ఒంగోలు: ‘‘అన్నా మీ మేలు మరువలేము, అడగకుండానే అన్నీ ఇస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీ వెంటే ఉంటామంటూ’’ ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక విజయ్‌నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, వడ్డెపాలెం కొండలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందిన కార్యక్రమాలను వివరించారు.
పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇళ్ల పట్టాల గురించి అడగ్గా మార్చినెలలో ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని వివరించారు. జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి పథకం అందుతున్న చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బాలినేని సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి అంజయ్య, తమ్మిశెట్టి వాసు, బండారు ఏడుకొండలు, తమ్మిశెట్టి శ్రీను, బండారు దుర్గయ్య, బండారు వెంకటేశ్వర్లు, బండారు డేవిడ్, బండారు శ్రీను, బండారు అంకమ్మ, గుంజి శివదుర్గ, మక్కిల దుర్గ , శ్రీను, వల్లపు ఆనంద్, గుంజి భరత్, బండారు శివ, బండారు గణేష్, బండారు అంజయ్య, బండారు రమేష్, బండారు ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
ఈ కార్యక్రమంలో బాలినేనితోపాటు ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వైఎస్సార్‌సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, మోడుబోయిన సురేష్‌యాదవ్, సంయుక్త కార్యదర్శి పటాపంజుల శ్రీనివాసులు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షుడు కేవీ ప్రసాద్, గోవర్థన్‌రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, వైఎస్సార్‌సీపీ నాయకులు పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, బడుగు ఇందిర, పోకల అనూరాధ, తమ్మినేని మాధవి, దాసరి కరుణాకర్, వల్లెపు మురళి, జాజుల కృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ యం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment