ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల హృదయాలను సైతం కదిలిస్తున్నాయి. ఇందుకు విశాఖజిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం కాలనీలో మంగళవారం జరిగిన ఘటన అద్దం పడుతోంది.
భీమునిపట్నం ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాపురం ఎస్సీ కాలనీలో నిర్వహించారు.తమ గడప ముందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను కొనియాడారు.
–పద్మనాభం(విశాఖజిల్లా)
‘సంక్షేమ పాలన’కు టీడీపీ ఎంపీటీసీ స్వాగతం
Published Wed, Dec 28 2022 5:59 AM | Last Updated on Wed, Dec 28 2022 5:59 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment