CM YS Jagan Review Meeting On Gadapa Gadapaku Mana Prabhutvam - Sakshi
Sakshi News home page

Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Mon, Jul 18 2022 4:14 PM | Last Updated on Mon, Jul 18 2022 7:49 PM

CM YS Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam - Sakshi

సాక్షి, అమరావతి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రిజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం చేశారు.
చదవండి: 48 గంటల్లోపు ప్రతీ ఒక్కరికీ సాయం అందించాలి: సీఎం జగన్‌

కీలక ఆదేశాలు..
ఈ సమీక్షలో సీఎం జగన్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకర్గ అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు. ప్రతి నెల 6 లేదా 7 సచివాలయాలు సందర్శించాలని సీఎం ఆదేశించారు. ప్రతి సచివాలయంలో సమస్యల పరిష్కారానికి రూ.20 లక్షల నిధులు ఇస్తామని సీఎం తెలిపారు. సచివాలయం విజిట్‌ పూర్తయిన వెంటనే కలెక్టర్లు నిధులిస్తారని సీఎం ప్రకటించారు. 10 రోజుల్లోపు గడప గడప చేసిన వారి పేర్లు సీఎం జగన్‌ చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..:
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం
జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం
అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం
గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా నాణ్యతతో చేయండి

పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం
ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నాం
అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టాం
రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి
వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలి
అధికారంలోకి మామూలుగా రావడంకాదు, మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావాలి
కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాం
అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేం?
రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించాం
వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేం?

నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను 
ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి 
ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం
పథకాలకు బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం
ప్రతినెలా క్యాలెండర్‌ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్‌ నొక్కుతున్నాం
ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని నా ధర్మంగా.. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను
దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్‌ అయ్యింది
దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత
ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం
ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం
అలాంటి పరిస్థితి మనకళ్లముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకేయాలి
గతంలో కన్నా.. మెరుగ్గా ఫలితాలు సాధించాలి

ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు
గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ డబ్బు ఖర్చు
ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబం«ధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇవ్వనున్నాం:
తర్వాత వెంటనే పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ
ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం
ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్‌) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు

సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం
ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను నేను తీసుకున్నాను
ఇక మీరు చేయాల్సిందల్లా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే

గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న  నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి
వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి 
కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి
గడప,గడపకూ కార్యక్రమాన్ని మానిటర్‌ చేయాలన్న సీఎం
ఇందు కోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement