పెళ్లి చేసుకుంటానని లైంగికదాడి.. కేసు నమోదు  | Police Case Registered Against Young Man Over Molestation Case In Guntur | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకుంటానని లైంగికదాడి.. కేసు నమోదు 

Published Sun, Apr 3 2022 10:49 PM | Last Updated on Sun, Apr 3 2022 10:49 PM

Police Case Registered Against Young Man Over Molestation Case In Guntur - Sakshi

రేపల్లె రూరల్‌: పెళ్లి చేసుకుంటానని చెప్పి, మోసగించి లైంగికదాడి చేసి యువతిని గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వి.సూర్యనారాయణ శనివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రేపల్లె మండలం ఊలుపాలెం గ్రామానికి చెందిన కైతేపల్లి రవి అనే యువకుడు తెనాలిలో గత కొన్ని నెలలుగా కార్పెంటర్‌ పని చేసుకుంటున్నాడు.

అయితే తెనాలి పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడి, పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఆ యువతిపై పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు లైంగికదాడి చేశాడు. గర్భందాల్చిన యువతి, తనను వివాహం చేసుకోమని రవిని పలుమార్లు కోరగా తిరస్కరించటంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement