గాంధీనగర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తౌక్టే తుపానుగా రూపాంతరం చెందింది. కేరళ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌పై తుపాను ప్రభావం అదికంగా ఉండనుంది. ఈ నెల 18న తుపాను గుజరాత్ వద్ద తీరం దాటే అవకాశముందని వాతావరణ అధికారులు సూచించన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. గుజరాత్ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్ ఆస్పత్రులు, వ్యాక్సిన్ కోల్డ్‌స్టోరేజ్ సెంటర్లకు.. విద్యుత్ సరఫరాలో ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment