సాక్షి, అమరావతి: ప్రతి రెండున్నర నెలలకు ఓ సారి గడపగడపకు కార్యక్రమంపై సీఎం సమీక్ష ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు పథకాలు చేరకపోతే అనుకున్న ఆశయం నెరవేరదు. ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సీరియస్‌గానే సీఎం సమీక్షించారని పేర్కొన్నారు.
‘‘సిన్సియర్‌గా పనిచేయక పోతే మీకే బాగుండదు, నష్టపోతారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమెటిగ్‌గా అభ్యర్థులుగా ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే అది సర్వేల్లో ప్రతిబింబిస్తుంది. సైంటిఫిక్ మెథడ్ అనుకుని సర్వేను సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచేలా సీఎం ప్లాన్ వేశారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా ఉండాలనే విషయమై సీఎం ఆదేశించారు’’ అని సజ్జల పేర్కొన్నారు.
‘‘ఏ పార్టీకైనా వారి ఎన్నికల స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఓసారి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు వస్తుంటాయి. ఏ సమయంలో వచ్చిన నివేదికను ఫైనల్‌గా తీసుకోవాలనేది సీఎం జగన్ ఇష్టం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. దానిపై చర్చే జరగలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా తిరిగి గెలవాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ చేజార్చు కోవద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.
చదవండి: సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?
Comments
Please login to add a commentAdd a comment