
కర్నూలు జిల్లా బంటనహాళ్ గ్రామంలో మహిళకు ప్రభుత్వ పథకాలను వివరిస్తున్న కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రభుత్వం అందించే పథకాల వివరాలు తెలుసుకుంటున్నందుకు స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్‌కి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని దీవిస్తున్నారు. అన్ని జిల్లాల్లో మంగళవారం ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.