
నాదంతా ఓవర్‌యాక్షనే
నాదంతా ఓవర్ యాక్షనేనని సీనియర్ నటి జ్యోతిక వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరం వరకు పలుభాషల్లో
నాదంతా ఓవర్ యాక్షనేనని సీనియర్ నటి జ్యోతిక వ్యాఖ్యానించారు. 2000 సంవత్సరం వరకు పలుభాషల్లో చిత్రాలు చేసి ప్రముఖ నటిగా రాణించిన నటి జ్యోతిక. నటుడు సూర్యతో కలిసి నటిస్తున్న సమయంలోనే ఆయనతో ప్రేమలోపడి పెళ్లి చేసుకుని నటనకు దూరమైన జ్యోతిక భర్త, పిల్లలు అంటూ సంసార జీవితానికి ఆహ్వానం పలికారు. అలాంటిది సుమారు ఎనిమిదేళ్ల తరువాత 38 వయసుదినిలే అంటూ ఇటీవల ముఖానికి రంగేసుకుని మరోసారి తెరపైకొచ్చారు. మలయాళంలో హౌఓల్డ్ ఆర్‌యూ పేరుతో విడుదలయ్యి సూపర్‌హిట్ అయిన ఈ చిత్రం తమిళంలోనూ మంచి విజయాన్ని సాధించింది.
ఒక ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడుతూ ‘38 వయసుదినిలే చిత్రం విజయం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. నిజానికి నేనీ చిత్రంతో చాలా కొన్ని సన్నివేశాల్లోనే యధార్థంగా నటించాను. మిగతా సన్నివేశాలన్నిటిలోనూ ఓవర్ యాక్షనే కనిపిస్తుంది. ఈ చిత్రమే కాదు ఇంతకు ముందు నటించిన చిత్రాలు చూస్తున్నప్పుడు నా యాక్టింగ్ కొంచెం ఓవర్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతెందుకు చంద్రముఖి చిత్రంలో నేను బాగా చేశానని పలువురు ప్రశంసించారు.
ఆ చిత్రంలోనే నాది ఓవర్‌యాక్షనే. ఎప్పటికప్పుడు సహజత్వానికి దగ్గరగా నటించాలని అనుకునేదాన్ని. షూటింగ్‌కు వెళ్లిన తరువాత కాస్త తగ్గించి నటిస్తుంటే దర్శకులు వచ్చి ఏమిటమ్మా ఒంట్లో బాగోలేదా?ఏదయినా సమస్యా?అంటూ ప్రశ్నలు వేస్తూ ఇంకాస్త ఉత్సాహంగా నటించమ్మా అని చెప్పేవారు. అలా నన్ను ఓవర్ యాక్షన్ నుంచి బయట పడకుండా చేసేశారు..’ అని జ్యోతిక అన్నారు. అన్నట్టు ఈమె నటించిన 36 వయదినిలే చిత్రం ఇప్పుడు రావమ్మా మహాలక్ష్మి పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. అక్కడ ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో వెచి చూడాల్చిందే.