సాక్షి, నెల్లూరు: అసత్య కథనాలతో రోజురోజుకు దిగజారుతున్న ఈనాడు రామోజీరావుకు షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో పని చేసే నలుగురు ఈనాడు రిపోర్టర్ల పై కేసు నమోదు చేయాలని జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నుడాలో అక్రమాలు అంటూ.. 2022లో ఈనాడులో వచ్చిన కథనంపై అప్పటి వీసీ రమేష్ కోర్టుకు వెళ్లారు.
దళితుడు కావడంతోనే తనపై అసత్యాలు రాశారని.. తనకు న్యాయం చేసి.. రోత రాతలు రాసిన రిపోర్టర్లపై చర్యలు తీసుకోవాలని అప్పటి నుడా వీసీ రమేష్ కోర్టుకెక్కారు. నలుగురు ఈనాడు రిపోర్టర్స్‌పై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖను నెల్లూరు జిల్లా కోర్టు ఆదేశించింది.
చదవండి: టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం
అసలు కేసు నేపథ్యమేంటీ?
నుడా ఏంటీ గడబిడ అంటూ ఈనాడు పత్రిక మే 2022న ఒక వార్తను అచ్చేసింది. అందమైన అబద్దాలన్నింటిని ఏర్చికూర్చి దానికి తన సొంత పైత్యాన్ని జోడించి పాఠకుల ముందేసింది.
నుడా అంటే నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ. దీని పరిధిలో వేస్తోన్న లేఅవుట్‌కు సంబంధించి అనుమతి కోసం నిర్వాహకుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించింది. నుడాలో కీలక బాధ్యత నిర్వహిస్తోన్న ఓ అధికారిపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ కథనం అల్లింది.
ఈ కథనంపై అప్పటి వైస్ ఛైర్మన్ రమేష్ కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కథనం అచ్చేసిందని, ఈనాడుపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దానికి విచారణ జరిపిన న్యాయస్థానం నలుగురు రిపోర్టర్లపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment