కోడలిపై మామ అత్యాచారం | KODALI uncle rape | Sakshi
Sakshi News home page

కోడలిపై మామ అత్యాచారం

Published Tue, Sep 23 2014 2:51 AM | Last Updated on Tue, Oct 2 2018 4:09 PM

KODALI uncle rape

  • నిందితుడి అరెస్ట్
  • మండ్య : కోడలి వరుస అయిన మహిళపై మామ అత్యాచారం చేసి గర్భవతిని చేసిన సంఘటన మండ్య జిల్లా మద్దూరు తాలుకాలో జరిగింది. తాలూకాలోని ఓ గ్రామంలో నివాసముంటున్న అప్పాజీ అనే వ్యక్తిని ఆదివారం అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని పోలీసులు చెప్పారు.
     
    వివరాలు... వితంతువైన 32 ఏళ్ల యువతి బిడ్డలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె భర్త సొంత బాబాయి అయిన అప్పాజీ జులై 24న ఈమెపై అత్యాచారం చేశాడు. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఆస్పత్రికి వెళ్లిన సమయంలో డాక్టర్లు గర్భవతిగా ధ్రువీకరించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వైద్యులు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అబార్షన్ చేయించడానికి సిద్ధమయ్యాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.  
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement