ganesh immirson
-
హుస్సేన్‌సాగర్‌లో భారీగా పెరిగిన కాలుష్యం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‌లో కాలుష్యం అనూహ్యంగా పెరిగినట్లు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక వెల్లడించింది. నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత రోజుల్లో సాగర్ నీటి నమూనాలను సేకరించి.. పరీక్షించగా పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. నీటి రంగు, బురద రేణువులు, కరిగిన ఘన పదార్థాలు, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, భార లోహాల మోతాదు పరిమితికి మించి పెరిగినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. నిమజ్జనానికి ముందు ఆగస్టు 29 తోపాటు నిమజ్జనం జరిగిన తేదీలు సెప్టెంబరు 2,5, 7, 9 తేదీలలో.. నిమజ్జనం అనంతరం సెప్టెంబరు 12న పీసీబీ నిపుణులు.. ఎన్‌టీఆర్‌పార్క్, లుంబినీ పార్క్, నెక్లెస్ రోడ్, లేపాక్షి పాయింట్, సాగరం మధ్యనున్న బుద్ధవిగ్రహంవద్ద నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించారు. అన్ని పాయింట్ల వద్దా కాలుష్యమే.. నిమజ్జనంతో పీసీబీ సేకరించిన అన్ని పాయింట్ల వద్ద కాలుష్య మోతాదు భారీగా పెరిగినట్లు గుర్తించారు. ఎన్టీఆర్ పార్క్ నిమజ్జనానికి ముందు సరాసరిన లీటరు నీటిలో బురద రేణువుల మోతాదు 45 మిల్లీగ్రాములుండగా.. అనంతరం ఏకంగా 152 మిల్లీ గ్రాములకు చేరింది. నీటి గాఢత కూడా 7.24 పాయింట్లుగా నమోదైంది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 712 మిల్లీగ్రాముల నుంచి 848 మిల్లీగ్రాములకు పెరిగింది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 37 మిల్లీగ్రాములుండగా.. నిమజ్జనం తర్వాత ఏకంగా 164 మిల్లీగ్రాములకు చేరింది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 10 మిల్లీగ్రాముల నుంచి 30 మి.గ్రా మేర పెరిగింది. భార లోహాలు క్రోమియం, లెడ్, జింక్, కాపర్, క్యాడ్మియం తదితరాల మోతాదు కూడా పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. లుంబినీ పార్క్ వద్ద: నీరు ఆకుపచ్చ రంగులోకి మారింది. బురద రేణువుల మోతాదు అత్యధికంగా 1340 మి.గ్రా నమోదైంది. గాఢత 8.12 పాయింట్లకు చేరింది. కరిగిన ఘన పదార్థాల మోతాదు 831 మి.గ్రా నమోదైంది. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 284 మిల్లీగ్రాములుగా.. నీటి కాఠిన్యత మి.గ్రాములకు చేరింది. నెక్లెస్‌రోడ్ వద్ద: బురద రేణువులు 112 మి.గ్రాములకు చేరువయ్యాయి. గాఢత 8.24 పాయింట్లుగా ఉంది. కరిగిన ఘన పదార్థాలు 829 మిల్లీగ్రాములుగా ఉన్నాయి. ఈ–కోలి బ్యాక్టీరియా ఆనవాళ్లు బయటపడ్డాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 160 మిల్లీగ్రాములుగా ఉంది. నీటి కాఠిన్యత 404 మి.గ్రాములకు చేరింది. లేపాక్షి: బురద రేణువులు 100 మి.గ్రాములకు చేరాయి. నీటి గాఢత 8.50 పాయింట్లకు చేరింది.కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 126 మిల్లీగ్రాములుగా ఉంది. కాఠిన్యత 326 మి.గ్రా ఉంది. బుద్ధ విగ్రహం వద్ద: బురద రేణువులు 96 మి.గ్రా నమోదయ్యాయి. కరిగిన ఘన పదార్థాలు 832 మి.గ్రా ఉన్నాయి. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 101 మి.గ్రా.. కాఠిన్యత 426 మి.గ్రా ఉంది. బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ 24 మిల్లీగ్రాములుగా ఉంది. అనర్థాలివే.. ► సాగర్‌లో సహజ ఆవరణ వ్యవస్థ దెబ్బతింటుంది. చేపలు, పక్షులు, వృక్ష, జంతు అనుఘటకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ► పర్యావరణం దెబ్బతింటుంది. సమీప ప్రాంతాల్లో గాలి, నీరు కలుషితమవుతుంది. దుర్వాసన వెలువడే ప్రమాదం ఉంది. ► సమీప ప్రాంతాల్లో భూగర్భ జలాలు గరళంగా మారతాయి. ► వీటితో పాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాలిబ్డనమ్, సిలికాన్లు జలాశయం ఉపరితలంపై తెట్టుగా ఏర్పడతాయి. ► జలాశయాల అడుగున క్రోమియం, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, కాడ్మియం, లిథియం వంటి హానికారక మూలకాలు అవక్షేపంగా ఏర్పడతాయి. -
బాలాపూర్ గణేష్ శోభాయాత్ర.. ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: రాజధానిలో సామూహిక గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. తొమ్మిది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను నిమజ్జనం చేసే పనుల్లో భక్తులు నిమగ్నమయ్యారు. నిమజ్జనోత్సవానికి మూడు కమిషనరేట్ల పోలీసులు పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ సాక్షితో మాట్లాడారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర మొదలవుతుందని పేర్కొన్నారు. బాలాపూర్ గణేషుడి శోభాయాత్రకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, గణనాథుడు సాగరానికి చేరేందుకు వీలుగా మార్గం రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. బాలాపూర్ నుంచి సౌత్ జోన్ మీదుగా చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్లో నిమజ్జనం జరుగుతుందని వెల్లడించారు. మూడు వేల మంది ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉంటారని అన్నారు. హుస్సేన్ సాగర్ చుట్టూ 32 భారీ క్రేన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు చదవండి: హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఇవే శోభాయాత్ర జరిగే ప్రధాన రహదారుల్లో సాధారణ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 33 చెరువులు, 74 ప్రత్యేక కొలనుల్లో నిమజ్జనం జరగనున్నట్లు రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జానానికి ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హుస్సేన్ సాగర్ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. హుస్సేన్ సాగర్‌లో 20 వేల విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉందన్నారు. సెంట్రల్ జోన్లోనే ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని, భక్తులు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఖైరతాబాద్ వినాయకుడు మద్యాహ్నం తర్వాత ర్యాలీ ప్రారంభం అవుతుందన్నారు. ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచిస్తున్నామని తెలిపారు. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. రేపు సెలవు గణేష్ నిమజ్జనం సందర్బంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం(సెప్టెంబర్ 9) సెలవు ప్రకటించింది. తిరిగి సెప్టెంబర్ 12న వర్కింగ్ డేగా ప్రకటించింది. -
ట్యాంక్‌బండ్ ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం
-
గణేష్ నిమజ్జనంపై గందరగోళం
-
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనంపై నెలకొన్న గందరగోళం....
హైదరాబాద్: భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనంపై సమాలోచనలు చేస్తోంది. కాగా, గణేష్ నిమజ్జనంపై పోలీసుశాఖలో అయోమయం నెలకొంది. గణేష్ నిమజ్జనంపై నిన్న(సోమవారం) సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. నిమజ్జనంపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హైకోర్టు తీర్పుపై అధికారులతో చర్చించారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం నిమజ్జనానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి ఏడాది మాదిరిగానే.. ట్యాంక్బండ్లోనే గణేష్ నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఇది వరకే ప్రకటించారు. ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఏర్పాట్లను అధికారులు ప్రారంభించారు. పోలీసులు నిమజ్జనంకు వచ్చే విగ్రహాలను అడ్డుకుంటే రోడ్డు మీదనే నిరసన వ్యక్తం చేస్తామని ఉత్సవ సమితి హెచ్చరించింది. చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు.. చదవండి: TS High Court:హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలని పురాణాల్లో చెప్పారా? -
హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
-
TS: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేక కుంట్లలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..) -
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
-
కొత్త టెక్నాలజీ ద్వారా ఈ ఏడాది గణేష్ నిమజ్జనాలు
-
‘సాగర్’లో నిమజ్జనానికి అనుమతిస్తారా?
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అనుమతి ఇస్తున్నారా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా పూర్తిగా పోలేదని, మూడో దశలో భాగంగా ఎప్పుడైనా ఉప్పెనలా విరుచుకుపడే అవకాశం ఉందని, అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి శాశ్వతంగా అనుమతి ఇవ్వరాదని, గతంలో ఇదే ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. హుస్సేన్‌సాగర్‌లో ఎన్ని విగ్రహాలను నిమజ్జనం చేస్తారని ప్రభుత్వం తరఫున హాజరైన స్పెషల్ జీపీ హరీందర్ ప్రసాద్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది అనుమతి ఇవ్వలేదని, ఈ ఏడాది అనుమతి ఇచ్చేదీ లేనిదీ తెలుసుకొని చెబుతానని నివేదించారు. ‘హుస్సేన్‌సాగర్‌లోని నీటిని పరిశుభ్రంగా ఉంచాలి. పరిసరాలను పర్యాటక ప్రదేశంగా అందంగా తీర్చిదిద్దాలి. అప్పుడే పర్యాటకులు ఆకర్షితులవుతారు. ప్రతి ఏడాది హుస్సేన్‌సాగర్‌లో వేల సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది. నగరం నడిబొడ్డున ఉన్న సాగర్‌ను కాలుష్యరహితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విగ్రహాలను నిమజ్జనం చేయాలా వద్దా అన్నదానిపై ప్రభుత్వం ప్రతి ఏడాది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా శాశ్వతంగా నిర్ణయం తీసుకోవాలి’అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేసేందుకు వీలుగా తదుపరి విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. -
చికాగోలో ఘనంగా గణేష్ నిమజ్జనం
చికాగో : అమెరికాలోని చికాగో నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో(ఐఏజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకలకు నగరంలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా విజయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గణేష్ విగ్రహంపై పూల జల్లు కురిపించారు. బ్యాండ్ మేళాతో యువత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు. ఈ సంరద్భంగా ఐఏజీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మనోజ్ సింగంసెట్టి మాట్లాడుతూ.. అందరి సహకారంతో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా ముగించామని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రతిభింబించేలా ఈవెంట్‌ను తీర్చిదిద్దిన డెకరేషన్ టీం స్టార్‌బీమ్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు, కమ్యూనిటీ సభ్యులకు, బోర్డ్ డైరెక్టర్లకు, వాలెంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఏజీసీ వైస్ ప్రెసిడెంట్ హీనా త్రివేది మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకి, స్థానిక ప్రజాపతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏజీసీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హరిందర్‌రెడ్డి పులియాల, రాజేశ్వరి రావత్, తృప్తి పటేల్, రాధికా దేశాయి, విఠల్ దేశాయి, అపర్ణ దేశ్‌ముఖ్, పరూల్ టోపివాలా, విద్యశ్రీ పూజారి, సందీప్ ఎల్లంపల్లి, అంకూర్, పూనమ్, తేజస్ రెడ్డి, మధు, ప్రవీణ్, సత్యనారాయణ, శ్రీనివాస్ కాసల, రాజవర్ధన్‌రెడ్డి, దివ్య, పూనమ్ జైన్, వినోద్ కుమార్, సాక్షి అగర్వాల్, రాజేశ్, మురళి, అనిత మందాడి, మమత ఉప్పల, శిల్ప మచ్చ, భావన పులియాహ, లక్ష్మీ నాగుబండి తదితరులు పాల్గొన్నారు. -
ఖైరతాబాద్ వినాయకుడిని అక్కడ నిమజ్జనం చేస్తాం
సాక్షి, ఖైరతాబాద్: పోలీసు బందోబస్తు మధ్య వినాయక నిమజ్జనాన్ని నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఖైరతాబాద్ గణేశ్ పనులను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 65వ సంవత్సరం జరుగుతున్న వినాయక ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దఎత్తున తరలి వస్తారు కనుక ట్రాఫిక్ మళ్లింపు చేపడతామన్నారు. కరెంట్ ఇబ్బందులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా రాష్ట్రంలో అన్ని మతాల పండుగలు అద్భుతంగా జరుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జనం రోజు ప్రజలు సహకరించాలని కోరారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం చేసుకునేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హుస్సేన్‌సాగర్‌లో లోతైన ప్రాంతంలో ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం జరుగుతుందన్నారు. నగరంలోని వినాయకుల నిమజ్జనం కోసం 32 కొలనులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పోలీసు శాఖ, ఆర్&బీ, జీహెచ్ఎంసీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు
ఇటిక్యాల:ఇటిక్యాల మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రం వద్ద కృష్ణానదిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లును పూర్తిచేసినట్లు గద్వాల డీఎస్పీ బాలకోటి తెలిపారు. బుధవారం బీచుపల్లి వద్ద నదిలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రాంతాన్ని ఆయన పరిశిలించారు. భారీ క్రే న్ల సహాయంతో గణేశ్ విగ్రహాలను నదిలోకి తీసుకెళ్లి నిమజ్జనం చేసేవిధంగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కృష్ణానది వంతెన కింది భాగంలో బుధవారం జేసీబీతో చదును చేయించారు. ఈ ఏడాది కృష్ణానదిలో నీరు పుస్కలంగా ఉండటం సంతోషకరమని అన్నారు. డీఎస్పీ వెంట ఇటిక్యాల ఎస్ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్ సవారన్న తదితరులు ఉన్నారు.