పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం , పల్నాడు జిల్లా చింతలచెరువు వద్ద వృద్ధురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న సీఎం జగన్
పింఛనుదారులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
చంద్రబాబు చెప్పేవన్నీ హద్దుల్లేని అబద్ధాలే
మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు
నాకు తెలిసింది విలువలు, విశ్వసనీయతే
బాబు హయాంలో పెన్షన్లు 39 లక్షలు
మన ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్లు ఏకంగా 66.34 లక్షలు
నాడు పెన్షన్ల ఖర్చు రూ.400 కోట్లు
నేడు నెలకు రూ.2 వేల కోట్లు
58 నెలల్లో ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ రూపంలో పంపిణీ
బాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు
మేం చెప్పిన ప్రతి హామీని 99% నెరవేర్చాం
మంచి చేసే విషయంలో మనతో ఎవరూ పోటీ పడలేరు.. అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే పరిస్థితే ఉండదు
వాళ్లు ఎలాగూ చేసేది లేదు కాబట్టి చెప్పడానికేముంది? నోటికి అడ్డేముంది? అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే చాలు.. ఎలాగూ చేసేది లేదు కదా! అనే మనస్తత్వం వాళ్లది. మీ బిడ్డ అలా కాదు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు.
ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ప్రభుత్వం పెట్టే మొదటి సంతకం వలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించడమే.
– పింఛన్‌దారులతో సీఎం జగన్
సాక్షి, ప్రతినిధి, ఒంగోలు: ‘‘పేదలకు గానీ, అవ్వాతాతలకు గానీ, పిల్లలకు గానీ, ఏ వర్గానికైనా సరే.. మంచి చేసే విషయంలో జగన్‌తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడు అని గర్వంగా చెబుతున్నా. వెసులుబాటును బట్టి అవకాశం ఉంటే ఎక్కడా మీ బిడ్డ తగ్గడు. మరీ ముఖ్యంగా అవ్వాతాతల విషయంలో అసలు తగ్గే అవకాశం, పరిస్థితి ఉండనే ఉండదు అని స్పష్టంగా చెబుతున్నా.
మన ప్రమాణ స్వీకారం రోజు వలంటీర్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించే కార్యక్రమంపైనే మొట్ట మొదటి సంతకం చేస్తా’’ అని ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మీ బిడ్డకు అబద్ధాలు ఆడటం, మోసం చేయడం తెలియదు కాబట్టి బాబు, ఆయన కూటమితో ఈ రెండు విషయాల్లో మాత్రం పోటీ పడలేడని వ్యాఖ్యానించారు. సోమవారం ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి గ్రామంలో పెన్షనర్లతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన ఏమన్నారంటే..
అవ్వాతాతలపై ప్రేమతో...
ఈరోజు అవ్వాతాతలతోపాటు ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలపై ఆలోచన చేయమని కోరుతున్నా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ ఇచ్చిన పెన్షన్ రూ.1,000 మాత్రమే. అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించుకుంటేనే అందిన దుస్థితి. ఎన్నికలకు ఆర్నెల్ల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు. అప్పట్లో నెలకు వెచ్చించిన వ్యయం కేవలం రూ.400 కోట్లు. అలాంటి పరిస్థితుల్లో మొట్ట మొదటి సారిగా మీ బిడ్డ అవ్వాతాతల గురించి, వారి కష్టాలు, ఆత్మగౌరవం గురించి ఆలోచన చేశాడు.
అధికారంలోకి రాగానే దేశంలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం ఇస్తూ ప్రతి గ్రామంలో సచివాలయాలను నెలకొల్పి వలంటీర్ వ్యవస్థను తెచ్చాం. ప్రతి నెలా 1వ తారీఖునే అది సెలవు రోజైనా, ఆదివారమైనా సరే ఇంటివద్దే నేరుగా అవ్వాతాతల చేతుల్లో పెన్షన్లు పెట్టిన పరిస్థితి 56 నెలలు మన ప్రభుత్వం హయాంలోనే జరిగింది. గతంలో 39 లక్షలు మంది మాత్రమే íపింఛనుదారులుండగా ఈరోజు వివక్ష లేకుండా 66.34 లక్షల మందికి ఠంఛన్‌గా పెన్షన్ అందిస్తున్నాం.
అది కూడా గత సర్కారు హయాంలో మాదిరిగా రూ.వెయ్యి కాకుండా ఏకంగా రూ.3 వేల దాకా పెంచుకుంటూ వెళ్లి అవ్వాతాతలకు మంచి చేశాం. ఈ తేడాను ఒక్కసారి గమనించండి. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. ఆ అవ్వలు, తాతలు, అభాగ్యుల పట్ల మనసులో నిజమైన ప్రేమ ఉంటేనే ఇలాంటి మంచి ఆలోచనలు వస్తాయి.
ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో సామాజిక పింఛన్ లబ్ధిదారులతో సీఎం వైఎస్ జగన్ ముఖాముఖి సభకు హాజరైన అవ్వాతాతలు
బాబు ఆ ఆలోచనే చేయలేదు..
మీరంతా గత పాలకులను చూశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మూడుసార్లు పరిపాలన చేశానని చెబుతుంటారు. కానీ ఏ ఒక్క రోజైనా మీ బిడ్డ మాదిరిగా అవ్వాతాతల గురించి ఆయన ఆలోచన చేశాడా? అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూడాలనే తాపత్రయం, మనసులో ప్రేమ ఉంటేనే చేతల్లో బయటకు వస్తుంది. ఇవాళ రాజకీయాలు పాతాళానికి దిగజారాయి. విలువలు, విశ్వసనీయత లేవు.
ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ తొలిసారిగా అడుగులు వేగంగా వేశాడు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో ఏకంగా 99 శాతం అమలు చేసి చిత్తశుద్ధితో మీ ముందుకు వచ్చాడు. మీ బిడ్డకు అబద్ధాలు, మోసాలు తెలియవు. ఏదైనా చెప్పాడంటే కచ్చితంగా చేసి చూపిస్తాడు. మీ ముందు ఉంచుతున్న వాస్తవాలపై ఆలోచన చేయమని అందరినీ కోరుతున్నా.
దేశంలో రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం మనదే
జనాభా ప్రకారం చూస్తే ఐదు కోట్ల మందిలో 66.34 లక్షల మందికి పెన్షన్లు, అత్యధికంగా పింఛన్ మొత్తాన్ని అందిస్తున్న రాష్ట్రం మనదే. నెలకు రూ.3 వేల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో పింఛన్ల కోసం నెలకు రూ.400 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి నుంచి ఈరోజు నెలకు రూ.2 వేల కోట్లు కేవలం పెన్షన్ల కోసమే అందచేస్తున్నాం. సంవత్సరానికి రూ.24 వేల కోట్లు పెన్షన్ల రూపంలో ఇస్తున్నాం.
మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏప్రిల్ కూడా కలిపితే ఏకంగా రూ.90 వేల కోట్లు పెన్షన్ల రూపంలో అవ్వాతాతల ముఖంలో చిరునవ్వులు చూసేందుకు చేతిలో పెట్టినట్లయింది. ఏటా రూ.24 వేల కోట్లు పింఛన్ల కోసం ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాగా బిహార్‌లో రూ.4300 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో రూ.5,160 కోట్లు, కర్ణాటకలో రూ.4,700 కోట్లు, పక్కన తెలంగాణలో రూ.8,180 కోట్లు చొప్పున ఏటా పెన్షన్ల కోసం వ్యయం చేస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఎందుకు చెబుతున్నానంటే అవ్వాతాతలను మోసం చేసేందుకు రూ.4 వేలు.. రూ.5 వేలు.. రూ.6 వేలు అని చెబుతారు. ఇంకా అవసరం అయితే ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికీ రూ.8 వేలు అని కూడా అంటారు. మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా చేయగలిగిందే చెప్పాలి. చెయ్యలేనిది నా నోట్లో నుంచి రాదు. ఈ 58 నెలల పాలన చూస్తే చెప్పనివి కూడా చాలా చేసిన పరిస్థితి మీ అందరికీ కనిపిస్తుంది.
బాబును నమ్మితే పులి నోట్లో తల పెట్టినట్లే
2014లో చంద్రబాబు స్వయంగా సంతకం చేసి ప్రధాని మోదీ, దత్తపుత్రుడి ఫొటోలతో ఎన్నికల ప్రణాళికలో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశాడు. మీ అందరికీ అందుకే చెబుతున్నా. మోసం చేసే వాళ్లను, అబద్ధాలు చెప్పే వాళ్లను నమ్మొద్దండీ. మీ బిడ్డ పేదల సంక్షేమానికి సంవత్సరానికి దాదాపుగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాడు.
ఎక్కడా అవినీతి, వివక్ష లేకుండా మీ బిడ్డ సమూల మార్పులు తేవడంతో ఈరోజు ఇన్ని మంచి పనులు జరుగుతున్నాయి. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని నమ్మబలుకుతున్న చంద్రబాబు హామీలు రూ.1.40 లక్షల కోట్లు దాటుతున్నాయి. సునాయాసంగా నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి. మీలో ఎవరైనా నాకు సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే స్లిప్పులో రాసి బాక్సులో వేస్తే నావద్దకు వస్తాయి. తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు
చంద్రబాబు చేసిన పనికి...
నాకు కాలు విరగడంతో ఆపరేషన్లు జరిగాయి. అన్ని పథకాలు కలిపి రూ.3.40 లక్షలు అందాయి. నీ మేలు ఎప్పుడూ మరవలేం. చంద్రబాబు చేసిన పనికి చాలా కష్టం అయింది. నాకు ఆయాసం ఉంది. మూడుసార్లు కూర్చుని లేచి సచివాలయానికి వెళ్లా. తోడు కోసం ఓ పాపను తీసుకెళితే రాయి తగిలి కింద పడటంతో ఆమె ముక్కుకు గాయం అయింది. మమ్మల్ని ఇంత కష్టపడేలా చేసింది చంద్రబాబే. రైతుభరోసా సహా నాకు ఎన్నో పథకాలు అందాయి. మొన్ననే కంటి ఆపరేషన్ చేయించుకున్నా. నీవల్లే ధైర్యంగా బతుకుతున్నా.
– కర్నాటి సుబ్బులు, కుర్చేటి మండలం, అగ్రహారం
ఎంత ఇబ్బంది బాబూ..
ఇన్నాళ్లూ వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీ ఉదయాన్నే రూ.3 వేల పెన్షన్ మా చేతుల్లో పెడితే ఈనెలలో మాత్రం మూడు చోట్లకు తిప్పారు. సచివాలయానికి వెళితే అక్కడ కాదన్నారు. ఇంకో చోటకు వెళితే అక్కడా కాదన్నారు. మోకాళ్ల నొప్పితో ఎన్నిచోట్లకు తిరిగానో, ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడో ఈ బాబు! ఈ ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతుంటే అడ్డుపడుతున్నారు. మాకు వలంటీర్లు, వలంటీర్ల వ్యవస్థ కావాలి. కరోనాలో మాసు్కలతో సహా ఇంటివద్దకే పంపించారు. ఇంటింటికీ రేషన్ పంపిస్తున్నారు. గడప గడపకు పథకాలు అందుతున్నాయి. వలంటీర్ల వ్యవస్థను తొలగిస్తే ఒప్పుకోం.
– పట్రా ప్రభావతి, దర్శి
దివ్యాంగులు, వృద్ధులపై అక్కసు..
టీడీపీ హయాంలో దివ్యాంగులు ఎంత కష్టపడ్డారంటే జన్మభూమి కమిటీలకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది. మీరు (సీఎం జగన్) పాదయాత్ర చేసినప్పుడు కొన్ని హామీలిచ్చారు. అందులో ఇవ్వని హామీ ఒకటి ఏమిటంటే దేవుడి దూతలా వలంటీర్లను పంపించడం. వారు ఇంటింటికీ వచ్చి దివ్యాంగులకు పెన్షన్లే కాకుండా సదరం సర్టిఫికెట్ నుంచి ఆధార్ కార్డు దాకా ప్రతి ఒక్కటీ అందేలా చేశారు.
బాబు మిమ్మల్ని ఏమీ చేయలేక అక్కసుతో దివ్యాంగులు, వృద్ధుల మీద పడ్డారు. పిటిషన్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కచ్చితంగా చెబుతున్నా వాళ్లు మట్టి కొట్టుకుపోతారు. 70 ఏళ్ల వృద్ధురాలు పెన్షన్ కోసం వెళ్తూ మండుటెండలో సొమ్మసిల్లి పడిపోవటాన్ని నేను కళ్లారా చూశా. దీనికి ఎవరు కారణమనేది అందరూ ఆలోచన చేయాలి. – నర్సింహారావు, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు
నిన్నే నమ్ముకున్నానయ్యా..
నా పిల్లలకు అమ్మఒడి వచ్చింది. నాకు, నా కోడలికి వైఎస్సార్ ఆసరా వచ్చింది. నా కొడుక్కి రైతుభరోసా వచ్చింది. మాకు అన్నీ వచ్చాయి. నాకు వైఎస్సార్ ఇల్లు కట్టించాడు. నాకు నలుగురు కొడుకులున్నా నువ్వే నా కొడుకువి. నా కడుపులోనే ఉన్నావ్ నువ్వు. నాకు రూ.3 వేలు పెన్షన్ వస్తోంది బ్యాంకుల నుంచి రూ.23 వేలు వచ్చాయి. నేను నిన్నే నమ్ముకుని ఉన్నానయ్యా.
– గంగిరెడ్డి మంగమ్మ, బొట్టపాలెం
దోమలు కుడుతున్నా.. పింఛన్ కోసం
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి మాకు పెన్షన్ వస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెల్లవారుజామున 4 గంటలకే పెన్షన్ కోసం పంచాయతీ ఆఫీస్‌కు వెళ్లేవాడిని. నాకన్నా ముందే నలుగురు ఉండేవాళ్లు. అక్కడ 10 కుర్చీలే ఉండేవి. దోమలు కుడుతున్నా బయటకు వెళ్తే కుర్చీ పోతుందనే భయంతో వెళ్లేవాడ్ని కాదు. కండువా తీసుకుని ఆ దోమలను కొట్టుకుంటూ వుండేవాడ్ని. సిబ్బంది 8 గంటలకు వచ్చేవారు. అన్ని పూర్తి చేసేసరికి 9 గంటలు అయ్యేది.
అప్పటికే దాదాపు రెండు మూడొందల మంది వచ్చి పుస్తకాలు పెట్టేవారు. తర్వాత వచ్చేవాళ్లను తరువాత రావాలని పంపేవారు. అలా వారం రోజులు పెన్షన్లు ఇచ్చేవారు. ఈ బాధ ఎప్పుడు పోతుందా అని అనుకునేవాడ్ని. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన బంగారు మెదడు నుంచి వచ్చిన ఆలోచనలే. అటువంటి మేధావి ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టం. రావణాసురుడు, హిరణ్యకశిపుడు లాంటి వారికి మే 13న ప్రజాకోర్టు శిక్ష వేస్తుంది. జూన్ 4న శిక్ష అమలు జరుగుతుంది.
– వెంకటపతి, దర్శి
పల్లెటూళ్లకు పాలన తెచ్చారు..
నవరత్నాల పథకాల వల్ల మాలాంటి పేదలకు నాలుగు వేళ్లు నోట్లోకి పోతున్నాయి. నాడు పరిపాలన కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితమయ్యేది. నేడు పల్లెటూళ్లకు పరిపాలన తెచ్చిన ఘనత మన జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుంది. గతంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా మండల ఆఫీస్‌కు వెళ్లాల్సిందే. ఇప్పుడు అన్నీ గ్రామాల్లోనే లభిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి నీలాంటి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడ్ని చూసి భయపడుతున్నారు.
– శ్రీనివాస్‌రెడ్డి, బసిరెడ్డిపాలెం గ్రామం
నీ నీడన మేం ఉండాలి..
నా పెనిమిటి మరణించి 15 ఏళ్లు అయింది. నాకు ఇల్లూ వాకిలీ లేదు. ఒంటరి మహిళ పెన్షన్ వస్తోంది. ఇప్పటి వరకూ రూ.1.30 లక్షల మేర లబ్ధి పొందా. ఈనెల పెన్షన్ వలంటీర్ ఇవ్వలేదు. నా కుమారుడిని అడిగితే దర్శి వెళ్లి తెచ్చుకోవాలన్నాడు. నా ఆరోగ్యం బాగాలేదు. నడవలేను. ఎవరినో బతిమాలి వెళ్లి పెన్షన్ తెచ్చుకున్నా. జగనన్నా మళ్లీ నువ్వే రావాలి. 175కి 175 రావాలి. నీ నీడన మేం ఉండాలి. మంచి మనసున్న మారాజు నువ్వు. సొంత కొడుకులు, కోడళ్లు పదెకరాల ఆస్తి ఇచ్చినా మనల్ని చూడరు. కానీ అందరినీ చూసే మంచి మనసున్న మనిషి దైవబలంతో ఆ తల్లికి జన్మించాడు. అలాంటి జగనన్నను మనం గెలిపించుకోవాలి.
– వెంకాయమ్మ, శివాజీ నగరం వార్డు, దర్శి, వితంతు పెన్షన్ లబ్ధిదారు
ఐదు గద్దలు మాపై పడ్డాయి..
టీడీపీ హయాంలో వెయ్యి రూపాయలు అరకొర పెన్షన్లు ఇవ్వడంతోపాటు ఒక íపింఛనుదారుడు చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలు మంజూరు చేసేవి. వలంటీర్లను అడ్డుకునేందుకు రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి లాంటి ఐదు గద్దలు తోడయ్యాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాసి నాలాంటి గుడ్డోళ్లు, ముసలోళ్లను దెబ్బ తీశారు. పది మంది చూపు పడితే బండ రాళ్లైనా పగిలిపోతాయి. 69 లక్షల మంది చూపు పడి ఆ ఐదుగురూ నామరూపాలు లేకుండా పోతారు.
– శ్రీను, పెద ఉయ్యాలవాడ, దివ్యాంగ పెన్షన్ లబ్ధిదారుడు
Comments
Please login to add a commentAdd a comment