KODALI
-
చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి: కొడాలి నాని
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లాలోని గుడివాడ 17వ వార్డులో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్ర, చంద్రబాబులపై విమర్శలు గుప్పించారు. ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని పేర్కొన్నారు. ‘తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారు. చంద్రబాబు సృష్టించిన మాయా లోకమే భ్రమరావతి. రాష్ట్రంలో అందరూ బాగుండాలని జగన్ కోరుకుంటున్నారు. అందరూ బాగుండాలని 95 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. మేము మాత్రం బాగుండాలని అమరావతి రైతులు విచిత్రంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. ఆరు నూరైనా మూడు రాజధానులను కొనసాగిస్తాం.’ అని స్పష్టం చేశారు మాజీ మంత్రి కొడాలి నాని. ఇదీ చదవండి: ‘దళిత జాతిని అవమానపర్చిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్ మాటంటే మాటే’ -
గుంటూరు అత్తా శభాష్... మోదీ అభినందనలు
కోడలికి మరుగుదొడ్డి కానుక ట్వీటర్లో అభినందనలు తెలిపిన మోదీ సత్తెనపల్లి: ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో అవసరానికి ఆరుబయటకు వెళ్లేందుకు నిత్యం ఇబ్బంది పడే ఆమె.. రేపు తన ఇంటికి వచ్చే కోడలు అలాంటి ఇబ్బందులు పడకూడదని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా స్వచ్ఛభారత్ మిషన్ స్ఫూర్తితో మరుగుదొడ్డి నిర్మించి వచ్చిన కోడలికి కానుకగా ఇచ్చి ప్రధాని నుంచి ప్రశంసలందుకుంది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన షేక్ అబ్బాస్ సత్తెనపల్లిలోని హెడ్పోస్టాఫీస్లో పనిచేస్తున్నారు. ఆయన భార్య షంషూన్బేగం తన సోదరుడు సత్తార్ కుమార్తె సల్మాతో తన కుమారుడికి వివాహం చేయాలని నిశ్చయించింది. ఈ నేపథ్యంలో సత్తార్ షంషూన్బేగంలో చైతన్యం తీసుకొచ్చాడు. దీంతో ఆమె స్వచ్ఛభారత్ మిషన్ కింద ప్రభుత్వం ఇచ్చిన రూ. 12 వేలతోపాటు తన బంగారు ఆభరణాలను కుదువపెట్టి మరో రూ. 5వేలు తెచ్చి మరుగుదొడ్డి, స్నానాలగది నిర్మించింది. ఆ తర్వాత షాజహాన్, సల్మాకు వివాహం చేశారు. ఇంటికి వచ్చిన కోడలికి షంషూన్బేగం మరుగుదొడ్డిని కానుకగా అందించింది. ఈ విషయాన్ని మండలాధికారులు ఢిల్లీకి చెందిన రోస్ అనే స్వచ్ఛంద సంస్థకు తెలిపారు. ఆ సంస్థ ప్రతినిధి ప్రశాంతి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు బొల్లవరం వచ్చారు. వాస్తవమని తేలడంతో ఆ సంస్థ ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. కోడలిపై అత్త షంషూన్బేగం చూపిన ప్రేమకు ప్రధాని మోదీ ట్వీటర్లో ప్రశంసించారు. -
కోడలిపై మామ అత్యాచారం
నిందితుడి అరెస్ట్ మండ్య : కోడలి వరుస అయిన మహిళపై మామ అత్యాచారం చేసి గర్భవతిని చేసిన సంఘటన మండ్య జిల్లా మద్దూరు తాలుకాలో జరిగింది. తాలూకాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న అప్పాజీ అనే వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని పోలీసులు చెప్పారు. వివరాలు... వితంతువైన 32 ఏళ్ల యువతి బిడ్డలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె భర్త సొంత బాబాయి అయిన అప్పాజీ జులై 24న ఈమెపై అత్యాచారం చేశాడు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లిన సమయంలో డాక్టర్లు గర్భవతిగా ధ్రువీకరించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అబార్షన్ చేయించడానికి సిద్ధమయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.