
బాధితుడు లక్ష్మీకాంత్‌రెడ్డి
అనంతపురం సెంట్రల్: ట్రాఫిక్ ఎస్‌ఐ రెచ్చిపోయారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ వాహనదారునిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. ఈ ఘటన మంగళవారం రాత్రి పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై చోటు చేసుకుంది. బాధితుని కథనం మేరకు... అనంతపురంలోని ఆదర్శనగర్‌లో నివాసముంటున్న నారాయణరెడ్డి కుమారుడు లక్ష్మీకాంతరెడ్డి వ్యక్తిగత పనిపై కారులో బయటకు వచ్చారు. రాత్రి 9 గంటలకు పీటీసీ సమీపంలోని ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా కారు ఆకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో కొంత ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ ఎస్‌ఐ శేషగిరి అక్కడికి చేరుకుని లక్ష్మీకాంతరెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పొరపాటు జరిగింది. వదిలేయండి అంటూ ప్రాధేయపడినా వినలేదు. జరిమానా వేయడంతో.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిమానా రుసుం చెల్లిస్తానని లక్ష్మీకాంతరెడ్డి తెలిపారు. దీంతో ఎస్‌ఐ శేషగిరి రెచ్చిపోయాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా భౌతిక దాడికి దిగారు. తాను చేసిన తప్పేమిటంటూ అడుగుతున్నా వినకుండా దాడి చేసినట్లు బాధితుడు వాపోయారు. మనస్థాపానికి గురైన బాధితుడు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేరారు.
ఎస్‌ఐ శ్రీరామ్ రాయబారం
ఘటన విషయం ఉన్నతాధికారులకు తెలియకుండా ఉండేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. హుటాహుటిన టూటౌన్ ఎస్‌ఐ శ్రీరామ్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధితునితో చర్చించారు. అతనికి దగ్గర బంధువైన మరో లీడర్ ద్వారా రాజీ చేయించి, వెనువెంటనే డిశ్చార్జి అయ్యేలా రాయబారం నడిపారు. తప్పు చేయనప్పుడు అంత వేగంగా సంప్రదింపులు చేయాల్సిన అవసరం పోలీసులకేముందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మర్యాదగా మాట్లాడుకుందాం... ఫ్రెండ్లీ పోలీసులు అనే పదాలు పేరుకు మాత్రమే అన్న ధోరణి పోలీసుల్లో వ్యక్తమవుతోందని ఈ సందర్భంగా పలు వురు వ్యాఖ్యానించారు. దీనిపై ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణయ్యను వివరణ కోరేందుకు యత్నిం చగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment