
శ్రీకాకుళం జిల్లా పాతటెక్కలిలో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను వివరిస్తున్న మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
సాక్షి, నెట్‌వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో గురువారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.
ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment