
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఆర్.వైపాళెం సచివాలయ పరిధిలోని అంకుపల్లి గ్రామంలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు.
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఆర్.వైపాళెం సచివాలయ పరిధిలోని అంకుపల్లి గ్రామంలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాకాణి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తామని అంకుపల్లి గ్రామస్తులు అన్నారు.