చికాగోలో ఘనంగా గణేష్‌ నిమజ్జనం | Ganesh Immersion Ceremony At Chicago | Sakshi
Sakshi News home page

ఐఏజీసీ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక నిమజ్జనం

Published Wed, Sep 11 2019 7:40 PM | Last Updated on Wed, Sep 11 2019 8:18 PM

Ganesh Immersion Ceremony At Chicago - Sakshi

చికాగో : అమెరికాలోని చికాగో నగరంలో వినాయక నిమజ్జన వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ చికాగో(ఐఏజీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిమజ్జన వేడుకలకు నగరంలోని ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా విజయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా గణేష్‌ విగ్రహంపై పూల జల్లు కురిపించారు. బ్యాండ్‌ మేళాతో యువత వినాయకుడిని నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక వాహనంలో వినాయకుడి విగ్రహాన్ని తరలించి నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.

ఈ సంరద్భంగా ఐఏజీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మనోజ్‌ సింగంసెట్టి మాట్లాడుతూ.. అందరి సహకారంతో వినాయక నవరాత్రోత్సవాలను ఘనంగా ముగించామని తెలిపారు. భారతీయ సంస్కృతి ప్రతిభింబించేలా ఈవెంట్‌ను తీర్చిదిద్దిన డెకరేషన్‌ టీం స్టార్‌బీమ్‌ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విరాళాలు ఇచ్చిన దాతలకు, కమ్యూనిటీ సభ్యులకు, బోర్డ్‌ డైరెక్టర్లకు, వాలెంటీర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఐఏజీసీ వైస్‌ ప్రెసిడెంట్‌ హీనా త్రివేది మాట్లాడుతూ.. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన పోలీసులకి, స్థానిక ప్రజాపతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఏజీసీ అధ్యక్షుడు మల్లారెడ్డి, ఎగ్జిక్యూటీవ్‌ చైర్మన్‌ హరిందర్‌రెడ్డి పులియాల, రాజేశ్వరి రావత్‌, తృప్తి పటేల్‌, రాధికా దేశాయి, విఠల్‌ దేశాయి, అపర్ణ దేశ్‌ముఖ్‌, పరూల్‌ టోపివాలా, విద్యశ్రీ పూజారి, సందీప్‌ ఎల్లంపల్లి, అంకూర్‌, పూనమ్‌, తేజస్‌ రెడ్డి, మధు, ప్రవీణ్‌, సత్యనారాయణ, శ్రీనివాస్‌ కాసల, రాజవర్ధన్‌రెడ్డి, దివ్య, పూనమ్‌ జైన్‌, వినోద్‌ కుమార్‌, సాక్షి అగర్వాల్‌, రాజేశ్‌, మురళి, అనిత మందాడి, మమత ఉప్పల, శిల్ప మచ్చ, భావన పులియాహ, లక్ష్మీ నాగుబండి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement