
ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటదం..
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడ 17వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని పేర్కొన్నారు.
‘తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి. రాష్ట్రంలో అందరూ బాగుండాలని జగన్ కోరుకుంటున్నారు. అందరూ బాగుండాలని 95 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. మేము మాత్రం బాగుండాలని అమరావతి రైతులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తాం.’ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.
ఇదీ చదవండి: ‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్ మాటంటే మాటే’