![Telangana Govt To File Review Petition In High Court Over Ganesh Idol Immersion In Hussain Sagar - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/14/ganesh.jpg.webp?itok=ERKPyTiQ)
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. కాగా, గణేష్ నిమజ్జనంపై పోలీసుశాఖలో అయోమయం నెలకొంది. గణేష్ నిమజ్జనంపై నిన్న(సోమవారం) సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్‌బండ్‌లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్ బండ్‌లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది.
చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు..
చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా?
Comments
Please login to add a commentAdd a comment