఘాలన్నీ పూర్తిగా కుదేలైపోయాయి
ఏ గ్రేడ్, బి గ్రేడ్‌ సంఘాలు పూర్తిగా కనుమరుగైపోయి సీ గ్రేడ్, డీ గ్రేడ్‌గా సంఘాల్లో చేరిన పరిస్థితి 
18శాతం పైచిలుకు అక్కౌంట్‌లు అన్నీ కూడా అవుట్‌ స్టాండింగ్, ఎన్‌పీఏల స్థాయిలోకి వెళ్లిపోయాయి
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది

మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి చేయూత నిచ్చి ఆసరా, సున్నావడ్డీ, చేయూత, అమ్మ ఒడి పథకాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం:
మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారితను సాధించగలిగాం
క్రమం తప్పకుండా ప్రతి ఏటా లబ్ధిదారులకు అందించగలిగాం
అందుకనే ఈరోజు పొదుపు సంఘాల్లో ఎన్‌పీఏలు కేవలం 0.3 శాతానికి చేరాయి:
అక్క చెల్లెమ్మలకు ఇంతగా తోడు ఉండి నడిపించిన ప్రభుత్వం మనది
ఒక్క ఆసరా కోసమే రూ.25,570 కోట్లు ఖర్చు చేశాం
మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,195 కోట్లు ఇచ్చాం
నాలుగో విడతగా.... చివరి ఇన్‌స్టాల్‌మెంట్‌ కింద సుమారు రూ.6,400 కోట్లు ఇస్తున్నాం
జనవరి 23న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం 
ఇది కూడా జనవరి 23 నుంచి 31వ తారీఖు వరకూ కొనసాగుతుంది
ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందారు

మహిళల్లో సుస్థర జీవనోపాధి కల్పించాలన్నదే ఆసరా, చేయూత పథకాల ఉద్దేశం
ఇందులో భాగంగానే అనేక మల్టీ నేషనల్, ప్రముఖ కంపెనీలతో టై అప్‌ చేయించాం
బ్యాంకులతో టై అప్‌ చేయించాం
స్వయం ఉపాధి పథకాల ద్వారా వారి జీవితాల్లో వెలుగులు చూడగలుగుతాం:
ప్రీలాంచ్, లాంచ్, పోస్ట్‌ లాంచ్‌ కార్యక్రమాల్లో మహిళలు, మహిళా సంఘాల్లో అవగాహన కల్పించాలి
ఆసరా, చేయూత కార్యక్రమాల లబ్ధిదారులకు ఇది చాలా అవసరం :
మహిళా సంఘాలు తీర్మానాలు చేసుకుంటే ఆసరా కింద ఇచ్చే డబ్బు గ్రూపు ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఖాతాల్లోకి వెళ్తుంది:

వీడియోల రూపంలో విజయ గాథలు
పెన్షన్‌ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాధలను వీడియోల రూపంలో పంపాలి
ఇలా పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు ఇస్తాం
ఇవి మరికొందరిలో స్ఫూర్తిని పెంచుతాయి:
ఏ రకంగా ఈ పథకాలు, కార్యక్రమాలు వారి జీవితాలను మార్చాయో ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి
ఈ పథకాల ద్వారా మహిళల్లో వచ్చిన మార్పులను ఈ వీడియోల ద్వారా తీసుకోవాలి

ఉత్తమమైన వాటికి సచివాలయాల స్ధాయిలో రూ.10వేలు, మండల స్థాయిలో రూ.15వేలు, నియోజకవర్గ స్థాయిలో రూ.20వేలు, జిల్లా స్థాయిలో రూ.25వేలు బహుమతిగా ఇస్తాం
ఫిబ్రవరి 15–16 ప్రాంతంలో ఉత్తమ సేవలు అందించినందుకు వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ఇస్తాం
వాటితోపాటు లబ్ధిదారులపై రూపొందించివాటిలో ఉత్తమ వీడియోలు పంపినవారికి అవార్డులు
ఆసరా కార్యక్రమాలన్నీ ఉత్సవ వాతావరణంలో జరగాలి
ఇందులో మహిళా సంఘాల కార్యకలాపాలు తెలియజేసే స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలి

వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం...
ఫిబ్రవరి 5 నుంచి 14 వరకూ వైయస్సార్‌ చేయూత కార్యక్రమం జరుగుతుంది
గతంలో ఆంధ్రరాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు
ఇప్పటివరకూ రూ.14,129 కోట్లు ఇచ్చాం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో అట్టడుకు వర్గాల్లో వారికి తోడుగా నిలబడ్డమే కాకుండా, వారికి జీవనోపాధి చూపించే దిశగా ఈ కార్యక్రమం చేస్తున్నాం
45 ఏళ్ల పైబడ్డ ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750లు ఇచ్చాం
26 లక్షల మందికి పైగా అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తున్నాం
ఈ పథకంలో ఇప్పటివరకు యూనిక్‌ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారు
ఈ పథకం వారి జీవితాల్లో ఏరకంగా మార్పులు తీసుకు వచ్చిందో తెలియజెప్పాలి
చివరి విడతద్వారా 26,39,703 మంది లబ్ధి పొందారు
అదే విధంగా మహిళల జీవనోపాథి మార్గాలపై వారిలో మరింత అవగాహన కల్పించి, వారికున్న అవకాశాలనుకూడా వివరించాలి
ఈ కార్యక్రమంలో కూడా నా తరపున లేఖను కూడా లబ్ధిదారులకు అందించాలి
అలాగే నేను ఇచ్చే వీడియో సందేశం కూడా లబ్ధిదారులకు చేరవేయాలి

జనవరి 19 – అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభం.
జనవరి 19 విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ప్రారంభిస్తున్నాం
19 ఎకరాల్లో రూ.404 కోట్లతో 125 అడుగుల డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం
సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నాం
సచివాలయం స్థాయి నుంచి రాష్ట్రస్థాయివరకూ ప్రతి అడుగులోనూ సామాజిక న్యాయ నినాదం వినిపించాలి
ప్రతి సచివాలయం పరిధిలోకూడా సమావేశాలు పెట్టి, అవగాహన కలిగించాలి
ప్రతి సచివాలయం నుంచి 5 మందిని 19న జరిగే అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలి
ప్రతి మండల కేంద్రం నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతాం
సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణలో వాళ్లూ భాగస్వామ్యులయ్యేటట్టు చేయాలి

గ్రామ స్థాయిలో మనం గొప్ప వ్యవస్థను తీసుకు వచ్చాం
గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చాం
ఇదొక గొప్ప మార్పు 
దీనికి మద్ధతు తెలిపే కార్యక్రమాలు జరగాలి 
ఈ మార్పునకు ప్రతిరూపంగా అంబేద్కర్‌ విగ్రహం నిలుస్తుంది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement