
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజైన గురువారం(ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. సీఎం జగన్ రాత్రి బస చేసిన తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు.
తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్ మిల్ సెంటర్, దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.