
గుంటూరు : కరోనా నియంత్రణపై హోంమంత్రి మేకతోటి సుచరిత కలెక్టర్, డాక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా పేరుతో ఎక్కువ డబ్బులు వసూలు చేసే ప్రైవేట్ హాస్పిటల్స్‌పై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కరోనా పేరుతో డబ్బులు ఎక్కువ వసూలు చేస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన రేట్లు మాత్రమే అమలు చేయాలి అని తెలిపారు.
పేషెంట్ ఆస్పత్రిలో చేరగానే వెంటనే మూడు లక్షలు కట్టండి.. నాలుగు లక్షలు కట్టండి అని ఒత్తిడి చేస్తే ఎలా అంటూ సుచరిత అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు మానవత్వంతో వ్యవహరించాలి అని కోరారు. ప్రైవేట్ ఆస్పత్రులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. డబ్బులు సంపాదించి ఏం చేసుకుంటాం.. పోయేటప్పుడు కూడా తీసుకు వెళ్ళం కదా అన్నారు సుచరిత.
నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరించండి: వెల్లంపల్లి
సాక్షి విజయవాడ: కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ ఆసుపత్రులపై మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రత్యేక అధికారి సునీత, కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవిలత, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆరోగ్యశ్రీ కింద ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్ల కోసం 50 శాతం బెడ్స్ కేటాయించాలి అన్నారు. నిబంధనలు పాటించని హాస్పిటల్స్‌పై కఠినంగా వ్యవహరించండి అని మంత్రి వెల్లంపల్లి అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment